గతంలో లాగా గంజి కేంద్రాలు వస్తాయేమో?

- రైతులు, రైతుకూలీలు ఏం కావాలి?
- మాజీ మంత్రి వి . శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి అందరూ దిల్లీలో మకాం వేశారు. పంటలు వేసుకోవద్దని ఫత్వా జారీ చేశారు. రైతులు, రైతుకూలీలు ఏం కావాలి? పక్క రాష్ట్రం కృష్ణా నుంచి 350 టీఎంసీలు తీసుకుంటే, ఇక్కడ మాత్రం 35 టీఎంసీలు కూడా తీసుకోలేదు. నార్లాపూర్ పంపులు నిన్న, ఇవాళ ప్రారంభం అన్నారు కానీ చేయడం లేదు. శ్రీశైలంలో నీరు రోజురోజుకూ తగ్గుతోంది. గ్రామాల్లో ఇప్పటికే సరిగ్గా తాగునీరు లేదు.
సచివాలయంలో విశ్రాంత ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఎండిన పంటలకు, రెండో పంట వద్దు అన్నందుకు రైతులకు నష్ట పరిహారం ప్రకటించాలి. రైతు కూలీలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఉద్యోగులు, పోలీసుల హెల్త్ కార్డుల గురించి పట్టించుకునే వారే లేరు. అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. పాలన అంతా ఎమర్జెన్సీ తరహాలో ఉంది.
విశ్రాంత ఉద్యోగులకు వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక్కరు మరణించినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. నిత్యావసర ధరలు కూడా బాగా పెరిగాయి, రెండు నెలల తర్వాత ఏమవుతుందో. గతంలో లాగా గంజి కేంద్రాలు వస్తాయేమో. మంత్రులకు భూములపై ఉన్న శ్రద్ధ… పాలనపై లేదు.
పాలనపై పట్టు లేక, ముందుచూపు లేకే ఈ పరిస్థితి వచ్చింది. దిల్లీ నుంచి వెంటనే వచ్చి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు కురువ విజయ్ కుమార్ ,అరుణ తదితరులు పాల్గొన్నారు.
