1. ఫిట్మేంట్ 23 శాతమే. 2020 ఏప్రిల్ 1 నుండే అమలు.
2. మధ్యంతర భృతి రికవరీ(ఐ.ఆర్.): 2019 జూలై 1 నుండి 2020 మార్చి 31 వరకు చెల్లించిన 27% ఐ.ఆర్. మొత్తం రికవరీ ఉండదు. 2020 ఏప్రిల్ 1 నుండి 2021 డిసెంబరు 31 మధ్య అదనంగా (ఐ.ఆర్. 27%కు, పిట్మెంట్ 23% కు మధ్య ఉన్న 4%) చెల్లించిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేస్తుందన్న మాట!
3. “డిఏ బకాయిలను రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తాం”, ఇది హాస్యాస్పదం. రెండు, మూడు విడతల్లో ఎడాదో, యేడాదిన్నరలోనో కాదు, ఏకంగా రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తామనడం అసంబద్ధం. డిఏ బకాయిలను ఐ.ఆర్. రికవరీతో న్నినటి వరకు ముడిపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రిటైర్మెంట్ నాటికి సర్దుబాటు చేస్తామని ఒప్పుకొన్నదట!
4. గ్రాట్యుటీని 2022 జనవరి నుండి అమలు చేస్తే 2018-2021 డిసెంబరు మధ్య రిటైర్ అయిన వారికి అన్యాయం చేసినట్లే కాదా!
5. జీఓల జారీ తర్వాత పీఆర్సీ నివేదిక ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి?
6. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసుని 2022 జూన్ 30 నాటికి క్రమబద్ధీకరించి, స్కేల్స్ అమలు చేస్తామనడం సముచితం కాదు. రెండేళ్ళకు క్రమబద్ధీకరిస్తామన్నారు అంటే 2020 అక్టోబర్ నాటికి. ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఆనాటికి ఉత్తీర్ణులైన వారిని 2022 జూన్ 30 నాటికి క్రమబద్దీకరించే ప్రక్రియ పూర్తి చేసినా, 2021 అక్టోబర్ నుండే స్కేల్స్ చెల్లించడం న్యాయం.
7. ఆర్.టి.సి. ఉద్యోగుల వేతనాలకు సంబంధించి విడిగా జీఓ జారీ చేస్తామన్నారు. ఆర్.టి.సి. ని ప్రభుత్వంలో విలీనం చేసి, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నప్పుడు వివక్షత ఎందుకు?
8. విశ్రాంత ఉద్యోగుల్లో 70-74, 75-79 వయస్సు వారికి చెల్లిస్తున్న అదనపు క్వాంటం పెన్షన్ లో కోతపెట్టాల్సినంత విధిలేని దుస్థితిలో రాష్త్ర ప్రభుత్వం ఉన్నదా!