– మసీదు, చర్చిల్లో లేని నిబంధనలు గుళ్లకే ఎందుకు?
– టికెట్లు, ప్రత్యేక హారతి, ప్రత్యేక దర్శనాలకు ఫీజులెందుకు?
– మసీదు, చర్చిలకు లేని నిబంధనలు గుళ్లకే ఎందుకు?
– మసీదు, చర్చి డబ్బులు ప్రభుత్వం ఎందుకు తీసుకోదు?
– దేవాలయాల ఆదాయంపైనే సర్కారు పెత్తనం ఎందుకు?
మసీదులో ముస్లింలెవరైనా ప్రార్ధనలు చేసుకోవచ్చు. చర్చిలో క్రైస్తవులెవరైనా ప్రార్ధనలు చేసుకోవచ్చు. అందుకు ఆ భక్తులు ఎవరికీ ఫీజులు, టిె ట్లకు డబ్బు చెల్లించనక్కర్లేదు. కానీ, హిందూ దేవాలయాలకు మాత్రం అడుగడుగునా ఫీజులే. చెప్పుల స్టాండు నుంచి మొదలయ్యే ఫీజులు.. ప్రత్యేక పూజల వరకూ విజయవంతంగా కొనసాగుతాయి. పైగా ఏ పూఓకు ఎంత ఫీజన్నది బోర్డుల్లో దర్శనమిస్తుంది. ‘క్రైస్తవులు-ముస్లింలకు లేని ఈ సౌకర్యం’.. ప్రత్యేకంగా హిందువులకే ఎందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలకు జవాబిచ్చే మొనగాడే లేడు.
అబ్దుల్: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను.
తల్లి: సరే
పీటర్: అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను.
తల్లి: సరే, సహకారం కోసం ₹10 తీసుకోండి.
రమేష్: అమ్మా, నాకు గుడికి వెళ్లాలని ఉంది. దయచేసి నాకు కొంతడబ్బు ఇవ్వండి.
అమ్మ: ఎంత?.
రమేష్:
1. వాహన పార్కింగ్ ₹ 30.
2. చప్పల్ టోకెన్ ₹ 5.
3. సెల్ ఫోన్ టోకెన్ ₹ 10.
4. దర్శనం టికెట్ ₹100.
5. పూజా టోకెన్ ₹ 10.
6. ప్రసాదం ₹ 50.
7. హరతి పళ్ళెంలో ₹ 20.
8. హుండీలో ₹ 20
మొత్తం. ₹245.
హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?. ఏ రాష్ట్ర/కేంద్రం ప్రభుత్వ యంత్రాంగం ఒక్క ఆలయాన్ని కూడా నిర్మించలేదు. దేవాలయ నిర్వహణకు తమ ఖజానా సొమ్మును ఖర్చు చేయడం లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి హుండీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?.
ఇంకా ప్రభుత్వమే దేవాలయాల నుంచి నిధులు తీసుకుంటోంది. మరి చర్చి, మసీదులకు భక్తులు ఇచ్చే విరాళాలను ప్రభుత్వం, దేవాలయాల మాదిరిగానే ఎందుకు తీసుకోదు? హిందూ దేవాలయాలకే ‘ ఈ సౌకర్యం’ ఎందుకు? ఎవరూ ప్రశ్నించరా? చర్చి, మసీదుల్లో దర్శనాలకు లేని టికెట్లు, ప్రత్యేక దర్శనాలు, బ్రేక్ దర్శనాల టికెట్లు, ఫీజులు ఒక్క దేవాలయాలకే ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రతి ఏటా కామన్ గుడ్ ఫండ్ కింద దేవాయాల స్థాయిని బట్టి, ప్రభుత్వం నిధులు సేకరిస్తోంది.
మరి సెక్యులర్ దేశమయినప్పుడు అదే పద్ధతిలో చర్చి, మసీదుల ఆదాయం నుంచి కూడా కామన్‌గుడ్ ఫండ్ కింద, ప్రభుత్వం నిధులు ఎందుకు సేకరించదు? అంటే హిందువులంటే ప్రభుత్వానికి అలుసా? ఏ నిర్ణయాలు తీసుకున్నా హిందువులు ప్రశ్నించరన్న ధీమానా? మిగిలిన మతాల జోలికి వెళితే ఓట్లు పోతాయన్న భయమా? అందరూ ఆలోచించాలి.
– లక్ష్మణరావు