Suryaa.co.in

Andhra Pradesh

అందుబాటులో ఉండి సేవ చేస్తా… ఆశీర్వదించండి

-అభివృద్ధి పేరుచెబితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా!
-తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ వరుస భేటీలు

మంగళగిరి: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి… అభివృద్ధి పేరుచెబితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా… అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తా…కుటుంబసభ్యుడిలా తనను ఆశీర్వదించాలని యువనేత నారా లోకేష్ కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ వారి ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. తొలుత మంగళగిరి 29వవార్డుకు చెందిన ముస్లిం ప్రముఖుడు షేక్ మౌలాలి ఇంటికివెళ్లారు. వారి కుటుంబసభ్యులు యువనేత లోకేష్ కు పుష్పగుచ్చాలను అందించి ఆప్యాయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముస్లిం సోదరుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో రంజాన్ తోఫా, దుల్హాన్, విదేశీవిద్యతోపాటు షాదీఖానాల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వైసిపి వేధింపులతో పలమనేరులో పదోతరగతి విద్యార్థిని మిస్బాను ఆత్మహత్య చేరుకునేలా వత్తిడిచేశారు, నంద్యాలలో అబ్ధుల్ సలామ్ పై దొంగ ముద్రవేయడం వేయడంతో కుటుంబసభ్యులతో ఆత్మహత్య చేసుకున్నారు. రాబోయే ప్రజాప్రభుత్వం ముస్లింలకు రక్షణ కల్పించడమే గాక వారి సంక్షేమానికి గతంలో చేపట్టిన పథకాలన్నీ పునరుద్దరిస్తామని అన్నారు. తర్వాత 31వవార్డులోని అంజుమన్ ఎ హిమయతుల్ ఇస్లామ్ (అంజుమన్ కమిటీ) కార్యాలయాన్ని సందర్శించి, ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని, షాదీఖానాలు, ఖబరిస్థాన్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో వైసిపి నేతలు యథేచ్చగా వక్ఫ్ బోర్డు, మసీదులకు చెందిన వేలకోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని, నర్సరావుపేట మసీదు ఆస్తుల కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికిచంపారని చెప్పారు. వైసిపి అధికారంలోకి వచ్చాక గతంలో ముస్లింల సంక్షేమానికి చేపట్టిన పథకాలన్నింటినీ రద్దుచేశారని చెప్పారు. ముస్లింలకు చెందాల్సిన రూ.5500కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వక్ఫ్ ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మంగళగిరి 5వవార్డుకు చెందిన వస్త్రవ్యాపారి కోలా వీరాంజనేయులును ఆయన నివాసంలో కలిశారు. కృష్ణబలిజ సామాజికవర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా యువనేత దృష్టికి తెచ్చారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు పుట్టినిల్లు లాంటిది, అన్ని బిసివర్గాలకు రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేస్తాం, బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE