– చిత్రపరిశ్రమకు వీసమెత్తు సాయంచేయని ముఖ్యమంత్రికి, దాన్నిధ్వంసంచేసే అధికారం ఎక్కడిది?
– టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్
సినిమా టికెట్ల ధరలు తగ్గించి, ప్రజలకుతానేదో పెద్దబహుమానం ఇచ్చినట్లుగా సమర్థించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి, పేదలకు రూ.5లకే పిడికెడు అన్నంపెట్ట అన్నా క్యాంటీన్లు మూసేసినవ్యక్తి, 5రూపాయలకే సినిమా చూపిస్తానంటూ జనాన్ని మరోరకంగా వంచిస్తున్నాడని, ఏహక్కుతో ఆయన సినిమాపరిశ్రమపై పడ్డాడో సమాధానంచెప్పాలని టీడీపీనేత, టీడీపీ సాంస్కృతికవిభాగం రాష్ట్రఅధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహప్రసాద్ డిమాం డ్ చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
కేవలం రెండుమూడుకులాలపై తనకున్న ద్వేషాన్ని, ఏహ్యభావనను నిరూపించుకోవడానికే ముఖ్యమంత్రి కన్ను సినిమాపరిశ్రమపై పడిందని ప్రజలంతా అనుకుంటున్నారు. అమరావతిపై గతంలో ఎలాగైతే కమరావతి అనే విషప్రచారం చేసి, దళితులరాజధానిని నాశనంచేశాడో, అదేవిధంగా సినిమాపరిశ్రమను కేవలం ఒకటిరెండు వర్గాలకే పరిమితమని భావిస్తున్న ముఖ్యమంత్రి వేలాదికుటుంబాల పొట్టకొట్టడానికి సిద్ధమయ్యాడు. గేట్ కీపర్ మొదలు, ప్రొజెక్టర్ ఆపరేటర్ వరకు ఒక థియేటర్లో ఎందరు పనిచేస్తారో ఈ ముఖ్యమంత్రికి తెలుసునా?
సినిమా టిక్కెట్లధరలు తగ్గిస్తే, ప్రజలకు ఎలా మేలుజరుగుతుందో ముఖ్యమంత్రే చెప్పాలి. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నసమయంలో పాదయాత్రచేసి అలసిపోయిన జగన్మోహన్ రెడ్డి, ఎవెంజర్స్ సినిమా చూడటానికి వెళ్లాడు. ఆరోజు అదే సినిమాథియేటర్లో ఆయన పాప్ కార్న్, కూల్ డ్రింక్ కొనే ఉంటాడు.. వాటిధరకంటే తక్కువగా ఇప్పుడు సినిమాటిక్కెట్ల ధరలు తగ్గాలంటున్నాడు. వాళ్లతెలివితేటలు, పెట్టుబడితో సినిమాపరిశ్రమ ను అనేకమంది నిలబెట్టుకుంటే దాన్నికబళించే అధికారం, హక్కు ఈముఖ్యమంత్రికి ఎవరిచ్చారు?
నిన్నటివరకు ఆన్ లైన్లో టిక్కెట్లు అమ్ముతానంటూ, సినిమాపరిశ్రమకు వచ్చే ఆదాయాన్నికూడా చూపించి, అప్పులు పొందాలని ముఖ్యమంత్రి ప్రయత్నించాడు. ప్రపంచం గర్వించే సినిమాలను తెలుగుచిత్రపరిశ్రమ రూపొందిస్తోంది. అలాంటి పరిశ్రమకు ఎంతో కొంతఊతమివ్వాల్సింది పోయి, ఉప్పెనలా దాన్ని ముంచేయడానికి ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను తెలుగుచిత్రపరిశ్రమ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరుతున్నాం.
2014లో భారతి సిమెంట్ ధర ఎంతఉంది.. ఇప్పుడెంత ఉంది ముఖ్యమంత్రి గారు? జగన్మోహన్ రెడ్డివే పరిశ్రమలు, కంపెనీలా …. మిగతావి ఏవీ పరిశ్రమలు కావా? సినీ పరిశ్రమకు ఎలాంటిప్రోత్సాహకాలు ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి టిక్కెట్ల ధరలు నిర్ణయించే అధికారంలేదు. ఎక్కడాకూడా ఏనాడూ చిత్రపరిశ్రమ మనుగడకు అనుకూలమైన వాతావరణాన్ని ముఖ్మమంత్రి రాష్ట్రంలో కల్పించలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి కొండెక్కి నిత్యావసరాల ధరల్ని, ప్రజలపై బాదుతున్న బాదుడుని తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిది, అంతేగానీ చౌకబారు నిర్ణయాలతో వేలాదిమంది కడుపునింపే వ్యవస్థలను ధ్వంసంచేయవద్ద ని ముఖ్యమంత్రికి సూచిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ, కంపెనీ అయినా వచ్చాయా .. రాష్ట్రంలో 1100థియేటర్లు ఉంటే, ఇప్పటికే వాటిలో ఒకవంతు మూతపడ్డాయి. వందల కోట్లు ఖర్చుపెట్టి, సినిమాలు తీస్తుంటే, వాటిద్వారా ఈప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తోం ది. తెలుగుసినిమాపరిశ్రమ విషయంలో ముఖ్యమంత్రి జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తన కులఅహంకారానికి సినిమాపరిశ్రమను బలిచేయవద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నాం.