Suryaa.co.in

Andhra Pradesh

మా వాళ్ళనే కొట్టి మా వాళ్ళపైనే కేసులు పెడతారా?

– అధికార మదంతో విచ్చలవిడిగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది
– మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ: వైసీపీ పాలనలో రౌడీయిజం రాజ్యమేలుతోందని, తమ పార్టీ వారినే కొట్టి తమవారిపైనే కేసులు పెట్టే అరాచకరాజ్యం కొనసాగుతోందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో వైసీపీ నేతల దాడిలో గాయపడి డి.వి.ఆర్ ఏరియా హాస్పిటల్ నందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించారు.

ఈ సందర్భంగా సౌమ్య ఏమన్నారంటే.. మొన్న కమ్మవారిపాలెం లో క్రిస్మస్ పండుగ రోజు మాలపల్లి లో పెద్దలు అందరూ కలిసి ఒక వ్యక్తికి స్థలమును కేటాయిస్తే అతను స్వచ్ఛందంగా ఆ స్థలములో అందరికీ ఉపయోగపడేలా స్టేజిని నిర్మించారు.

పండుగ రోజు దాని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకుంటే సర్పంచ్ మరియు సర్పంచ్ నలుగురు కుమారులు పూర్తిగా మద్యం సేవించి మద్యం మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించడం జరిగినది.
సర్పంచ్ మా పేరు ఎందుకు రాయలేదు అని అవమానించడం జరిగింది.దాతల సహకారంతో ప్రైవేటుగా

నిర్మించిన స్టేజీకి సర్పంచు పేరు పెట్టలేదని అధికార మదం తో అందరినీ కొట్టించారు.60 ఏళ్ల సర్పంచిని కొట్టారని తిరిగి 9మంది మా వాళ్ల పైనే కేసు పెట్టారు.

సర్పంచుకు ఎక్కడ ఏ చిన్న గాయం కూడా కాలేదు.ఇప్పుడు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న వ్యక్తికి నడుముపై, తలపై గాయమైనది. ఎంత అన్యాయం? సీఐ గారు, ఎస్ఐ గారు దీనిపై పూర్తి పరిశీలన చేసి చర్యలు తీసుకోండి. మా వాళ్ళనే కొట్టి మా వాళ్ళపైనే కేసులు పెడతారా? ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాం.

LEAVE A RESPONSE