– బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
– రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.
గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, వల్లూరు గ్రామంలో వడ్డే ఈరమ్మ(50) చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈరమ్మ 10-09-2023న గుండెపోటుతో మరణించారు. ఈరమ్మ భర్త ఈరయ్య, కుమారులు
పెద్దనాగేశు, చిన్ననాగేశు, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం మంత్రాలయం టౌన్, రామచంద్రనగర్ లో మిద్దిలదిన్నె రంగమ్మ(41) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగమ్మ భర్త అంజినాయుడు, కుమార్తె లక్ష్మి, మనుమరాలు మల్లీశ్వరి, మనుమడు భీమేష్ లను భువనేశ్వరి ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు.
అధైర్యపడొద్దు తల్లీ…మీకు మేమున్నాం, భువనేశ్వరికి మంత్రాలయం ప్రజల భరోసా:-
మంత్రాలయం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన భువనేశ్వరికి అక్కడి ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో సన్మానించారు. మీ కుటుంబానికి కష్టం వస్తే మేమంతా ఉన్నాం తల్లీ అంటూ భువనేశ్వరికి ధైర్యం చెప్పారు. తనను పలకరించడానికి వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులను భువనేశ్వరి ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
తనకు ధైర్యం చెప్పిన ప్రజలు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పారు. మంత్రాలయం నియోజకవర్గం ప్రారంభం నుండి పర్యటన ముగిసేవరకు భువనేశ్వరి వెంట పార్టీ కార్యకర్తలు, జిల్లా నాయకులు, నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున కొనసాగారు.