Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తా

– గుడివాడలో సంఘ భవన నిర్మాణం అభినందనీయం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, డిసెంబర్ 14: రాష్ట్రంలో చైతన్యం కల్గిన వెలమ సంఘీయుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని వెలమ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గంటా ఆనంద్, కార్యదర్శి గులిపల్లి ప్రభాకరరావు, మాజీ కౌన్సిలర్లు మూడెడ్ల రామారావు, చింతల భాస్కరరావు, నాయకులు సబ్బాని రంగారావు, వంగపండు బ్రహ్మాజి, వంగపండు బాబు, రవి స్వీట్స్ మోహన్, మూడెడ్ల శ్రీధర్, యామిలి రామారావు, గులిపల్లి రవికుమార్, మడకా ప్రసాద్, వర్రె రామానాయుడు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గంటా ఆనంద్ మాట్లాడుతూ గుడివాడ పట్టణం మార్కెట్ సెంటర్లోని గౌతమబుద్ధ హాస్టల్ స్థలంలో రూ.1.10 కోట్ల వ్యయంతో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు.
పూర్వం గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల్లోని వెలమ సంఘీయులంతా గౌతమబుద్ధ హాస్టల్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చే సంఘీయులకు భోజన, వసతి ఏర్పాట్లు చేసేవారని తెలిపారు. రాష్ట్రంలో ఉచితంగా సేవలందిస్తున్న ఇటువంటి హాస్టల్ గుడివాడలోనే ఉండేదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి సినీరంగ దిగ్గజాలు గౌతమబుద్ధ హాస్టల్ ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న ఉచిత సేవాకార్యక్రమాలను అభినందించారని తెలిపారు. ఈ ప్రాంతంలోనే వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని 500 గజాల్లో నిర్మించాలని నిర్ణయించామన్నారు. సంఘీయులంతా విరాళాలు ఇచ్చి సహకరించడం వల్ల అన్ని హంగులతో సంఘ భవనం నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ భవనాన్ని ఈ నెల 30 వ తేదీన ప్రారంభించడం జరుగుతోందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో పాటు సంఘ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నట్టు గంటా ఆనంద్ చెప్పారు.
అనంతరం మంత్రి కొడాలి నాని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ తో ఫోన్లో మాట్లాడారు. గుడివాడ పట్టణంలో రూ.1.10 కోట్ల వ్యయంతో వెలమ సంక్షేమ సంఘ భవనాన్ని సంఘీయులంతా కలిసి నిర్మించడం జరిగిందని వివరించారు. సంఘీయులంతా కృష్ణదాస్ ను కలిసి ఆహ్వానించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వెలమ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. సంఘీయుల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కట్టుబడి ఉన్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు వెంపటి సైమన్, యార్లగడ్డ సత్యభూషణ్, యేల్చూరి వేణు, పీ బెన్ను తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE