– సీఎం గా తీసి వేయగానే రేవంత్ రెడ్డి పార్టీ మరుతాడని మీ వాళ్ళే చెబుతున్నారు
– దేశ చరిత్రలో ఏ సీఎం కు ఇన్ని తిట్లు రాలేవు
– నీ ఇష్టం ఉన్న ఊరు వెతుక్కో..
– సెంటర్లో నిలబడి రైతు బంధు, రుణమాఫీ, బోనస్ 500 పడిందని అడగుదాం
– వచ్చాయని చెబితే నేను రాజీనామా చేస్తా
– లేకుంటే పిసిసి అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తావా?
– పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్
నిజామాబాద్: పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ అహంకారం నెత్తికి ఎక్కింది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్క పెట్టకుండా చిలుక జోస్యం చెబుతున్నాడు. 11 నెలల కాలంలో ఏ ఒక్కరినీ అడిగినా కాంగ్రెస్ పార్టీని ఛీ తూ అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఢిల్లీ సంస్థ చేసిన్న సర్వేలో ఘోరాలు బయట పడ్డాయి. 11 నెలల కాలంలో ప్రజల్లో ఇంతలా దిగజారిపోయిన పార్టీ ఈ దేశంలో ఇంకోటి లేదు.
మహేష్ కుమార్ గౌడ్ మాటల మాదిరిగానే వారి ప్రభుత్వం దిగజారింది. హరీష్ రావు నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ మాట తప్పితే గడ్డి పరక మాదిరిగా మంత్రి పదవిని వదులుకున్నాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నీ పార్టీలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? హెలికాప్టర్ కోసం కొట్లాట,మూటలు సమర్పించుకునే పనిలో మీ వాళ్ళు బిజీగా ఉన్నారు.
పొంగులేటి, శ్రీధర్ బాబు, భట్టీలు అందరూ సి.ఎం రేసులో ఉన్నారు. ప్రజల్లో చులకన అయ్యారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? సీఎం గా తీసి వేయగానే రేవంత్ రెడ్డి పార్టీ మరుతాడని మీ వాళ్ళే చెబుతున్నారు. 10 ఏళ్లలో చేయని అభివృద్ధి 10 నెలల్లో పూర్తి అయ్యిందని అనడం సిగ్గు చేటు. ఆ మాటలు వింటే కరెంట్ తీగలు పట్టుకుని చావాలి. ఒక్క పని జరుగలేదు. మా కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిందట. పిసిసి పదవితో కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావు.
కూలబెట్టుడు తప్ప నిలబెట్టింది ఏమిటి? ఈ రోజు వరంగల్ లో ప్రారంభిస్తున్న కాళోజీ కళా క్షేత్రం కేసీఆర్ గొప్ప. సెక్రటేరియట్ మెయిన్ గేటు మార్చి వేరే దగ్గర పెడుతున్నారు. నీ ఇష్టం ఉన్న ఊరు వెతుక్కో సెంటర్లో నిలబడి రైతు బంధు, రుణమాఫీ, బోనస్ 500 పడిందని అడగుదాం.. వచ్చాయని చెబితే నేను రాజీనామా చేస్తా,లేకుంటే పిసిసి అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తావా? నా సవాల్ కు జవాబు ఇవ్వాలి. 10 నెలల్లో మీరు చేసింది విధ్వంసం. మేము చేసింది వికాసం.
మహరాష్ట్ర లో మహిళలకు 3వేలు ఇస్తారట. ఇక్కడ 2500 లకు దిక్కు లేదు. ఇక్కడ 2లక్షల రుణ మాఫీకి దిక్కులేదు. అక్కడ 3 లక్షలు ఇస్తారట. ఎన్నికలకు ముందు హామీలు, అధికారంలో కోతలు కాంగ్రెస్ నినాదం. కోతల రాయుడు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ రైతు డిక్లరేషన్ ముంచి అక్కడే విజయోత్సవాలా? వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు.మీ పాలనలో పొద్దున లేస్తే ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు. రోడ్డు ఎక్కి నిరసన తెలుపని వర్గం లేదు.
నీ అల్లుడు కోసం భూములు లాక్కునే పని చేస్తే లంబాడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీ ప్రభుత్వం పడిన తిట్లు ఎవ్వరికీ దక్కలేదు. మూసి బాధితులు రోడ్డు ఎక్కుతున్నారు. బడిలో చదువుకునే విద్యార్థులు నుంచి, వృద్దులు దాకా రోడ్డు ఎక్కుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవ సభలు జరుపుతున్నారు. దేశ చరిత్రలో ఏ సీఎం కు ఇన్ని తిట్లు రాలేవు. ఏకైక సీఎం రేవంత్. అయినా సరే మళ్ళా నాకేం సిగ్గు అన్నట్లుగా మహారాష్ట్రలో మాటల కోటలు.
ఇచ్చిన హామీలు ఒక్కటి సక్రమంగా అమలు చేయకున్నా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రం మొత్తంలో ఎంత మందికి వరికి బోనస్ ఇచ్చావ్.దమ్మూ ధైర్యం ఉంటే శ్వేత పత్రం విడుదల చెయ్. మేయర్ భర్త శేఖర్ పై పాశవిక దాడి జరిగింది. చంపాలనే కోరికతో నిందితుడు దాడి చేసి వీడియో రికార్డు చేసి బయట పెట్టాడు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. కుట్ర కోణం పై దర్యాప్తు చేయాలి.
మీడియా సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా,మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు సర్ప రాజు, బీఆర్ఎస్ నాయకులు సుదాం రవిచంద్ర,సత్య ప్రకాష్,మురళి,న్యాయవాది మధుసూదన్,ఇమ్రాన్,యెండల ప్రసాద్ పాల్గొన్నారు.