భారీ భూకంపం…సునామీ హెచ్చరిక జారీ..ఇండియాకు ముప్పు?

Spread the love

ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సముద్రంలో తలెత్తిన ఈ భూకంపం వల్ల సునామీ తలెత్తొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇండో-పసిఫిక్ కలయిక ప్రాంతంలో, భూమి టెక్టానిక్ ప్లేట్లు కలిచే చోట ఉండటంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తుండటం తెలిసిందే. కొన్ని సార్లు భూకంపాలు పెను సునామీలను సృష్టించిన నేపథ్యంలో ప్రతిసారి ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతుంది. తాజా భూకంపం తీవ్రతలో పెద్దది కావడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. వివరాలివి..
ద్వీపాల సముదాయమైన ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంగా ఇవాళ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 11.20 నిమిషాలకు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతిపెద్ద పట్టణం మౌమెరే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
సముద్రంలో 10కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన భూకంపం కావడంతో సునామీ అలలు తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Leave a Reply