-ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా … మీ అందరికీ ఉపయోగపడేలా ఉండాలి
-కేంద్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చేలా కృషి చేయాలి
-మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి
నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాలను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఈ పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నేను ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా… సారధిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నేను అనేక పదవులు నిర్వహించినాను, ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా … మీ అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో అధికారం వచ్చేలా కృషి చేయాలి