పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనను సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పెంచలకోన చేరుకున్న చంద్రబాబు… ఇక్కడి శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

చంద్రబాబు మాట్లాడుతూ…. అడవులు, కొండల మధ్య కొలువైన స్వామివారి దర్శనం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల కోసం పోరాడే శక్తిని, పనిచేసే సామర్థ్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి, ప్రజలకు అంతా మంచి జరగాలని స్వామి వారిని ప్రార్థించానని వివరించారు.

Leave a Reply