ప్రజా సమస్యలపై పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా?

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ నేతలే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోంది. అభివృద్ధిని గాలికి వదిలేసి టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడానికే ప్రభుత్వం తమ సమయాన్ని వెచ్చిస్తోంది. వినుకొండ నియోజకవర్గం అంగులూరు ఎస్సీ కాలనీకి తన దీక్ష ద్వారా కరెంట్ పునరుద్ధరింపజేసిన జీవీ ఆంజనేయులు, ఈపూరు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు రాపర్ల జగ్గారావు, ఇతర దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
ప్రజాస్వామ్యయుతంగా దీక్ష చేసి సమస్యలను పరిష్కరించడాన్ని జీర్ణించుకోలేక వారిపై తప్పులు కేసులు నమోదు చేస్తున్నారు. జీవీ ఆంజనేయులు విజయాన్ని ఓర్వలేక అధికారులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే జీవీ ఆంజనేయులు చేసిన తప్పా? వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారు. తక్షణమే జీవీ ఆంజనేయులు, రాపర్ల జగ్గారావు, ఇతర దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించు కోవాలి. వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి.