Suryaa.co.in

Andhra Pradesh

సర్వేపల్లి భూపంపిణీ వివరాలను బయటపెట్టడంలో అంత రహస్యమెందుకో?

-కాకాణి బినామీల పేర్లతో 2300 ఎకరాలను ధారాదత్తం చేశారు
-గ్రామసభలు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తన వారికి పంచుకోవడానికి అవి ప్రభుత్వ భూములా, కాకాణి తాత ఆస్తులా
-ఆ భూములు ఎవరికి ఇచ్చారో తేలేవరకూ వదిలే ప్రసక్తే లేదు
-ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు మంత్రి చెప్పినట్టు ఇష్టారీతిన సంతకాలు పెట్టడం సరికాదు
-తుఫాన్ సాయం పంపిణీ చేయకుండా రూ.51 కోట్లు ఎగ్గొట్టారు. ప్రభుత్వమే పంపలేదా. ఇక్కడ కాకాణి భోంచేశారా
-ముత్తుకూరు బలిజపాళెంలో మీడియాతో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అసైన్మెంట్ భూముల పట్టాల పంపిణీ వ్యవహారాన్ని మంత్రి కాకాణి గందరగోళంగా మార్చాడు. రోజుకొక సంఖ్య చెబుతున్నాడు. నిన్న కాకాణి 5600 ఎకరాలు పంపిణీ చేశామని చెప్పాడు.కలెక్టరేట్ అధికారులు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో మాత్రం 3300 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామని చెబుతున్నారు.

మిగిలిన 2300 ఎకరాల భూములు ఏమయ్యాయి. ఆ భూముల పంపిణీ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు.ఈ భూముల పంపిణీ వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు.గ్రామసభలు పెట్టకుండా ఇష్టారీతిన కాజేయడానికి అవేమైనా కాకాణి తాత ఆస్తులా? ప్రభుత్వ భూముల్లో పేదలకు పట్టాలు పంపిణీ చేసేటప్పుడు ఇంత రహస్యమెందుకు..వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 70 వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను చిన్నవివాదం కూడా లేకుండా డీకేటీ పట్టాలుగా మార్చాం. ప్రజల కోస పనిచేయాలని సర్వేపల్లి నియోజకవర్గంలోని తహసీల్దార్లకు సూచిస్తున్నా.మంత్రి కాకాణి బినామీల కోసం సంతకాలు పెట్టుకుంటే పోతే చివరగా అడ్డంగా బుక్కయ్యేది అధికారులేనని గుర్తుంచుకోండి. ఆ 2300 ఎకరాల భూములను ఎవరికి ధారాదత్తం చేశారో తేలేవరకు వదిలిపెట్టబోము.

ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు అడుగుతుంటే కలెక్టర్ ఎందుకు స్పందించరు.సర్వేపల్లి నియోజకవర్గంలో తుఫాన్ సాయం పేదలకు పంపిణీ చేయకుండా రూ.51.60 కోట్లు ఎగ్గొట్టారు.ఈ నిధులను ప్రభుత్వమే మంజూరు చేయలేదా..లేక సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి భోంచేశారా?

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీరాలు పలుకుతారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో వారికి తుఫాన్ సాయం పంపిణీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు.

LEAVE A RESPONSE