త్రిపురలో 2018 ఎన్నికల నోటిఫికేషన్ నాటికి బిజెపి సింగిల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందని కూడా ఎవరు ఊహించలేదు కానీ 45 రోజులలో జరిగిన ప్రచారంతో 2/3 మెజార్టీ సాధించింది. 40 శాతం ముస్లిం జనాభా ఉన్న అస్సాం లాంటి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వస్తుందని ఏ ఎన్నికల సర్వే ఊహించలేదు.
కమ్యూనిస్టు కంచుకోట ఆయన బెంగాల్ రాష్ట్రంలో లోక్సభలో 18 సీట్లు సాధిస్తుందని ఏ మీడియా విశ్లేషకులు చెప్పలేదు. 2017 ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్లలో అన్ని సర్వేలు హంగ్ వస్తుందని సూచించారు కానీ 75% సీట్లను బిజెపి సాధించింది.
అంతెందుకు… తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపి కనీసం నాలుగు ఎంపీ సీట్లు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. దుబ్బాకలో రఘునందన్ రావుకు డిపాజిట్ కూడా దక్కదని టీవీ మేధావులు చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి 10 సీట్లు కూడా రావని ఛాలెంజ్ వేశారు .కానీ ఇప్పుడు కూడా తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం జరగనుంది. అన్ని సర్వేలు తప్పిదాలని ప్రజలు నిరూపించబోతున్నారు. బిజెపి కనీసం 35 నుంచి 40 వరకు సాధించబోతుంది.
– భారవి