Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ కనెక్షన్లకే డబ్బులివ్వని ముఖ్యమంత్రి పేదలకు ఒకేసారి 15లక్షల ఇళ్లుకడతాడా?

– పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫీజులు కూడా ప్రజలు పీకేసే రోజుదగ్గర్లోనేఉంది. – పేదలకు పక్కాఇళ్లునిర్మిస్తాను అంటున్న ముఖ్యమంత్రి వాటికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లకోసం పైసాఇవ్వనంటూ చేతులెత్తేశాడు. విద్యుత్ డిస్కంలు పక్కాగృహాల విద్యుత్ కనెక్షన్లకోసం రూ.4,500కోట్లు కావాలంటే, రోడ్లవెంట తిరిగిఅప్పులుతెచ్చుకోవాలంటూ జగన్ రెడ్డి హుకుం!
• మూడేళ్లలో విపరీతంగా విద్యుత్ ఛార్జీలుపెంచి బాదుడేబాదుడంటూ ప్రజల్ని చావబాదుతున్న జగన్ రెడ్డి..పేదలగృహాల విద్యుత్ కనెక్షన్లకోసం రూ.4,500కోట్లుఇవ్వలేడా? విద్యుత్ లేని ఇళ్లల్లో ప్రజలు లాంతర్లతో బతకాలనుకుంటున్నాడా?
• నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనారిటీలు అంటూ ప్రజలపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తూ నటిస్తున్న ముఖ్యమంత్రి, తానునిర్మించాలనుకుంటున్న జగనన్న కాలనీలనిర్మాణానికి ఇప్పటివరకు ఎంతఖర్చుపెట్టాడు? ఎలాంటి సౌకర్యాలుకల్పించాడో చెప్పాలి.
• విద్యుత్ కంపెనీలను రూ.30వేలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్ రెడ్డి, ఆ సొమ్మంతా దిగమింగి, ఆఖరికి పేదలకోసం రూ.4,500కోట్లు ఇవ్వలేననే దుస్థితికి దిగజారాడు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఎన్నికలసందర్భంలో మాయమాటలుచెప్పి, అధికారంలోకివచ్చాక మోసకారీపాలన, సంక్షేమంతో ప్రజల్ని ఇంకామభ్యపెట్టాలనే చూస్తున్నాడని, కాగితాలుచూసి చదివితేతప్ప, ప్రజలముందు మాట్లాడలేని దుస్థితికి ముఖ్యమంత్రివచ్చాడని, ప్రజల్లో తనపై వ్యక్తమవుతు న్న తిరుగుబాటుచూశాక, ఆయనలో తీవ్రమైనఅసహనం వ్యక్తమవుతోందని, దాని ప్రభావమే ప్రతిపక్షాలు, మీడియాపై నిందలని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

శనివారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
మత్స్యకార భరోసా పేరుతో నిన్న జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తన ప్రభుత్వం బ్రహ్మండంగా కట్టించే పేదల పక్కా గృహాలకు టీడీపీ అడ్డుతగులుతోందంటూ మొసలికన్నీరుకార్చే ప్రయత్నంచేసి, పచ్చిఅబద్ధాలు చెప్పుకొచ్చారు. పక్కాగృహాలపేరుతో ముఖ్యమంత్రి, ఆయనపార్టీ వారు పనికిరానిస్థలాలను సేకరించి, వాటిని పేదలకుఅప్పగించి, ఎన్నివేలకోట్లుదిగమింగారో అందరికీ తెలిసిందే. అలాంటిపనికిమాలిన స్థలాల్లో ఈ ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లుకట్టిస్తుంటే టీడీపీ అడ్డుకుంటోందని మరో దిక్కుమాలిన ప్రచారం.

మొన్నీమధ్యనే మే4 వతేదీన ముఖ్యమంత్రి విద్యుత్ డిస్కంల అధికారులతో ఒకసమీక్ష నిర్వహించారు.

ఆసమీక్షలో పేజీనెం-4లో జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణానికి సంబం ధించి కూడా చర్చించారు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల అధికారులు ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నాయి. ఆ మూడు విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలపరిధిలో దాదాపు 14లక్షల80,713 గృహాలనిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన పనులు, మరీముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంచనాలను అధికారులు ముఖ్యమంత్రి ముందుఉంచా రు. సుమారు 10,067లేఅవుట్లలో 14లక్షల80,713 గృహాలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లకి సంబంధించి సుమారు రూ.4,500కోట్లు ఖర్చవుతుందని అధికారులుచెప్పారు.

ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) పరిధిలో రూ.1,819కోట్లు, ఈపీడీసీఎల్ (ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) పరిధిలో రూ. 1,552కోట్లు, సీపీడీసీఎల్ (సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) పరిధిలో రూ.1,129కోట్లకు సంబంధించి మొత్తంగా రూ.4,500కోట్లకు అంచనాలు ఇవ్వడంజరిగింది. జగనన్న కాలనీలకుసంబంధించి విద్యుత్ కనెక్షన్లకు ఇంత మొత్తంఖర్చవుతుందని, కాబట్టిప్రభుత్వం రూ.4,500కోట్లుచెల్లించాలని విద్యుత్ సరఫరా కంపెనీలుకోరాయి. కంపెనీలవిజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చాలాబాగాస్పందించారు.

తాను, తన ప్రభుత్వం కాలనీలకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లకోసం రూపాయికూడా ఇచ్చేదిలేదని ముఖ్యమంత్రి ఖరాకండిగా తేల్చిచెప్పారు. మరీదారుణంగా అవసరమైతే రోడ్లవెంటతిరిగి అప్పులుతెచ్చుకోవాలని, బిచ్చమెత్తుకోవాలని విద్యుత్ సరఫరాకంపెనీలకు ముఖ్యమంత్రి ఉచితసలహాపారేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షాసమావేశంలోని వివరాలకు సంబంధించిన పేజీనెం-4లో ఈవివరాలన్నీ చాలాస్పష్టంగా ఉన్నాయి.
విద్యుత్ సరఫరాకంపెనీలు ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రోడ్లపై పడి అడుక్కోవా లా ముఖ్యమంత్రిగారు? ఇదేనా మీరుచెప్పాల్సింది?
నిన్న ప్రజలముందు మాట్లాడుతూ, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని దీర్ఘాలు తీస్తున్నావుకదా.. ముఖ్యమంత్రి! పేదలఇళ్లకోసం అవసరమైన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి సిగ్గులేకుండా ఇంకా తానుపక్కాఇళ్లుకడుతుంటే, ప్రతిపక్షం అడ్డుకుంటోందని దుష్ర్ర్పచారం చేస్తున్నాడు. పక్కాగృహాలకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి విద్యుత్ సరఫరాకంపెనీలకు రూ.4,500కోట్లు ఎందుకు ఇవ్వనన్నాడో ముఖ్య మంత్రి సమాధానంచెప్పాలి. ఆయనఇస్తానంటే ఎవరువద్దన్నారో, ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలి.

విచ్చలవిడిగా లక్షలకోట్లఅప్పులు చేసిందికాక, పదేపదే విద్యుత్ ఛార్జీలుపెంచి ప్రజల్ని”బాదుడేబాదుడు” అంటూ చావబాదుతున్న జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా ప్రతిపక్షంపై అభాం డాలు వేస్తున్నాడు. జగనన్న పేదలకోసంనిరిస్తానుఅంటున్న కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు లేకుండా చీకట్లలో ఎవరుంటారు? అసలే ఇళ్లుకట్టేస్థలాలన్నీ శ్మశానాలు, చెరువులు, కుంట లపక్కన ఎక్కడో ఊళ్లకుదూరంగాఉన్నాయి. వాటికి రోడ్లు, మంచినీరు, విద్యుత్ కనెక్షన్ వంటి మౌలికసదుపాయాలు కల్పించకపోతే ప్రజలంతాఎక్కడ ఉండాలి… ఎలా ఉండాలి? లాంతర్లు పట్టుకొని చీకట్లలో బిక్కుబిక్కుమంటూ బతకాలా?
రూ.4,500కోట్లు విద్యుత్ సరఫరాకంపెనీలు అప్పులుతెచ్చుకోవాలంటున్న ముఖ్యమంత్రి, ఇప్పటికే విద్యుత్ డిస్కంలను అప్పులఊబిలోకి నెట్టింది వాస్తవంకాదా? తానుఅధికారంలోకి వచ్చాక గతమూడేళ్లలో ముఖ్యమంత్రి విద్యుత్ కంపెనీలను తాకట్టుపెట్టి వేలకోట్ల అప్పులు తెచ్చాడు. సెప్టెంబర్ 5-2019న రూ.5వేలకోట్లు, 23-09-2019న రూ.4,741కోట్లు, 29-11-2019న రూ.1500కోట్లు, 23-01-2020న రూ.2వేలకోట్లు, 30-03-2020న రూ.6వేలకోట్లు… ఈ విధంగా ఈ చేతగానిముఖ్యమంత్రి ఇప్పటివరకు విద్యుత్ డిస్కంలపై రూ.30వేలకోట్లకుపైగా అప్పులభారంమోపాడు. అలాతీసుకొచ్చిన సొమ్మంతా దిగమింగిన ముఖ్యమంత్రి, విద్యుత్ కంపెనీలను తనఅవినీతికోసం నిర్వీర్యంచేశాడు. ఈ ముఖ్య మంత్రినిర్వాకంతో రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా కంపెనీలకు ఇకరూపాయి కూడా కొత్తగా అప్పుపుట్టేపరిస్థితిలేదు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్ సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేష న్ (ఆర్ఈసీ) వారు తమబాకీల వసూలుకోసం విద్యుత్ డిస్కంలను హెచ్చరించలేదా? బకాయిల వసూలుకోసం పీఎఫ్ సీ, ఆర్ఈసీ ఎండీలే స్వయంగా ఈమధ్యనే విజయవాడకు వచ్చి, ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ హెచ్చరించివెళ్లారు. ఏపీని డిఫాల్టర్ గా ప్రకటిస్తే, ఇక ఎప్పటికీ అప్పులు పుట్టవని వార్నింగ్ ఇవ్వలేదా … ముఖ్యమంత్రి? ఈరకంగా విద్యుత్ డిస్కంలను డిఫాల్టర్లుగా మార్చిన జగన్ రెడ్డిదెబ్బకు మరలాకొత్తగా ఎవరైనా వాటికి రూ.4,500కోట్లురుణంఇస్తారా? రుణంఇవ్వరని తెలిసే జగన్ మోసపురెడ్డి, జగనన్నకాలనీ లకు విద్యుత్ సౌకర్యం కల్పించడంకోసం విద్యుత్ సరఫరాకంపెనీలను అప్పు తెచ్చుకోమన్నా డా?
విద్యుత్ డిస్కంలను, ఏకంగా రాష్ట్రవిద్యుత్ రంగాన్ని ఈ జగన్మోసపురెడ్డి ఎలా సర్వనాశనం చేశాడో చెప్పడానికి ఇంకా చాలాఉదంతాలున్నాయి. పేమెంట్ రాటిఫికేషన్ అండ్ ఎనాలసిస్ ఇన్ పవర్ ప్రొక్యూర్మెంట్ (ప్రాప్తి) వెబ్ సైట్ (సెంట్రల్ మినిస్ట్రీ ఆప్ పవర్ వారి వెబ్ సైట్) జాబితాచూస్తే దేశంలోనే విద్యుత్ సరఫరాకంపెనీలకు ఎక్కవకాలం బకాయిలుపెట్టిన అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల జాబితాఉంది. అత్యధిక కాలం విద్యుత్ సరఫరాకంపెనీలకు ఎక్కువబకాయిలుపెట్టిన సదరుజాబితాలో ఏపీది 3వస్థానం. అత్యధికనెలలు (12నెలలు) బకాయిపెట్టి, ఏపీ టాప్ లోఉంది. కేంద్రం ఎక్కువగా బకాయిలుపెట్టిన రాష్ట్రాలను వివిధకేటగిరిలుగా విభజించింది. ఒకనెల బకాయిఉంటే గ్రీన్ కేటగిరిలో, 1నుంచి3నెలలు బకాయిఉంటే ఎల్లోకేటగిరి, 3నుంచి6నెలలు ఉంటే బీజ్ కేటగిరి, 6నుంచి12నెలలు ఉంటే ఆరెంజ్ కేటగిరి, 12నెలలు దాటితే రెడ్ కేటిగిరిగా విభజించారు.

ప్రాప్తి వెబ్ సైట్ జాబితాప్రకారం 31-05-2022నాటికి విద్యుత్ సరఫరాకంపెనీలకు 12నెలల పాటు రూ,9,700కోట్లుబకాయిలు (దాదాపురూ.10వేలకోట్లు) పెట్టి ఆంధ్రప్రదేశ్ రెడ్ కేటగిరి లో చేరబోతోంది. ఏపీకంటే ముందు జమ్ముకశ్మీర్, మేఘాలయ ఉన్నాయి. కర్ణాటక రూ.5,491కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.1291కోట్లు, గుజరాత్ రూ.755కోట్లు, పంజాబ్ రూ.2519కోట్లు,చత్తీస్ ఘడ్ రూ.1214కోట్లు, జార్ఖండ్ రూ.4015కోట్లు, బీహార్ రూ.1981 కోట్లే బాకీఉంటే, కేరళరూ.671కోట్లు, ఒడిశా రూ.294కోట్లు, తెలంగాణ రూ.7,511కోట్లు, బకాయిపడితే, ఏపీమాత్రం సుమారు 10వేలకోట్లతో టాప్ లోఉంది. దేశంలోనే అత్యధికకాలం (12నెలలు) విద్యుత్ సరఫరా కంపెనీలకు బకాయిలుపెట్టి, రాష్ట్రాన్ని3వస్థానంలోనిలిపిన జగన్ రెడ్డి తనతల ఎక్కడ పెట్టుకుంటాడు? విద్యుత్ సరఫరాచేసిన కంపెనీలకుకూడా ముఖ్యమంత్రి బకాయిలు కట్టడా?

సదరు బకాయిలపై కేంద్రప్రభుత్వం సీరియస్ అవ్వలేదా? బకాయిలు తీర్చేవరకు విద్యుత్ కొనుగోళ్లు కుదరవని, డబ్బులుచెల్లించేవరకు విద్యుత్ కోతలకు సంబంధించి తామేమీచేయలేమని కేంద్రఇంధనశాఖ కార్యదర్శి అలోక్ కుమార్ మొన్న ఏప్రియల్ లో చెప్పలేదా? అలోక్ కుమార్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? ఈ జగన్ రెడ్డి మోసాలుగ్ర్రహించాలని ప్రజలకు ఈ సందర్భంగా దండోరా వేస్తున్నాం. యావన్మంది ప్రజలకు తెలియుచేయునది ఏమనగా.. జగన్ రెడ్డి నిర్మిస్తాను అంటున్న పక్కాగృహాల కరెంట్ కనెక్షన్లకు అవసరమైన రూ.4,500కోట్లు ఇవ్వబడవహో..!

అప్పులుచేసి, ఉన్నఆస్తులు తాకట్టుపెట్టి జగనన్నని నమ్మి పనికిమాలినస్థలాల్లో ఇళ్లుకట్టు కున్న వారందరూ చీకట్లలో మగ్గాల్సిందేనని గుర్తుంచుకోండి. అలానే రోడ్లువేయడం, మంచినీరు సరఫరాచేయడం ఏమీజరగవని గుర్తుంచుకోండి. జగన్ రెడ్డి మోసాలనుగుర్తించి, ఇప్పటి కైనా పాలకుల్నిప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రజల్ని కోరుతున్నాం.

ప్రజలంతా జగన్ రెడ్డి మోసాలనుగుర్తించాలి. ఆయన, ఆయనప్రభుత్వం పక్కాఇళ్లు కట్టించేముందే అన్నిమౌలిక సదుపాయాలు (పక్కారోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ లనిర్మాణం) కల్పించాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాం. అవేవీ చేయకుండా ముఖ్యమంత్రి ఇళ్లుకట్టేస్తున్నానంటూ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలు నమ్మకండి. గడపగడపకు అంటూ వస్తున్నవైసీపీవారిని కాలర్ పట్టుకొనినిలదీసి, పేదల పక్కాగృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎందుకు డబ్బులివ్వనన్నాడో నిలదీయండి. వెనుకబడిన వర్గాలతరుపున ముఖ్యమంత్రిని తాముకొన్నిప్రశ్నలు అడుగుతున్నాం. పేదలపక్కాగృహాలకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లకోసం ముఖ్యమంత్రి రాష్ట్రఖజానా నుంచి ఎందుకని రూ.4,500కోట్లు ఇవ్వనన్నాడో సమాధానంచెప్పాలి.

జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో నిర్మిస్తానుఅంటున్న 15లక్షల గృహాలకు విద్యుత్ కనెక్షన్లకోసం అవసరమైన రూ.4,500కోట్లు ఎప్పుడుచెల్లిస్తావో సమాధానంచెప్పు. కేంద్రప్రభుత్వ డాటా ప్రకారం ఏపీ అత్యధికకాలం (12నెలలు) విద్యుత్ సరఫరాకంపెనీలకు రూ.10వేలకోట్లు బకాయిలుపడిన జాబితాలో ఎందుకునిలిచిందో సమాధానంచెప్పు జగన్మో సపురెడ్డి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన రూ.30వేలకోట్లను ఏంచేశావో సమాధానంచెప్పు జగన్ రెడ్డి?

అవి ఎందుకుతీర్చలేకపోతున్నావో.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు వెంటనే అప్పులుచెల్లించాలని నిన్ను, నీ ప్రభుత్వాన్నిహెచ్చరించింది నిజమో..కాదో సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఏమీతెలియని అమాయకుడిలా ముఖంపెట్టి, ప్రజలముందు ఎన్నాళ్లు నటిస్తావు.. నీనటనలకు, నీ మోసాలకు ఏపీప్రజలు చెక్ పెట్టేరోజు దగ్గరికొచ్చిందని తెలుసుకో. కొత్తగా విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టిన పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫీజులు కూడా ప్రజలు పీకేసే రోజుదగ్గర్లోనేఉంది.

 

LEAVE A RESPONSE