– కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయని సీఎం రోబోలు ,డ్రోన్ కెమెరా ల గురించి మాట్లాడుతున్నారు
– రేవంత్ రెడ్డి ఏమి చేసినా అది వినాశనమే
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ,పల్లె రవికుమార్ ,శుభప్రద్ పటేల్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తాను చదువుకున్న వనపర్తి కి వస్తే ఏదో ప్రకటిస్తారని ఆశించారు. రోజూ కేసీఆర్ ను తిట్టినట్టే వనపర్తి లో కూడా తిట్టారు. చిన్న వయసులో సీఎం గా అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ ప్రమాదానికి కేసీఆర్ దే బాధ్యత అని సీఎం అనడం దుర్మార్గం.
వట్టెం పంప్ హౌజ్ మునగడానికి ,పెద్ద వాగు ప్రాజెక్టు మునగడానికి ,సుంకిశాల కూలి పోవడానికి కూడా బీ ఆర్ ఎస్ కారణమా ? సీఎం మాట్లాడే ముందు అధికారులతో లెక్కలు తెప్పించుకోవాలి. తప్పు చేసేది వాళ్ళు ,నిందలు మా మీద వేస్తారు. హరీష్ రావు పై లేని పోని ఆంక్షలు పెట్టిన వాళ్ళు బీజేపీ వాళ్లకు ఘన స్వాగతం పలికారు. ఎస్ ఎల్ బి సీ ఘటన జరగకముందే హరీష్ రావు దుబాయ్ వెళ్లారు.
హరీష్ రావు లేరనే ఎస్ ఎల్ బి సీ ప్రమాదం పై ప్రభుత్వం చర్యలు చేపట్టలేదా ? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేస్తారా ? ప్రతిపక్షం లో ఉన్నవాళ్లు చేస్తారా ? ప్రజలు సాలాకా పట్టుకుని కాంగ్రెస్ కాల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఎల్ బి సి తక్కువ కాలం లో ఎక్కువ తవ్వింది బీ ఆర్ ఎస్ హయం లొనే. ఎక్కువ ఖర్చు పెట్టింది కేసీఆర్ హయం లోనే. టన్నెల్ తవ్వేపుడు ఎన్నో రకాల పరీక్షలు చేయాలి ..అవి చేయనందుకే ప్రమాదం జరిగింది
కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేయడానికి ఇంత సమయమా ? చనిపోయిన కార్మికుల శవాలు దొరికితే చాలు అన్నట్టు ఉంది ప్రభుత్వ నిర్వాహకం. కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తాడట. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయని సీఎం రోబోలు ,డ్రోన్ కెమెరా ల గురించి మాట్లాడుతున్నారు. కార్మికుల స్థితిగతుల గురించి సీఎం కు పట్టింపు లేదా ? వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్ ఎల్ బీ సీ ఘటన ను సుమోటో గా తీసుకోవాలి. బోరు బావిలో పిల్లలు చిక్కుకుంటే దేశమంతా వారి ప్రాణాల సంగతి ఏమైంది అని ఆత్రుత తో ఎదురు చూస్తారు. ఎనిమిది మంది టన్నెల్ లో పది రోజులుగా చిక్కుకుంటే ఎవరికీ పట్టింపు లేదు. వారివి ప్రాణాలు కావా ? ఏం తప్పు చేశారని సీఎం బీ ఆర్ ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు.
మేము పాలమూరు ను అభివృద్ధి చేయడమే సీఎం కు తప్పుగా కనిపిస్తోందా ? పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కేసీఆర్ చేయడమే సీఎం కు తప్పుగా కనిపిస్తోందా ? శ్రీశైలం నుంచి ఏపీ అక్రమంగా తరలిస్తున్నా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ నేతలు చిన్న పదవులతో సంతృప్తి పడేవారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే ఇక్కడి కాంగ్రెస్ నేత సీఎం కాగలిగారు.
మంత్రులు కూడా దుబాయ్ వెడ్డింగ్ లకు హాజరయ్యారు ..భాద్యత ఉన్న మంత్రులు ప్రమాదం జరిగితే దుబాయ్ లో జల్సాలు చేస్తారా ? పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తాకి కూలిందట. రేవంత్ రెడ్డి ఏమి చేసినా అది వినాశనమే అన్నట్టు ఉంది.
జైలు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ తో ఒప్పందం: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సందర్భం ,స్థలం ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎస్ ఎల్ బి సీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన రోజే కార్మికులు మరణించారన్న సమాచారం మాకుంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది అనే ఆలోచనతోనే హరీష్ రావు తో పాటు మేమంతా ఆరు రోజుల తర్వాత ఎస్ ఎల్ బి సీ దగ్గరకు వెళ్లాం. పోలీసులు అనుమతించినట్టే అనుమతించి మాపై ఆంక్షలు పెట్టారు
ఆదరాబాదరాగా టన్నెల్ పనులు తిరిగి ప్రారంభించినందువల్లే ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన రోజు సమాచారం బయటకు పొక్కకుండా స్థానిక ప్రజల నుంచి అధికారులు ఫోన్ లు లాక్కున్నారు. వనపర్తి లో సీఎం బీజేపీ గురించే ఎక్కువ మాట్లాడారు. .సీఎం మరోసారి జైలు వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రేవంత్ ఢిల్లీ కి 37 సార్లు వెళ్లారు. బీజేపీ కి జీ హుజూర్ అనడం తప్ప రేవంత్ తెలంగాణ కు తెచ్చింది ఏమీ లేదు. ఇకనైనా తమ అసమర్ధతను తెలుసుకుని ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలి