-త్వరలో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తా
-ఉపాధి పథకం ద్వారా 6.77 లక్షల మందికి సహాయం అందించాం
-ఆంధ్రా తో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది
-జనసేన తో మా పొత్తు ఎప్పటికీ అలానే ఉంటుంది
-అమరావతి కి 2500 కోట్ల రూపాయిలు టీడీపి హయాం లో ఇచ్చాం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
జంగారెడ్డిగూడెం: పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు తోడాలి.. అయితే డబ్బు లు తోడు కుంటున్నారు అంటూ పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన అనేక ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పారు
రాష్ట్ర వ్యాప్తంగా వున్న సమస్యలపై అన్ని కోణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు అన్ని పర్యటిస్తున్న అన్ని చోట్ల కార్యకర్తలతో మాట్లాడి ఎటువంటి కార్యాచరణ చేయాలన్నదే ప్రణాళిక ఏర్పాటు చేస్తాం.తొమ్మిదిన్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏమిచేసింది అన్నది ప్రజలకు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్ట్ లు పరిశీలించి త్వరగా ప్రారంభానికి ఆచరణ చేస్తున్నాం.
ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర సహకారం పూర్తిగా ఉంది.పోలవరం ప్రాజెక్ట్ అంటే నీళ్ళు తోడుకోవాల్సిన పరిస్థితి .త్వరలో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తాను. కేంద్ర ప్రభుత్వమే పోలవరం నిధులు పూర్తిస్థాయిలో ఇస్తుంది. ఏలూరు మెడికల్ కాలేజి కి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏలూరు జిల్లాలో లక్ష పైగా ఇల్లు కేటాయింపు చేశాం. జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయి.జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీరు ప్రతి ఇంటికి కుళాయి అందించాం.ఉపాధి పథకం ద్వారా 6.77 లక్షల మందికి సహాయం అందించాం. స్వనిధి పథకం ద్వారా సహాయం 4212 మంది చిరు వ్యాపారులకు అందించాం.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్ని చూస్తున్నాం.”ఆడుదాం ఆంధ్రా ఏమో గానీ ఆంధ్రా తో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది.కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ తన పేరు చెప్పి ప్రజలకు ఇస్తున్నారు.జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు.అవినీతి మయం విషపూరిత మంగా రాష్ట్రం తయారయ్యింది. అవినీతిని ప్రశ్నించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ లకు సంబంధించిన అనేక పథకాలు ఎత్తివేశారు.
అమరావతి కి 2500 కోట్ల రూపాయిలు టీడీపి హయాం లో ఇచ్చాం. మిగ్ జాం తుఫాన్ కి మొట్టమొదటి గా స్పందించి బిజేపి పాడయిన పంట పై పొగాకు, వరి పంట నష్టాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వెళ్ళాం. జనసేన తో మా పొత్తు ఎప్పటికీ అలానే ఉంటుంది. నకిలీ ఓట్లపై ఢిల్లీ లో ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాం.
పాత్రికేయుల సమావేశం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాగికాశీ విశ్వనాథ్ రాజు,గార పాటి రామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి విక్రం కిషోర్,ఏపీ ఆర్ చౌదరి,మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ , మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పాల్గొన్నారు