లైంగిక వేధింపులకు గురైన అంగన్వాడీ టీచర్ కు టీడీపీ నేతల పరామర్శ

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ గోలి వెంకట కృష్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన అంగన్వాడీ టీచర్ ను తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు పరామర్శించారు. మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ..బాధితురాలికి ధైర్యం చెప్పారు.

రూ. లక్ష ఇస్తాం నిందితుడిపై కేసు విత్ డ్రా చేసుకోమని స్థానిక వైసీపీ నేతలు బాధితురాలిని బెదిరించారని,కులం పేరుతో దూషించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి ఆడియో రికార్డును పోలీసులకు బాధితురాలు అందించినప్పటికీ 354 సెక్షన్ కింద నామమాత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడితో పాటు ఆమెను బెదిరించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నిందితుణ్ణి వదిలేసిన రంగంపేట ఎస్ ఐపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply