రాష్ట్ర రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా చేసినందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలి

• కుట్రరాజకీయాలతో అమరావతిని నాశనం చేసిన జగన్ రెడ్డి.. నాలుగున్నరేళ్లుగా ఎక్కడ ఉండి పాలన సాగిస్తున్నాడో ప్రజలకు చెప్పాలి
• నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి దుర్మార్గాలు.. కుతంత్రాలను ఎదిరించి పోరాడుతున్న రాజధాని ప్రాంత రైతులు.. ప్రజాసంఘాలు.. మహిళలకు ఉద్యమాభివందనాలు
• రాజధాని రైతులకు కౌలు చెల్లించలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా?
• తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేని ముఖ్యమంత్రి పేదలకు ఇళ్లు కట్టిస్తాడా?
• రైతుల్ని జగన్ తన కక్షసాధింపులతో వేధించాడు. 1700కు పైగా కేసులు పెట్టాడు. దళితరైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి సంకెళ్లతో రోడ్లపై తిప్పాడు.
• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల నాటకం ఆడాడు.
• చంద్రబాబు హాయాంలో నిర్మించిన భవనాల్లో ఉంటూ.. రైతులిచ్చిన భూముల్లో తిరుగుతూ, సిగ్గలేకుండా రాజధాని ప్రాంతంలోని నిర్మాణ సామగ్రిని అమ్ముకునే దుస్థితికి జగన్ రెడ్డి దొంగల ముఠా వచ్చింది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

ఈ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి నాలుగేళ్లు అయ్యిందని, టీడీపీహాయాంలో సన్ రైజ్ స్టేట్ గా విలసిల్లిన రాష్ట్రాన్ని, జగన్ రెడ్డి కామెడీ స్టేట్ గా మార్చాడని, రాష్ట్రానికి రాజధాని ఏది అనే ప్రశ్నకు సమాధానం లేకుండా చేసినందుకు నిజంగా ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సూచించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ఎవరు కట్టిన భవనాల్లో ఉంటూ.. ఎవరిచ్చిన భూముల్లో తిరుగుతూ చట్టాలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి
“ప్రజలకోసం, రాష్ట్రం కోసం నిర్మించతలపెట్టిన అమరావతిని పూర్తిచేయలేని జగన్ రెడ్డి, నిస్సిగ్గుగా మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశాడు. రాజధా ని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు నాలుగేళ్లుగా ఈ ముఖ్యమంత్రి దురాగతా లపై పోరాడుతున్నారు. అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతుకూలీలపై జగన్ రెడ్డి 1700లకు పైగా అక్రమ కేసులు పెట్టించాడు.

ముఖ్యంగా దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి బేడీలువేసి వారిని రోడ్లపై తిప్పిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రికి సిగ్గు, శరం ఉంటే నాలుగున్నరేళ్లుగా తాను ఎక్కడినుంచి పాలన చేస్తున్నాడో చెప్పాలి? ఎవరిచ్చిన భూముల్లో ఉంటూ.. ఎవరు కట్టిన భవనాల్లో కూర్చొని తన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో… ఏ ప్రాంతంలో ఉండి చట్టాలు అమలు చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి.

ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు దండుపాళ్యం ముఠాకంటే దారుణంగా మారి… చివరకు అమరావతిలోని నిర్మాణసామగ్రిని అమ్ముకునే దుస్థితికి వచ్చారు
చంద్రబాబు నాయుడి హాయాంలోనే రాజధాని అమరావతిలో సచివాలయం… హైకోర్టు భవనం.. ప్రజావేదిక వంటి అనేక భవనాలు నిర్మించడం జరిగింది. ఎమ్మెల్యేల నివాసం కోసం నిర్మించిన క్వార్టర్స్… ఉద్యోగుల కోసం వసతి గృహాల సముదాయం వంటి నిర్మాణాలు దాదాపు 90శాతం వరకు టీడీపీప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. రూ.10 వేలకోట్లు వెచ్చించి వివిధ నిర్మాణాలు చేయడం జరిగింది. అలానే పేదలకోసం టిడ్కో ఇళ్లు నిర్మించడం జరిగింది. 90శాతం పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, వాటిని కూడా జగన్ రెడ్డి నాలుగేళ్లపాటు నిరుపయోగంగా గాలికి వదిలేశాడు.

ఈ ముఖ్యమంత్రి.. వైసీపీనేతలు.. దండుపా ళ్యం ముఠాకంటే దారుణంగా అమరావతిని దోచేశారు. చివరకు టీడీపీప్రభుత్వం నిర్మాణాలకోసం తరలించిన సామగ్రిని, ఆఖరికి రోడ్లను కూడా తవ్వుకొని కంకర, మట్టిని అమ్ముకునే దుస్థితికి జగన్ రెడ్డి ముఠా దిగజారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి అమరావతికి మద్ధతు తెలిపాడు. ఆనాడే అభ్యంతరం తెలిపి ఉంటే, భూములిచ్చే ముందు రైతులు ఆలోచించేవారేమో! విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఇచ్చారు. అది అమరావతేనని ఎప్పుడో నిర్ణయించారు.

మిగ్ జాం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా?
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మాట మార్చి ప్రజల్ని మభ్యపెట్టా డు. చివరకు హైకోర్టులో మూడు రాజధానుల కేసుపై జరిగిన వాదనల్లో తమ ప్రభుత్వం మూడు రాజధానులనే మాట అనలేదంటూ మాట మార్చి.. పిటిషన్ వెనక్కు తీసుకున్నాడు. రాజధానికి భూములిచ్చిన రైతులకు సక్రమంగా కౌలు చెల్లించలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా? ఒప్పందం ప్రకారం రాజధానిలో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. రైతులకు మూడురెట్లు పరిహారం ఇవ్వాలి.

ఆ స్థాయిలో పరిహారం ఇచ్చే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? టీడీపీ ప్రభుత్వంలో రాత్రింబవళ్లు వేలాది మంది పనిచేస్తూ ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం కనిపించేది. జగన్ రెడ్డి వచ్చాక అమరావతి మొత్తం అంధకారం అలముకుంది. మిగ్ జాం తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వలేని అసమర్థుడు మూడు రాజధానులు కడతాడా?

ప్రాంతాలు, ప్రజల మధ్య వైషమ్యాలు రేపడానికే రాజధానిలో ఇళ్ల స్థలాలనే నిర్ణయం తీసుకున్నాడు తప్ప…నిజంగా పేదలకు మంచి చేసే ఆలోచన జగన్ రెడ్డికి లేదు.

ప్రజలతో పాటు.. రాజధాని ప్రాంత వాసులందరూ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోతుందా.. తమకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అమరావతి నిర్మాణం ద్వారా రాష్ట్రానికి వచ్చిన లక్షకోట్ల పెట్టుబ డులు వెనక్కు వెళ్లకుండా ఉంటే…. ఏపీ రూపురేఖలే మారిపోయేవి. యువతకు ఉపాధి ఉద్యోగాలు లభించేవి. రాష్ట్ర ఆదాయం పెరిగేది. ఇవేవీ ఆలోచించకుండా రాజధాని తన స్వార్థానికి వాడుకొని చివరకు ఎవరికీ ఏమీచేయకుండా అందర్నీ ముంచేశాడు జగన్ రెడ్డి.

అమరావతిలో ఇళ్లపట్టాలు ఇస్తానని చెప్పి, ఎక్కడో దూర ప్రాంతాలవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు ఇస్తానన్నాడు. కేవలం ప్రాంతా లు, ప్రజల మధ్య వైషమ్యాలు రేకెత్తించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాడు తప్ప…నిజంగా పేదలకు మంచి చేయడానికి కాదు. రాజధానిపై కులముద్రవేసి దాన్ని నాశనం చేశాడు. జగన్ రెడ్డి అమరావతిపై వేసిన ముద్రలు.. చేసిన దుష్ప్రచారం అంతా బూటకమని తేలిపోయింది. రాజధాని ప్రాంతంలో అన్ని కులాలవారు ఉన్నారు.. అమరావతి చుట్టూ ఉన్న నియోజకవర్గాలు అన్నీ రిజర్వడ్ నియోజ కవర్గాలే. జగన్ రెడ్డి అమరావతి విధ్వంసానికి పాల్పడి నాలుగేళ్లు పూర్తైంది.

అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు తేలిస్తే.. తన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్లకు ప్రజలసొమ్ము దోచిపెట్టడానికి జగన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు
రాష్ట్ర రాజధాని అమరావతే అని హైకోర్టు తేల్చిచెబితే, తన మూర్ఖత్వంతో జగన్ రెడ్డి మరలా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తనవ్యక్తిగత కేసులు వాదించే లాయర్లతోనే ప్రభుత్వం తరుపున కేసులు వాదిస్తూ.. వాళ్లకు వేలకోట్ల ప్రజలసొమ్ము దోచిపెడు తున్నాడు. అమరావతిని నాశనంచేసి ఇప్పుడు విశాఖపట్నంలో మకాం పెడతా నంటూ నాటకాలు మొదలెట్టాడు. నాలుగున్నరేళ్లుగా మొక్కవోని దీక్షతో సాగుతున్న అమరావతి ఉద్యమం నిజంగా ప్రశంసనీయం.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు…అన్నివర్గాలు.. ప్రజాసంఘాలకు ఉద్యమాభినం దనలు తెలియచేస్తున్నాం. టీడీపీప్రభుత్వం రాగానే అమరావతికి జీవం వస్తుంది. మరలా నిర్మాణం మొదలవుతుంది. జగన్ రెడ్డి సైకోపాలనకు ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.

Leave a Reply