కడలి పుత్రుల కడుపుకొడుతూ, కట్టుకథలు, కల్లబొల్లి మాటలా జగన్ రెడ్డి?

• జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది
• రాష్ట్రంలో 20లక్షలకు పైగా మత్స్యకారులుంటే, కేవలం లక్షమందికి భృతి ఇస్తే వారిని ఆదుకున్నట్టా?
• జగన్ ఇచ్చే రూ.10వేల మత్స్యకారభృతితో కుటుంబం బతికేస్తుందా?
• మత్స్యకారులకు రూ.500కోట్లు ఇచ్చానని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం.
•బాపట్లలో టీడీపీప్రభుత్వం నిర్మించిన హేచరీని నాశనంచేసిన జగన్ రెడ్డి, ఏ ముఖంపెట్టుకొని అక్కడే సభపెట్టాడు?
• టీడీపీహాయాంలో 17వేల పడవలకు డీజిల్ సబ్సిడీ ఇస్తే, జగన్ 1100 పడవలేనని ఎలా చెబుతాడు?
• జీవోనెం-217తో మత్స్యకారుల్ని రోడ్డునపడేసిన జగన్ వారిని ఉద్ధరిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటు
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని, వేటనిషేధసమయంలో మత్స్యకారులకుఉపాధి కల్పించిన మొదటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడేనని, రూ.4వేలు ఇచ్చి మత్స్యకారుల్ని ఆదుకుంది టీడీపీప్రభు త్వమేనని, జగన్ కొత్తగా వారికిచేస్తున్నది ఏమీలేదని, రాష్ట్రంలో 20లక్షలకు పైగా మత్స్యకారులుంటే కేవలం లక్షమందికి అరకొరసాయంచేస్తూ జగన్ వారిని వంచిస్తున్నాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయన మాటల్లోనే …

“మత్స్యకారులకు ఇచ్చేఅరకొరసాయానికి కూడా జగన్ అతనిప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అమ్మఒడి ఇస్తే, మత్స్యకారభృతి ఇవ్వమని, ఇతరపథకాలు పొందితే అర్హులు కారని చెబుతూ, కడలిపుత్రుల కడుపుకొడుతోంది. ఒకకుటుంబంలో నలుగురు చేపలవేటకు వెళ్తే, వారిలో ఒకరికే మత్స్యకారభృతి ఇవ్వడం వారికి అన్యాయం చేయడంకాదా? మత్స్యకారుల పిల్లలు ఉన్నతచదువులు చదువుకోకూడదా? కొడుకు ఫీజురీయింబర్స్ మెంట్ పొంది తే, తండ్రికి మత్స్యకారభృతి ఇవ్వరా? ఇలా మత్స్యకారుల్ని మోసగిస్తున్న జగన్, వారిని తానే ఆదుకుంటున్నట్టు నేడు బాపట్లలో పచ్చిఅబద్ధాలు చెప్పాడు.

చంద్రబాబు హాయాంలో లీటర్ డీజిల్ ధర రూ.70లుఉంటే, దానిలో మత్స్యకారులకు రూ.6లు సబ్సిడీ అందేది
జగన్ మాటలకు, క్షేత్రస్థాయిలో అతనిప్రభుత్వ పనితీరుకి ఎక్కడా పొంతనలేదు. మత్స్యకా రులు చనిపోతే గతంలో టీడీపీ ప్రభుత్వంలో కేవలం 15రోజుల్లోనే కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రం అందించడం జరిగింది. నేడు జగన్ ప్రభుత్వంలో నెలలతరబడి అధికారులు చుట్టూతిరిగినా పత్రాలు ఇచ్చేపరిస్థితిలేదు. జగన్ ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేలతోనే ఒక కుటుంబం సంవత్సరం మొత్తం బతికేస్తుందా?

గతంలో చంద్రబాబుగారు వేలాదిమంది మత్స్యకారులకు 75-90శాతంసబ్సిడీతో వలలు, పడవలు, చేపలనిల్వకు అవసరమైనఐస్ బాక్సులు, ద్విచక్రవాహనాలు అందించారు. వేటనిషేధ సమయంలో ఒక్కో మత్స్యకారుడికి రూ.4వేల ఆర్థికసాయం అందించారు. చంద్రబాబు మత్స్యకారులకు అందించిన పథకాలన్నీ రద్దుచేసిన జగన్, కేవలం లక్షమందికే అరకొర సాయంచేస్తూ, మొత్తంమత్స్యకారవర్గాన్నే ఉద్ధరిస్తున్నట్టు సిగ్గులేకుండా కబుర్లు చెబుతున్నాడు.

చంద్రబాబు హయాంలో లీటర్ డీజిల్ ధర రూ.70లుఉంటే, దానిపై మత్స్య కారులకు రూ.6లు సబ్సిడీ ఇచ్చాము. వైసీపీప్రభుత్వంవచ్చాక డీజిల్ ధర రూ.102 కు చేరింది. రూ.32లుధరపెంచి, సబ్సిడీని రూ.9కిపెంచితే మత్స్యకారులకు మేలు చేసినట్టా? మత్స్యకారుల నుంచి డీజిల్ పై వసూలుచేస్తున్న సొమ్ముతోనే బంక్ ల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఆయిల్ సబ్సిడీపేరుతో జగన్ మత్స్యకారులసొమ్ముని కూడా దోచు కుంటున్నారు. ఆయిల్ సబ్సిడీ జగన్ ఎంతమంది మత్స్యకారులకుఇస్తున్నాడో చెప్పాలి.

మత్స కారుల్ని ఉద్ధరిస్తున్నానంటూ కబుర్లు చెబుతున్నాడు
1999-2004 మధ్య టీడీపీప్రభుత్వం కేవలం మత్స్యకారుల పిల్లలకోసమే 3 మత్స్యకార రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేయడం జరిగింది. అలానే 2014-19 మధ్య 6 రెసిడెన్షి యల్ స్కూళ్లు ఏర్పాటుచేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జిల్లాకు ఒకటిచొప్పున మత్స్యకారరెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటచేసిన ఘనత చంద్రబాబుగారిదే. వాటితోపాటు ఒక జూనియర్ కాలేజీ పెట్టారు. ఈ 4ఏళ్లలో జగన్ ఒక్కమత్స్యకార పాఠశాలైనా కొత్తగా ఏర్పాటుచేశాడా?

పోనీ చంద్రబాబు ఏర్పాటు చేసిన స్కూళ్లలోని వసతులు, సిబ్బంది గురించి ఆలోచించాడా? హుద్ హుద్ తుఫాన్ తో దెబ్బతిన్నఇళ్లస్థానంలో చంద్రబాబు 2,500 ఇళ్లునిర్మిస్తే, వాటిని జగన్ ఇంత వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదు? మరబోట్ల మరమ్మతులకోసం టీడీపీప్రభు త్వం రూ.17కోట్లు ఇచ్చింది.. జగన్ ఒక్కరూపాయైనా ఇచ్చాడా? తుఫాన్లు వచ్చినప్పుడు ఉపాధిలేక ఇబ్బందులుపడుతున్న మత్స్యకారకుటుంబాలను చంద్రబాబుఆదుకున్నారు. ఒక్కోకుటుంబానికి 50కిలోలబియ్యం నిత్యావసరాలు అందించారు.

జగన్ తుఫాన్లసమయం లో ఒక్క మత్స్యకారకుటుంబాన్ని అయినా పరామర్శించాడా? బాపట్లలో టీడీపీప్రభుత్వం రూ.20కోట్లతో చేపలహేచరీ నిర్మాణాన్ని ప్రారంభిస్తే, జగన్ 4ఏళ్లలో దానిముఖంచూసింది లేదు. మత్స్యకారుల్ని రోడ్డునపడేయాలన్న దురుద్దేశంతోనే తరతరాలుగా వారికింద ఉన్న చెరువులకు ఆన్ లైన్ ఆక్షన్ పెట్టించడానికే జగన్ జీవో-217 తీసుకొచ్చాడు. చెరువుల్లో మత్స్యకారులు అడుగేపెట్టకూడదన్న ఉద్దేశంతో, తనపార్టీ దళారులకుమేలుచేయడానికే జగన్ జీవో 217 తీసుకొచ్చాడు.

తీరప్రాంతాల్లో చేపలవేట మందగించి, ఇబ్బందులు పడుతు న్న మత్స్యకారులకోసం టీడీపీప్రభుత్వం డీప్‌సీ బోట్ల నిర్మాణానికి 50శాతం రాయితీ ఇచ్చిం ది. తీరప్రాంతాల్లో తమిళనాడు మత్స్యకారులు స్పీడ్ బోట్లలో వేటాడుతూ, ఏపీ మత్స్యకారు లకడుపు కొడుతుంటే జగన్ ఎందుకు నోరెత్తడంలేదు? ఏనాడైనా తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాడా? కోస్ట్ గార్డ్ సాయంతో పొరుగురాష్ట్ర మత్స్యకారుల్ని అడ్డుకునే కట్టడిచేశాడా?

ఏళ్లనుంచి సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్, సెస్సుపేరుతో రొయ్యలరైతుల్ని దోచుకుంటున్నది జగన్
మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి బతక్కుండా బయట చిన్నచిన్న వ్యాపారాలు చేసు కుంటుంటే, వారిని కూడా జగన్ దోచుకుంటున్నాడు. అధికారంలోకి వస్తే మత్స్యకారులకు యూనిట్ విద్యుత్ రూ.2కే ఇస్తానన్న జగన్, యూనిట్ రూ.5.35పైసలకు ఇస్తున్నది నిజం కాదా? టీడీపీప్రభుత్వం మత్స్యకారుల ఆక్వాజోన్లకు ఉచితంగా ట్రాన్స్ ఫార్మర్లు అందిస్తే, జగన్ వచ్చాక కరెంట్ లైన్లువేయడానికి, ట్రాన్స్ ఫార్మర్లకు మత్స్యకారులనుంచి డబ్బులు వసూలుచేస్తున్నాడు. 2014-15 నాటికి రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులఎగుమతులు రూ.30వే లకోట్లుంటే, చంద్రబాబుగారు దాన్ని రూ.70వేలకోట్లకు పెంచారు.

ఆక్వారైతులకు కావాల్సిన ఏరివేటర్స్, ఇతరత్రా వసతులు టీడీపీప్రభుత్వం సబ్సిడీపై అందించింది. ప్రాసెసింగ్ యూని ట్లు, ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుచేసింది. జగన్ హయాంలో సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ పేరుతో ఆక్వా రైతుల్ని దోచుకుంటున్నారు. నాణ్యమైన సీడ్ రాష్ట్రంలో దొరక్కుండా చేస్తున్న జగన్ ప్రభుత్వ దోపిడీతో ఆక్వారైతులు పెద్దఎత్తుననష్టపోతున్నారు. నాణ్యమైన రొయ్యపిల్లలు తయారుచే యలేక, జగన్ అండ్ కో కి జేట్యాక్స్ కట్టలేక ఆక్వారైతులు నష్టపోతున్నది నిజంకాదా? రొ య్యలపై సెస్సు వసూలుచేస్తున్న ఏకైకముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.

4ఏళ్లలో ముఖ్యమంత్రిగా ప్రజల సొమ్ము లక్షకోట్లు కొట్టేసిన వ్యక్తి పేదవాడా?
బాపట్లసభలో నేడు జగన్ మాటలు వింటే నవ్వొస్తోంది. తాను పేదవాడినని దేశంలోనే ధనికు డైన ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంకాదా? పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకే జగన్ కు చెమట లు పడుతున్నాయి. రాష్ట్రం ఆర్థికఇబ్బందుల్లో ఉన్నా, బడ్జెట్ తక్కువైనా లెక్కచేయకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబుగారు ప్రజలసంక్షేమానికి రూ.2లక్షలకోట్లు ఖర్చు పెట్టా రు. జగన్ మాదిరి సంక్షేమం ముసుగులో రూ.10లక్షలకోట్లు దోచుకోలేదు. తాడేపల్లిలో ఇల్లు కట్టాను అంటున్న ముఖ్యమంత్రి మొన్నటివరకు విశాఖ వెళ్తున్నానని ఎందుకుచెప్పాడు?

ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోఉన్నా జగన్ చంద్రబాబుగారిపై అవినీతిఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఉత్తుత్తి ఆరోపణలు తప్ప ఒక్కటైనా నిరూపించాడా? ఛార్జ్ షీట్లతో సహా 40 సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ నీతిమంతుడినని చెప్పడం సిగ్గుచేటు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ దోచుకున్న రూ.43వేలకోట్లను ఈడీ జప్తుచేసింది. ప్రజల ప్రాణాలు, రాష్ట్రభవిష్యత్ తో సంబంధంలేకుండా ఈ 4ఏళ్లలో మద్యం, డ్రగ్స్ అమ్మకాలతో ఖజా నా నింపుకుంటున్నాడు. ఈడీద్వారా రూ.43వేలకోట్లు అటాచ్ చేయించుకొని, 4ఏళ్లలో లక్షల కోట్లు కొట్టేసిన, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి, బెంగుళూరులో భారీ ప్యాలెస్ లు కట్టు కున్న జగన్ పేదవాడా?

40 సంవత్సరాలుగా నీతి, నిజాయితీ, క్రమశిక్షణలతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు పేదవాడా? రాజధానిప్రాంతంలో ఉండటానికి చంద్రబాబు వేరే ఇంట్లో అద్దెకు ఉంటుంటే, దాన్ని ఆయనకు రాసిచ్చారని జగన్ నిందలువేస్తున్నాడు. జగన్ అభాం డాలు, కల్లబొల్లి మాటలు, కట్టుకథలు నమ్మడానికిప్రజలు సిద్ధంగా లేరు. జగన్ మత్స్యకారు లకు, మత్స్యకారభరోసాకింద రూ.500కోట్లు ఇచ్చాననిచెప్పడం నిజంగా పచ్చిఅబద్ధమే. ఓ. ఎన్.జీ.సీ వారు తమ పరిధిలోని సముద్రప్రాంతంలో వేటను నిషేధించినందుకు, మత్స్యకారు లకు ఇస్తున్నసాయాన్ని కూడా జగన్ తాను ఇస్తున్నట్టుచెప్పుకోవడం సిగ్గుచేటుకాదా.?” అని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Leave a Reply