– న్యాయ పోరాటం చేస్తాం… ప్రజా క్షేత్రంలో తెగించి కొట్లాడతాం
– వక్ఫ్ బోర్డు పేరుతో 7 వేల కుటుంబాలను హింసిస్తారా?
– హిందువులను హింసిస్తుంటే దారుస్సలాంలో సంబురాలు
– అన్ని అనుమతులెందుకు ఇచ్చి ఇండ్లు కట్టుకున్నాక నిషేధించడమా?
– ముఖ్యమంత్రి కుటుంబానికి ముడుపులు ఇస్తే నిషేధం ఎత్తేస్తారేమో
– దేవాదాయ భూములు అన్యాక్రాంతమైతుంటే ఎందుకు పట్టించుకోవు?
– మూర్ఖుడి చేతిలో తెలంగాణ బందీ
– కేసీఆర్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు…
– ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్…
– బోడుప్పల్ బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని హామీ
‘‘అన్నీ అనుమతుల తీసుకుని అప్పొసప్పో చేసి భూములు కొని ఇండ్లు కట్టుకున్న తరువాత వక్ఫ్ బోర్డ్ భూములని నిషేధిత జాబితాలో చేరుస్తారా? 7 వేల కుటుంబాలను హింసిస్తారా? మూర్ఖుడి చేతిలో తెలంగాణ పెట్టడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది. అయినా మీరేం భయపడకండి. నేనున్నా… మీ సమస్య పరిష్కారమయ్యేంత వరకు తెగించి కొట్లాడతా. ఈ సమస్యపైనే దీక్షకు కూర్చుంటా. మీ తరపున న్యాయ పోరాటం కూడా చేస్తా. ఎట్లా సమస్య పరిష్కారం కాదో చూద్దాం’’ అంటూ బోడుప్పల్ బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అండగా నిలిచారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ నాచారం ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో వక్ఫ బోర్డు ఆగడాలకు బలైన బాధిత కుటుంబాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పడుతున్న బాధలను బండి సంజయ్ ద్రుష్టికి తీసుకు రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపాయి.
ఈ సందర్బంగా వారి వద్దకు వచ్చిన బండి సంజయ్ కు వినతి పత్రం అందజేసిన బాధితులు తమ కష్టాలను వెళ్లబోసుకున్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కొమరయ్య మాట్లాడుతూ రిటైర్ మెంట్ డబ్బులతో బోడుప్పల్ లో ఇంటి స్థలం తీసుకున్నానని.. తీరా ఇల్లు కట్టుకుందామంటే నిషేధిత జాబితాలో ఉందని అడ్డుకుంటున్నారని వాపోయారు. తమ బిడ్డకు మెడిసిన్ సీటు వచ్చిందని.. డబ్బులు అవసరమై ఇల్లు అమ్ముదామంటే నిషేధిత జాబితాలో చేర్చడంతో కొనే నాథుడే కరువయ్యాడని మరో బాధిత మహిళ వాపోయారు. అనంతరం బండి సంజయ్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…
తెలంగాణను పట్టుకెళ్ళి మూర్ఖుడి చేతిలో పెట్టారు. మీరు ఐదు కోట్లో… లేదా ఎంతో కొంత వసూలు చేసి కేసీఆర్ కి ఇస్తే… మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తాడు. 7000 మంది(ఫ్లాట్స్)లో వేయి ప్లాట్లను కేసీఆర్ కుటుంబానికి ఇస్తే… వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాడు. కెసిఆర్ కు కొంచమైనా సిగ్గుండాలి. LRS, BRS సహా కరెంటు బిల్లు, నల్లా బిల్లు అన్నీ కట్టినారు. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెలంగాణలో ఉన్న ఆలయ భూములన్నిటిని కబ్జా చేస్తున్నారు.
కెసిఆర్ కొడుకు కేటీఆర్ నాస్తికుడు. వక్ఫ్ బోర్డ్ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ననో మొన్ననో చేసిన దానిని నిషేదిత జాబితా అనరు. రిజిస్ట్రేషన్ చేసిన వాటిని ఎలా నిషేధిత జాబితాలో పెడతారు? LRS, BRS తీసుకున్న తర్వాత మళ్లీ పర్మిషన్ అని ఎలా అంటారు?కెసిఆర్ తన కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నాడు.
తప్పకుండా మీకోసం ఫైట్ చేస్తా… మీకోసం లీగల్ టీం ను కూడా ఏర్పాటు చేస్తా. మీకోసం రోడ్డుమీద కొట్లాడుతా… న్యాయబద్ధంగా పోరాడుతా. మీకు వందకు వంద శాతం అండగా ఉంటాం. కెసిఆర్ తప్పక దిగి రావాల్సిందే… దిగి రాకపోతే మనం దింపేద్దాం. వక్ఫ్ బోర్డ్ ను ఆపితే దారుసలాంలో డ్యాన్సులు చేస్తారు. మీకు ఎందుకు ఇండ్లు రావో… ఎందుకు రిజిస్ట్రేషన్లు కావో నేను చూస్తా.
ఇంకో ఆరు నెలలు మాత్రమే కేసీఆర్ సర్కార్ ఉంటుంది. వెంటిలేటర్ పై ఉంది. ఎప్పుడైనా కూలిపోవచ్చు. మీరు బిజెపిని ఆదరించండి. మీ 7000 కుటుంబాలు తలుచుకుంటే ఉప్పల్ లో బిజెపి గెలవకపోతే ఇంకా ఏమి గెలుస్తుంది? కేసీఆర్ రాత్రంతా తాగుతాడు… తెల్లందాక పంటడు. మీకోసం తప్పకుండా ఫైట్ చేస్తా… కావాలంటే ఒకరోజు మీకోసం దీక్ష కూడా చేస్తా. మీరే డేట్ ఫిక్స్ చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తా… ముఖ్యమంత్రి ఎందుకు దిగిరాడో నేనే చూస్తా. దసరా తర్వాత 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” చేపట్టబోతున్నా. మీరంతా ఏకమై టీఆర్ఎస్ ను కసితో గద్దె దించేదాకా పోరాడండి. బీజేపీకి మద్దతివ్వాలని కోరుకుంటున్నా.