Suryaa.co.in

Telangana

నా తండ్రి బాటలో నడుస్తా

– డి ప్యూటీ స్పీకర్ పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
– పేదలకు వస్తువులు పంపిణీ చేసిన రామేశ్వర్ గౌడ్

నిరంతరం పేదలతోనే ఉండాలన్న తండ్రి పద్మారావు గౌడ్ బాటలో నడుస్తానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు తనయుడు తీగుళ్ల రామేశ్వర్ గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో తన జన్మదినం సందర్భంగా.. పేదలకు 50 రైస్ కుక్కర్లు, పది మంది పేదలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. తన తండ్రి మాదిరిగా నిరంతరం పేదల హృదయాల్లో నిలవాలన్నదే తన లక్ష్యమన్నారు. పేదల మధ్యలో ఉండటం గొప్ప అనుభూతని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE