Suryaa.co.in

Andhra Pradesh

భవిష్యత్తుకు గ్యారెంటీ మ్యానిఫెస్టోపై జోన్ – 3 నియోజకవర్గాల్లో విసృతస్ధాయి సమావేశాలు

– జోన్ 4, జోన్ 5 నియోజకవర్గాల్లో విస్తృతస్ధాయి సమావేశాలు

ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటివిడత మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల జీవితాలు సుఖసంతోషాలతో, ఆనందంతో ఉండేందుకు వీలుగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు. మహాహాడులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ ప్రిలిమనరీ మ్యానిఫెస్టోపై జోన్ -3 (ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు) నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ చార్జ్ లు ఆధ్వర్యంలో విసృతస్ధాయి సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో భవిష్యత్తుకు గ్యారెంటీ మ్యానిఫెస్టోపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ పథకాలను గ్రామస్ధాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 150 రోజుల కార్యచరణను త్వరలో ప్రకటిస్తారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మ్యానిఫెస్టో కరపత్రాలను పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. భవిష్యత్తు గ్యారెంటీ మ్యానిఫెస్టో అమలు సాధ్యమేనని, దీనిపై అనుమానాలుంటే వైసీపీ నేతలు తమతో చర్చలకు రావాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించే సమయంలో ప్రజలతో మమేకమై నాలుగున్నరేళ్ళలో వైసీపీ చేసిన ప్రజా వ్యతిరేక పరిపాలన తెలుపుతూ, గతంలో తెదేపా చేసిన అభివృద్దిని తెలియజేయాలన్నారు పిలుపునిచ్చారు. రానున్న 9 నెలలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది టీడీపీ పాలనతోనే సాధ్యమన్నారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో నభూతో నా భవిష్యత్ అని స్పష్టం చేశారు.

అసలు దేశంలో సంక్షేమం అనేది మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మకు వందనం పధకం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి రూ. 15 వేల చొప్పున తల్లులు ఖాతాలో జమ చేస్తామని, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయస్సు వారికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు రూ. 1500 చొప్పున వారి ఖాతాల్లో వేస్తామనన్నారు.

సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, ప్రతి ఇంటికి మంచి నీటి కుళాయిల ద్వారా సురక్షిత నీరు అందజేస్తామన్నారు. అన్నదాత పధకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20 వేల రూపాయలు ఖాతాల్లో వేస్తారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు రూ. 3 వేల నిరుద్యోగభృతి ఇస్తామన్నారు. బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు.

ఫార్ములా – 4 తో పేదవాడిని ధనికుడిగా మార్చడమే చంద్రబాబు నాయుడు గారి అంతిమ లక్ష్యం అన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర స్ధాయి నాయకులు, పార్లమెంట్ కమిటీ నాయకులు, నియోజకవర్గ అబ్జర్వర్లు, నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ స్ధాయి నాయకులు, క్లస్టర్ యూనిట్ , బూత్ ఇంచార్జులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE