Home » అన్నదాతలతో కలిసి ప్రభుత్వంపై దండెత్తుతాం

అన్నదాతలతో కలిసి ప్రభుత్వంపై దండెత్తుతాం

• జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రైతులకు మనోవేదన, వ్యవసాయరంగానికి ఆవేదనే మిగిలాయి
• నీకది…నాకిది అనేధోరణిని ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ విడనాడలేదు.
• చెరకు రైతులు బకాయిలు చెల్లించమంటే వారిపై తప్పుడు కేసులు పెట్టి, సీఆర్ పీసీ 41 కింద నోటీసులిస్తారా?
• అమూల్ సంస్థకు పాలుపోయించడానికి ప్రభుత్వనిధులు ఖర్చుపెడుతున్న ముఖ్యమంత్రి చెరకురైతులకోస రూ.120కోట్లు ఖర్చుపెట్టలేడా?
• రూ. 7వేలు ఇస్తాం….వాటితోనే రైతులు జీవితమంతా బతకాలనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నాడు
• రైతాంగానికి అండగా ఉంటానన్న, బకాయిలుపడిన పరిశ్రమలను అదుకుంటానన్న, రూ.5వేల కోట్ల ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తానన్న వాగ్ధానాలను జగన్మోహన్ రెడ్డి తక్షణమే అమలుచేయాలి
– తెలుగు రైతు విభాగం విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

మహారాజశ్రీ శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యవసాయరంగం అన్నివిధా లా దివాళా తీసిందని, రైతులకు తీవ్రమైనమనోవేదనే మిగిలిందని, వ్యవసాయరంగాన్ని నిలబెట్టి, రైతులను సంతోషపెట్టే కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాకకూడా నీకింత…నాకింత అనేధోరణిని విడనాడలేదని టీడీపీనేత, తెలుగురైతు విభాగంరాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …రైతులను, మరీముఖ్యంగా వ్యవసాయరంగాన్ని, వ్యవసాయాధారిత పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, తనకేమీ తెలియనట్లు నటిస్తూ పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో

ఉద్యానపంటలు, వాణిజ్యపంటలు గానీ, ధాన్యం, ఇతరఅపరాలపంటలు గానీ వేసినవారంతా ఈసురోమనే పరిస్థితులను ముఖ్యమంత్రి కల్పించాడు. గతంలో చెరకుసాగుచేసేరైతులకు ఒక గౌరవం ఉండేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చెరకురైతులపై తీవ్రమైన ని ర్బంధాలు కేసులు కొనసాగుతున్నాయి.

చెరకురైతులు తమబకాయిలుఇవ్వమని అడిగిన నేరానికి వారిపై కేసులుపెట్టిజైళ్లకు పంపుతున్నారు. తాండవషుగర్స్ ఫ్యాక్టరీ బకాయిల విషయంలో అర్జునరావు అనే రైతు తునిలో మరణించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం చెరకురైతులను హత్యలుచేసేవరకు వెళ్లింది. అమూల్ సంస్థను అభివృద్ధి చేయడా నికి, అమూల్ సంస్థకు పాలుసేకరించడానికి ఈ ముఖ్యమంత్రి పడుతున్న తపన, చూపు తున్న శ్రద్ధ, అందుకోసం ఖర్చుపెడుతున్ననిధులను, అదేవిధంగా రాష్టరైతాంగంపై ఎందుకు చూపలేకపోతున్నాడని ప్రశ్నిస్తున్నాం.

పాదయాత్ర సమయంలో బకాయిలతో మూతపడిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలను తిరిగి తెరుస్తానని, నష్టాలుచవిచూస్తున్న వాటిని ఆదుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. రాష్ట్రంలో నష్టాల్లో నడుస్తున్న 8 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల కోసం, చెరకురైతులకు ఉన్నబకాయిలు చెల్లించడంకోసం ముఖ్యమంత్రి ఎందుకు ప్రయత్నిం చడంలేదు? అమూల్ పరిశ్రమకు మేలుచేసేక్రమంలో ముఖ్యమంత్రి తనతాబేదార్లు, చెంచాల కోసం రూ.120కోట్లవరకు వెచ్చిస్తున్నాడు.

ఆ 120కోట్లసొమ్ముని చెరకురైతులకు చెల్లిస్తే, వారిబకాయిలన్నీ తీరిపోతాయి. రూ.120కోట్లు చెల్లించడానికి కూడా ఈముఖ్యమంత్రికి మన స్సురావడంలేదు. తానుచెప్పినవి ప్రజలు గుర్తుంచుకుంటారా… రైతులకు ఏం గుర్తుంటుంది అనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నాడు. రైతులను గెలిపించాలని…వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న సదుద్దేశంతోచంద్రబాబునాయుడు గారు అమలుచేసిన అనేకపథకాలను, రైతులకు అయనిచ్చిన ప్రోత్సాహకాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యంచేశాడు.

తనకు ఉన్నక్విడ్ ప్రోకో లక్షణంతో, రైతుభరోసాకేంద్రాల ముసుగులో రైతులుపండించే ఉత్పత్తులకు నాణ్యతలేదని, రైతులపంటలకు విలువలేదని వారినే నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క నుంచి అవే ఉత్పత్తులను వైసీపీవారు ఎక్కువధరకు అమ్ముకొని బాగుపడేలా చేస్తున్నాడు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలుస్తాననిచెప్పిన జగన్మో హన్ రెడ్డి, ఇప్పుడు అదేరైతులను హీనాతిహీనంగా చూస్తున్నాడు.

చెరకు రైతులకు బకాయిలు చెల్లించడానికి ఆర్ ఆర్ యాక్ట్ పెడతామని, ఫ్యాక్టరీల భూములు అమ్ముతామని ప్రభుత్వపెద్దలు, మంత్రులు ఊదరగొట్టారు. చెరకు రైతులు తమబకాయిలు చెల్లించండి అని మొత్తుకుంటుంటే, వారి వేదన, రోదన ఈ ప్రభుత్వానికి వినిపించడంలేదు. ఇప్పటికే వారుసాగుచేసిన చెరకు నరకడానికి సిద్ధంగాఉంటే, వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి, కొత్తపంటను ఫ్యాక్టరీలకు వెళ్లే ఏర్పాటుచేయకుండా, వారిని భిక్షగాళ్ల మాదిరి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి, 41సీఆర్పీసీ నోటీసులిస్తారా? తమకు ఇవ్వాల్సిన బకాయిలుఇచ్చి, కొత్తగా పండించిన చెరకు తీసుకొని, చెరకుఫ్యాక్టరీలు ప్రారంభించి క్రషింగ్ మొదలుపెట్టమని అడగడమే చెరకురైతులు చేసినతప్పా?

రైతు భరోసా కింద రూ.7వేలు ఇస్తాను… వాటితోనే బతకండిఅంటే అన్నదాతల బతుకులు బాగుపడతాయా అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్ని స్తున్నాం. బకాయిలు అడిగినరైతుల్ని కొట్టే చంపేస్థితికి ఈ ముఖ్యమంత్రి వచ్చాడు. నెత్తురుని చెమటగా మార్చి ఆరుగాలం ‌కష్టించి పంటలు పండిస్తున్న రైతులు ఈ ముఖ్య మంత్రికి బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? బకాయిలు, ధాన్యం కొనుగోళ్ల తాలూకా సొమ్ములు ఇవ్వమని అడిగిన రైతులను కొట్టి చంపుతా అనే స్థితికి ముఖ్యమంత్రి వెళ్తున్నాడు.. అలాం టి వైఖరి, విధానం ఆయనకే పెనుముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నాం.

తాను ఇచ్చిన వాగ్ధానం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి తక్షణమే రూ.5వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. 5వేలకోట్లతో ధరలస్థిరీకరణనిధి ఏర్పాటుచేస్తే, రంగుమారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలుచేయడానికి వీలవుతుంది. అలానే వ్యవసాయరంగంలో వస్తున్న అనేకసంక్షోభాలతో రైతులు దెబ్బతినకుండా వారిని ఆదుకోవ డానికి అవకాశం ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి చెరకురైతులబకాయిలు చెల్లించడంకోసం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోలేడా? ముఖ్యమంత్రి అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలకు, వారినిమోసగిస్తున్న తీరుకి ఆయన స్వస్తిపలక్కపోతే, అన్నదాతలతో కలిసి ప్రభుత్వంపై దండెత్తుతామని హెచ్చరిస్తున్నాం.

Leave a Reply