మద్యం వచ్చే ఆదాయంతో నెట్టుకొస్తున్న జగన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తాడా?

Spread the love

– మూడేళ్ల పాలనలో మహిళల తాళిబొట్లనుతాకట్టు పెట్టిమరీ ఈ ముఖ్యమంత్రి రూ.30వేలకోట్లు పోగేసుకున్నాడు.
• చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని గగ్గోలుపెట్టిన వైసీపీమహిళా నేతలంతా ఇప్పుడు నోళ్లకు ప్లాస్టర్లు వేసుకున్నారా?
• వైసీపీ మహిళానేతలు జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న పిచ్చిమద్యాన్ని వారిఇళ్లలోనివారితో తాగిస్తే, అప్పుడు రాష్ట్రంలోని ఆడబిడ్డల అవస్థలేమిటో తెలుస్తాయి.
• ముఖ్యమంత్రి సోదరులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి, వారికుటుంబసభ్యుల బేవరేజెస్ కంపెనీల పిచ్చిమద్యం, మాదకద్రవ్యాలు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్, మాదకద్రవ్యప్రదేశ్ గా మార్చేశాయి.
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

ఏ ప్రభుత్వమైనా పరిపాలన సక్రమంగా చేయాలన్నా, ప్రజలకు సంక్షేమపథకాలు అందించాలన్నా సాధారణంగా అభివృద్ధి, దానిఫలాలనే నమ్ముకుంటాయని, కానీ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం ఆడబిడ్డల ఆక్రోశం, ఆవేదన, కన్నీళ్లపై నడిచే దుస్థితిని జగన్మోహన్ రెడ్డి కల్పించాడని, వైసీపీప్రభుత్వం మద్యంఅమ్మకాలనే ప్రధానఆదాయవనరుగా మార్చు కోవడం, రాష్ట్రంయొక్క దౌర్భాగ్యస్థితికి సంకేతమని, తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో వి లేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
రాష్ట్రముఖ్యమంత్రిసహా, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా తమప్రభుత్వం మద్యంద్వారా వచ్చే ఆదాయంపైనే నడుస్తోందని చెబుతున్నారు.

మహిళాఓటుబ్యాంక్ తో సీఎంకుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి, అదేమహిళల తాళిబొట్లతో ఆడుకుంటున్నాడు.జగన్మోహన్ రెడ్డిలో రెండుభిన్న పార్శ్యాలున్నాయి. అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా నాలుకమడతేయడంలో జగన్ మించినవారులేరని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదోతరగతిపిల్లలు కూడా మద్యందుకాణాల వైపు చూస్తున్నారని, చంద్రబాబునాయుడు మద్యంఅమ్మకాలతో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నా డని, మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తానని ప్రగల్భాలు పలికాడు.అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, పసిపిల్లలతో కూడా మద్యం తాగించే స్థాయికి దిగజారాడు. హైస్కూల్ విద్యార్థులుకూడా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిసల్ని చేసి, తనఖజానా నింపుకుంటున్నాడు.

ఇదివరకు ఇదే ముఖ్యమంత్రి మద్యం ధరలుపెంచడాన్ని గుడ్డిగా సమర్థించుకున్నాడు. మద్యంసీసా పట్టుకుంటే మందుబాబులకు షాక్ కొట్టాలని, అందుకే ధరలు పెంచామని చెప్పుకొచ్చాడు. పిచ్చిపిచ్చి మద్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి మందుబాబులప్రాణాలతో, మహిళల సౌభాగ్యంతో చెలగాటమాడుతున్నాడు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాననిషేధం అని చెప్పిన పెద్దమనిషే దేశంలోఎక్కడాలేని చిత్రవిచిత్రమైన బ్రాండ్లను ఏపీలో అమ్ముతూ, ప్రజలప్రాణాలను పణంగా పెట్టిమరీ తనఅక్రమార్జన పెంచుకుంటున్నాడు. కొత్తబ్రాండ్ల పేరుతో తనపార్టీవారు, తనఅనుమాయులతో బేవరేజెస్ కంపెనీలు ఏర్పాటుచేయించాడు. ప్రెసిడెంట్ మెడల్, త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ పేర్లు మద్యం సీసాలకు పెట్టించిన ఘనత ఈముఖ్య మంత్రికే దక్కింది. ఈ ఘనుడు ఎలాగూ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేడు కాబట్టి, దాన్ని మందుసీసారూపంలోకి మార్చి, రాష్ట్రంపైకి వదిలాడు.

ముఖ్యమంత్రి అధికారధాహానికి, ధనదాహానికి సాధారణ, మధ్యతరగతిప్రజలు రోడ్డున పడు తున్నారు. జగన్మోహన్ రెడ్డి సోదరులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి , వారి కుటుంబసభ్యుల తాలూకా మద్యంవ్యాపారంతో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ప్రదేశ్ గా మారింది.మద్యం ధరలు తగ్గించాడంటూ సిగ్గులేని కొందరు వైసీపీనేతలు, వైసీపీఎమ్మెల్యేలు ముఖ్య మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చి మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నందుకు పాలాభిషేకాలు చేస్తు న్నారా అనిప్రశ్నిస్తున్నాం. మద్యానికి బానిసై రాష్ట్రంలో ఎందరు చనిపోతున్నారో ఈప్రభు త్వానికి, ముఖ్యమంత్రికి తెలియదా? మద్యాపాన నిషేధం పేరుతో తూతూమంత్రంగా ఎక్కడో ఒకటీ, అరా మద్యం దుకాణాలు తగ్గించిన జగన్మోహన్ రెడ్డి, మద్యంఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి ‘వాక్ ఇన్ స్టోర్స్’ పేరుతో సరికొత్త మత్తువ్యాపారానికి తెరలేపాడు.

అమ్మఒడి పేరుతో రూ.14వేలు తల్లులఖాతాల్లో వేస్తున్న జగన్మోహన్ రెడ్డి, తండ్రుల జేబుల నుంచి పెంచినమద్యంధరలరూపంలో రూ.40వేలవరకువసూలుచేస్తున్నాడు. కరోనా సమయంలో పిచ్చిమద్యాన్ని అమ్మించడానికి ఈ ముఖ్యమంత్రి ఉపాధ్యాయులను మందు దుకాణాలవద్ద కాపలా పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెంచినమద్యం ధరలదెబ్బకు చాలామంది గతంలో శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. ఈముఖ్యమంత్రి, ప్రభుత్వం అమ్ముతున్న పిచ్చిమద్యంతోపాటు,శానిటైజర్ తాగి చనిపోయినవారందరి ప్రాణాలు ముఖ్యమంత్రే తీశాడు.

జగన్మోహన్ రెడ్డి ధనాశే, పేదలు, సామాన్యులు ప్రాణాలు బలిగొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళల తాలిబొట్లు అంటే ఈముఖ్యమంత్రికి బాగా చులకన. ఒక కుటుంబంలోని పెద్ద, ఈముఖ్యమంత్రి అమ్ముతున్న పిచ్చిమద్యం తాగిచనిపోతే, ఆకుటుంబానికి దిక్కె వరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిచ్చిమద్యం ధరలు పెంచడంతో చాలామంది నాటుసారా తాగుడుకు అలవాటయ్యారు. స్వయంగా వైసీపీ వాలంటీర్లే చాలాప్రాంతాల్లో కుక్కర్లలో నాటు సారా తయారుచేసి, పేదలజేబులు కొల్లగొడుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి మొదలు, ఆయన ప్రభుత్వం, వాలంటీర్లు అందరూ ప్రజల ప్రాణాలు హరిం చే మద్యాన్ని నమ్ముకొనే బతుకుతున్నారు.మద్యంపైనేఆధారపడి ఈప్రభుత్వం నడుస్తోంది . పానీపూరీ అమ్మేవాడు కూడా గూగుల్ పే, ఫోన్ పే ఉపయోగిస్తుంటే, ఏపీలోని మద్యం దుకాణాల్లో మాత్రం డిజిటల్ చెల్లింపులు లేవు, ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ. నెలకు రూ.6వేల కోట్లవరకు ఈప్రభుత్వం మద్యందుకాణాలనుంచి వసూళ్లుచేస్తోంది. రూ.1000కోట్లు మాత్రమే ప్రభుత్వఖజానాకు జమఅవుతున్నాయి.

మిగిలిన రూ.5వేలకోట్ల సొమ్ము, ముఖ్యమంత్రి ఖజానాకే చేరుతోంది. పేదలప్రాణాలు పోయినా పరవాలేదు..తమఖజానా నిండితేచాలన్నట్లు ముఖ్యమంత్రి సహా, ప్రభుత్వ పెద్ద లు వ్యవహరిస్తున్నారు. పేదలను మద్యానికి బానిసల్ని చేస్తున్న ఈముఖ్యమంత్రి తద్వారావచ్చేసొమ్ముతోనే రేపు రాబోయే

ఎన్నికల్లో ఓట్లుకొనడానికి సిద్ధమవుతున్నాడు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చేఎన్నికల్లో మళ్లీ అక్కా..చెల్లీ.. అమ్మా అంటూ గడ్డాలు పట్టుకొని బతిమాలుతాడు. అక్కచెల్లెమ్మలు, అమ్మలంతా ఈముఖ్యమంత్రి నిజస్వరూపాన్ని, మద్యాన్ని ఆదాయవనరుగా మార్చుకొని మహిళలతాళిబొట్లు తెంచుతున్న వైనాన్ని ప్రతిఒక్కఆడబిడ్డ గుర్తించాలని కోరుతున్నాం.

రాష్ట్రంలోని మందుబాబులను తాకట్టుపెట్టి, తాగబోయే మందుపై కూడా అప్పులుతెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మహిళల తాళిబొట్లను 15ఏళ్లపాటు తాకట్టుపెట్టి మరీ, వారికి సంవత్సరానికి రూ.10వేలిస్తూ, అదే అమ్మఒడిఅని ఏదోఉద్ధరిస్తున్నట్లు మాట్లాడు తున్నాడు. ధేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూఇలాంటి ఆలోచన చేయలేదు.ఇంకా ప్రజలతరుపున ప్రతిపక్షం ఏదైనా అంటే , ఏమీ తెలియని వాడిలా ఈముఖ్యమంత్రి నంగనాచిలా కబుర్లుచెబుతాడు.

మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటైనా రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టడంగానీ, మద్యపాననిషేధం దిశగా ఏదైనా కార్యక్రమం చేయడంగానీ చేశారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలుజరుగుతుం టే గతంలో మందుసీసాలు పగలగొట్టి నానాయాగీ చేసినవారంతా ఇప్పుడేమయ్యారు. వాళ్ల నోళ్లు మూతపడ్డాయా..లేక మూతులకు మాస్కులు పెట్టుకున్నారా? ఇంకోసారి జగన్మోహ న్ రెడ్డి గానీ, ఆయన చెంచాలు, బాకా బ్యాచ్ గానీ మాటతప్పం, మడమతిప్పం అంటే రాష్ట్రంలోని మహిళలంతా చీపుర్లు, చెప్పులతో కొట్టడంఖాయం.

జగన్మోహన్ రెడ్డి తనమూడేళ్లపాలనలో మద్యంఅమ్మకాలను మూడింతలుపెంచి, మహిళల పుస్తెలను తాకట్టుపెట్టి, రూ.30వేలకోట్లవరకు సంపాదించుకున్నాడు.చంద్రబాబునాయుడి హాయాంలో ఆడబిడ్డల తాళిబొట్లు తెగుతున్నాయని, మద్యం ఏరులై పారుతోందని కారుకూతలుకూసిన వైసీపీమహిళానేతలంతా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్న పిచ్చిమద్యాన్ని వారిఇళ్లల్లో ఉండే వారితో తాగించాలి. అప్పుడు తెలుస్తుంది అధికారపార్టీ మహిళానేతలకు అసలు వాస్తవం ఏమిటో. బూమ్ బూమ్.. ప్రెసిడెంట్ మెడల్ , రాయల్ సింహ, స్పెషల్ స్టేటస్, బ్రిటీష్ అంపైర్ ..ఏమిటీ ఈ పేర్లన్నీ. ఇలాంటి పేర్లు, ఈ విధమైన నాసిరకం మద్యం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం. ఈ ప్రభుత్వం మద్యంపై ఆధారపడే నడుస్తోంది కాబట్టి.. ఈముఖ్యమంత్రి సంపూర్ణ మద్యపాననిషేధం చేయడని తేలిపోయింది.

కనీసం రాష్ట్రంలో పిచ్చిమద్యంలేకుండాచేసి, నాణ్యమైన మద్యాన్ని మంచిబ్రాండ్లను అమ్మకానికి పెడితే మంచిదని సూచిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీవారి పిచ్చిమద్యం బ్రాండ్లను తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్సైజ్ శాఖామంత్రి ఇంతజరుగుతున్నా కూడా నోరు ఎందుకు విప్పడో తెలియడం లేదు.సదరు మంత్రిగారికి ఎవరో ఎవరినో చంపడానికి కుట్రలుపన్నుతున్నారని తెలుస్తుంది గానీ, ఈ ప్రభుత్వంలో అమ్మతున్న పిచ్చిమద్యం ఎందరి ప్రాణాలుహరిస్తుందో తెలియదా? లేక తెలియనట్లు నటిస్తున్నాడా?

Leave a Reply