కొండముచ్చుకు వినతిపత్రం ఇచ్చిన అంగన్వాడీలు

సహజంగా ఎవరైనా నిరసన ప్రదర్శనలు చేసిన తర్వాత కలెక్టర్లు.. ఆర్డీఓలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. అయితే ఏలూరులో ఆందోళనకారులు, తమ

నిరసనను విచిత్ర పద్ధతిలో నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు.. అక్కడికి వచ్చిన కొండముచ్చుకు వినతిపత్రం సమర్పించి, వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలు చేస్తున్న అంగన్వాడీల వద్దకు వచ్చిన సదరు కొండముచ్చు, చిద్విలాసంగా కూర్చుని కాసేపు వారి నిరసన ప్రదర్శన తిలకించింది.

ఈలోగా అంగన్వాడీలకు ఏమి ఐడియా వచ్చిందో తెలియదు గానీ… అధికారులకు ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని, సదరు కొండముచ్చుగారికి ఇవ్వడం, అది తీసుకోవడం చకాచకా జరిగిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. సీఎం జగన్‌కు వినిపించేంత వరకూ తమ నిరసన వినిపిస్తామంటూ.. అంగన్వాడీలు కంచాలతో పెద్దగా శబ్దాలు చేశారు.

కనీస వేతనం, గ్రాట్యుటీ, ఇతర డిమాండ్లను ఆమోదించాలని డిమాండ్ చేస్తూ.. అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరుకుంది.సమ్మెలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. దీక్షా శిబిరం దగ్గరకు వచ్చిన కొండముచ్చుకి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు విజయవాడలో అంగన్వాడీలు పళ్లేలు మోగిస్తూ వినూత్న నిరసన తెలిపారు. తమ మోత సీఎంకు వినపడేలా నిరసన చేస్తున్నామన్నారు.

Leave a Reply