ఎక్కడమ్మ నువ్వు లేనిది?
ఏమిటి నువ్వు చేయలేనిది??
తల్లిగా, చెల్లిగా,భార్యగా,అనురాగవల్లిగా… ఇంటి బాధ్యతలు
నెరవేర్చడంలో తనకుతానే సాటి గా నిలిచిన మహిళ.
నేడు ఇంటికే పరిమితం కాలేదు. బయటికొచ్చి ఏ రంగంలో నైన రాణించగలను.నన్ను నేను నిరూపించుకోగలను అని ఎలుగెత్తి చెబుతోంది.
ఒడిదుడుకులు ఎదురైనా.. ఆటంకాలు అడ్డొచ్చినా తట్టుకుని మునుముందుకు సాగిపోగలనని నిరూపిస్తోంది.
తనదైన శైలిలో అడుగు ముందుకేసి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.
నేడు మహిళ అడుగిడని రంగం ఏది లేదు.
అలా అడుగిడిన రంగాలలో సమర్ధవంతంగా అయా రంగాల్లో తన ప్రత్యేకత నిలుపుకోవడం అమెకు వెన్నతో పెట్టిన విద్య.