Suryaa.co.in

Andhra Pradesh

సొంత చెల్లికి ఆస్తివ్వని జగన్..మాపై ఆరోపణలు చేస్తున్నాడు

-రాతియుగం కావాలా..స్వర్ణయుగం కావాలా?
-బస్మాసురుడు లాంటి జగన్ వచ్చాకే ప్రజలకు కష్టాలు
-జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు..నొక్కుడు, బొక్కుడే
-ఇరిగేషన్ ను నిర్వీర్యం చేసిన సీమ ద్రోహి జగన్
-పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేస్తా
-ఆళ్లగడ్డ రా..కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ఆళ్లగడ్డ :- జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో..టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ – జనసేన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డలో మంగళవారం నిర్వహించిన రా..కదలిరా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

‘‘శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వారి గుండెలో రైల్లు పరుగెత్తించిన ఉయ్యలవాడ నరసింహరెడ్డి, ఆర్దిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహరావు వంటి మహనీయులు పుట్టిన గడ్డ ఇది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనవరి 9నే..తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన ఈ రోజు పండుగ రోజు. ఈ సభకు వచ్చిన జనసునామీని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ లో 7 అసెంబ్లీ స్ధానాలు గెలుస్తాం. వైసీపీ 5 ఏళ్ల పాలన పేదలకు శాపంగా మారింది. పేద వారు నిరుపేదలుగా యువత నిరుద్యోగులు మిగిలిపోయారు.

నాకు అధికారం కొత్త కాదు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా. 47 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. నా తపనంతా తెలుగుజాతి అభివృద్ది కోసమే. రాక్షసులకు అధికారం ఇవ్వటం వల్లే నేడు రాష్ట్రానికి ఈ పరిస్ధితి. తనకు వరమిచ్చిన వారినే నాశనం చేయాలనుకున్న భష్మాసురుడు చందంగా జగన్ రెడ్డి తయారయ్యాడు. ముద్దులు పెట్టి మీ నెత్తిమీద చెయ్యి పెడితే మురిసిపోయి ఓట్లేశారు. నేడు కష్టాలు పడుతున్నారు. ఈ సైకో రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశాడు. రద్దులు, గుద్దులు, నొక్కుడు, బొక్కుడు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప జగన్ కి ఏమీ తెలియవు. ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడు. ఒక్కసారి కదా అని కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొడుతుందని నాడే చెప్పాను..నా మాట మీరు వినలేదు. అందరికీ కష్టాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలో అందరూ బాధితులే.

టీడీపీ హయాంలోనే కర్నూలు జిల్లా అభివృద్ది
కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో రూ. 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కి శ్రీకారం చుట్టాం. అది వస్తే మొక్కల పెంపకం, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి వచ్చేవి. దాన్ని నిర్వీర్యం చేవారు. నందికొట్కూరులో రూ. 650 కోట్లతో మెగా సీడ్ పార్క్ ఏర్పాటు కృషి చేశాం…అది వచ్చి ఉంటే ప్రపంచం మొత్తానికి విత్తన సరఫరా కేంద్రంగా నంద్యాల ఉండేది. దాన్నీ నాశనం చేశారు.

ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ కి శంకుస్ధాపన చేస్తే దాన్ని నిలిపేశారు. ఓర్వకల్లులో 15 నెలల్లోనే ఎయిర్ పోర్ట్ నిర్మించిన ఘనత టీడీపీది. ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏర్పాటు చేశాం, నేను ఉంటే కర్నూలు జిల్లా పారిశ్రామిక హబ్ గా తయారయ్యేది. 6 వేల మెగా వాట్లతో సాలార్ పార్క్ ఏర్పాటు చేశాం. నేను విజన్ తో ముందుకెళ్తా…జగన్ రెడ్డి పాయిజన్ గా మారి రాష్ట్రాన్ని నాశనం చేశారు. రతనాల సీమను జగన్ రెడ్డి రాళ్ల సీమగా మార్చారు.

సీమ కోసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా.?
రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. కృష్ణా మిగులు జలాలు రాయలసీమకు తెలుగు గంగ ద్వారా ఇచ్చారు. రాయలసీమలో నీళ్లుంటే హార్టికల్చర్ హబ్ గా తయారవుంది. మన పిల్లలకు ప్రపంచాన్ని జయించే సత్తా ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం. గతంలో రోడ్లు సరిగా ఉండేవి కాదు. నేడు నేషనల్ హైవే వచ్చింది, కర్నూలులో ఎయిర్ పోర్ కట్టాం, కడప ఎయిర్ పోర్ట్ రన్ వే పెంచాం. తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేశాం. ముచ్చుమర్రి, సిద్దాపురం, పులకుర్తి, గోరకల్లు, పులికనుమ, అవుకు టన్నెల్ పూర్తి చేశాం.

అలగనూరు ప్రాజెక్టు రిపేర్ కి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అలగనూరు ప్రాజెక్టుకు రిపేర్ చేస్తాం. జగన్ రెడ్డి రాయలసీమ కోసం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ కోసం రూ.12,454 కోట్లు ఖర్చు చేస్తే దానిలో కనీసం 25 శాతం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇలాంటి వ్యక్తి రాయసీమను ఉద్దరిస్తాడా?

భూ రికార్డులు తారుమారుతో అమ్ముకునే ప్రయత్నం
జగన్ రాయలసీమ ద్రోహి. ముఖ్యమంత్రి అయిన మెదటి రోజునే ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ పైనలైజ్ చేశాం. పట్టిసీమ ద్వారా శ్రీశైలానికి 120 టీఎంసీలు గోదావరి నీళ్లు తెచ్చాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి తీసుకొచ్చి రాయలసీకు 350 టీఎసీంల నీళ్లు ఇవ్వాలన్నది నా కళ. అది వచ్చి ఉంటే కరువు ఉండేది కాదు. నల్లమలలో ఒక టన్నెల్ ఏర్పాటు చేసి గోదావరి నీళ్లు నేరుగా నాగార్జున సాగర్ ద్వారా బనకచర్లకు తీసుకురావలన్నది నా ఆలోచన.

ఆ నీళ్లు అక్కడ నుంచి హంద్రీ నీవా, తెలుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కానీ ఆ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా? రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు 90 శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. జగన్ రెడ్డి ఒక్క ఎకరాకైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? నేడు సీమలో 4 లక్షల ఎకరాలు హార్టికల్చర్ తగ్గిపోయింది. మీ తాతలు, తండ్రులు ఇచ్చిన భూమిపై ముఖ్యమంత్రి బొమ్మ ఏంటి? ఆయనేమైనా మీ తాత తరుపు బందువా? మీ భూముల రికార్డులు తారుమారు చేసి అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టైటిల్ యాక్ట్ అమలైతే అనేక ఇబ్బందులు వస్తాయి.

ప్రభుత్వ వేధింపులతో పారిపోయిన పరిశ్రమలు
జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తితో పరిశ్రమలు పెట్టుబడులు తరిమేశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇచ్చారా? మెగా డీఎస్సీ అన్నారు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? మళ్లీ జాబు రావాలంటే బాబు రావాలి. ఈ ప్రభుత్వ వేధింపులతో అమరాజా, జాకీ కంపెనీలు పారిపోయాయి. కియా పరిశ్రమ తెచ్చి వేల మంది యువతకు ఉపాధి కల్పించాం. కార్బన్, డిక్సన్, అపోలో టైర్స్ వంటి అనేక కంపెనీలు తెచ్చా. నేడు ఒక్క పరిశ్రమైనా తెచ్చారా? తిరుపతిని ఆటోమొబైల్ హబ్ చేయాలని అనేక కంపెనీలు తెచ్చా. నేను గెలిచి ఉంటే స్టీల్ ప్యాక్టరీ పూర్తి అయ్యేది.

జగన్ రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి గాలికొదిలారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం. తిరుపతిలో ఐఐటీ, ఐసీఆర్, అనంతపురంలో సెంట్రల్ వర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, త్రిపుల్ ఐటి ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే. దేశంలోనే ఏపీ 24 శాతం నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోంది. ఎప్.డీ.ఐలలో వెనుకబడి ఉన్నాం. యువత భవిష్యత్తుకు నాదీ గ్యారంటీ. యువత టీడీపీ-జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తేవాలి. రాయలసీమకు నీళ్లు తెచ్చి, యువతకు ఉద్యోగాలు ఇస్తేనే ఈ ప్రాంతం రతనాల సీమగా మారుందనేది నా ద్వేయం. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నాతో కలిసి నడవాలి. నేను అందరివాడిని..అదే నా ప్రత్యేకత.

వైసీపీ పాలనతో అన్ని వర్గాలకు దెబ్బ
వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు దెబ్బతిన్నారు. నంద్యాల జిల్లాలో రెడ్లకు ఏమైనా న్యాయం జరిగిందా? బీసీలకు 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు చేశాడా? సబ్ ప్లాన్ ఏమైంది.? ఒక్కరికైనా కార్పోరేషన్ రుణం ఇచ్చారా? బీసీ రిజర్వేషన్లు తగ్గించి 16,500 మందికి స్ధానిక సంస్ధల్లో పదవులు దూరం చేశారు. 30 సంక్షేమ పధకాలు రద్దు చేశారు. రేపల్లెలో అమర్నాద్ నాధ్ గౌడ్ అనే విద్యార్దిని పెట్రోల్ పోసి తగులపెట్టారు, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను హత్య చేశారు. నిందితులపై చర్యలు లేవు.

దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ఊరేగిస్తారా? నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు. టీడీపీ హయాంలో దళితులకు భూములు కొనిచ్చాం. 27 సంక్షేమ పధకాలు అమలు చేశాం. 27 ఏళ్ల క్రితమే ఎస్సీ వర్గీకరణ చేసి మాల, మాదిగలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. కేంద్రం కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటోంది.

సొంత చెల్లికి ఆస్తివ్వని జగన్..మాపై ఆరోపణలా.?
జగన్, షర్మిల గొడవ పడి మాపై విమర్శలు చేస్తున్నారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది? తోడబుట్టిన చెల్లికి ఆస్తి ఇవ్వకుండా గొడవలు పెట్టుకుని మాపై ఆరోపణలు చేస్తున్నారు. సొంత బాబాయి వివేకాను హత్య చేసి అనేక డ్రామాలు ఆడారు. వివేకా కుమార్తె, సీబీఐ అధికారులపైనా కేసులు పెట్టారు. వైయస్ మరణంపై ఆరోపణలు చేసిన రిలయన్స్ కంపెనీ మనిషికే ఎంపీ ఇచ్చారు.

దోపిడిదారులుగా వైసీపీ ఎమ్మెల్యేలు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాధ్ రెడ్డి అవినీతిలో బిజీ బిజీ ఉన్నాడు. అన్నం తినడం మానేసి ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం తింటున్నాడు. ఆయన్ను మార్చే దైర్యం జగన్ కి లేదు. నంద్యాల ఎమ్మెల్యే సండే మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆయన నేషనల్ హైవేను అష్టవంకర్లు తిప్పి తన భూములకు రేట్లు పెంచుకున్నారు.

ప్రాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలెక్షన్ కింగ్. కర్నూలు గ్రావెల్ పీల్డ్ గా (కేజీఎఫ్)గా మార్చారు. 500 ఎకరాల జగన్నాద గట్టు భూముల్ని కొట్టేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి కన్నుపడ్డ వెంచర్లను కబ్జా చేస్తున్నారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే రామిరెడ్డి బ్రహ్మం గారు కాల జ్నానం రాసిన రవ్వల కొండను సైతం మింగేశారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే దళితుడు కాబట్టి సీటివ్వరంట..మిగతా ఆరుగురు కథేంటి? వాళ్లు ప్రజల సొమ్మును దోచుకోలేదా? బుగ్గన పిట్టకధల మంత్రి..సినిమాల్లో నాగభూషణం మాదిరి కమ్మగా మాట్లాడి చేయాల్సిన అవినీతి అంతా చేస్తాడు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు మహర్దశ
ఓర్వకల్లులో మండలంలో మల్లిఖార్జున రిజర్వాయర్, తెలుగునాడు ఫీడర్ ఛానల్ పూర్తి చేస్తాం. డోన్ పత్తికొండ చెరువులకు నీళ్లు నింపే ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వేధవతి పూర్తి చేస్తాం. సిద్దాపురం లిప్ట్ ఇరిగేషన్ కి ఈ ప్రభుత్వం కనీసం కరెంట్ బిల్లులు కట్టడం లేదు. దీన్ని చక్కదిద్దుతాం. మిడ్తూరు లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం. నందికొట్కూరుకు పరిశ్రమలు తెస్తాం. బనగానపల్లిలో పెద్దబొబ్బర్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం. కుందూనదిపై చెక్ డ్యాంలు నిర్మిస్తాం.

నాపరాయి పరిశ్రమలను ఆదుకుంటాం. బనగానపల్లె కోవెలకుంట బైపాస్ రోడ్డు వేస్తాం. ఉమ్మడి కర్నూలు ఇండస్ట్రియల్ హబ్ గా మార్చుతాం. హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తాం. హంద్రీనీవా, గాలేరు నగరి పూర్తి చేస్తాం. తుంగభధ్ర, హెచ్ఎల్సీ, ఎల్.ఎల్.సీ కాలువలు ఆధునీకరణ చేస్తాం. గండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆర్టీఎస్ కుడికాలువ పూర్తి చేసి వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరిస్తాం. 90 శాతం సబ్సీడీతో డ్రిఫ్ ఇరిగేషన్ ఇస్తాం. అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తారా? టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE