గుడ్డలిప్పదీస్తారా? నగ్నంగా తిప్పుతారా?

-పాల్తూరు సంఘటనపై బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ఆగ్రహం

ప్రజలపై అణచివేతను అస్త్రంగా ప్రయోగిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఆఖరికి గుడ్డలిప్పదీసి, ఊరేగించే దుర్మార్గ స్థితికి చేరిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.‌మంగళవారం మీడియాకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లా పాల్తూరు పోలీసులు చంద్రమోహన్ అనే తేదేపా కార్యకర్తపై ప్రవర్తించిన తీరు పోలీసు శాఖకే తలవంపులు అన్నారు.

వైకాపా జెండా కాల్చాడు అనే ఆరోపణపై ఐపిసి పోలీసులు వైసిపి నాయకుల పట్ల స్వామి భక్తిని ప్రదర్శించి, పక్కటెముక ఇరిగేలా కొట్టి, వంటిపై గుడ్డలు ఊడదీయించి దాష్టీకానికి పాలపడ్డారని తెలిపారు. ఆరోపణలు ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి, కోర్టుకు పంపాల్సిన పోలీసులు , ఏ బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు, సంతోష పెట్టేందుకు వృత్తి ధర్మం గుడ్డలు విప్పారని, ఇందుకు బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

Leave a Reply