Suryaa.co.in

Andhra Pradesh

మహిళలకు రక్షణ లేదు

– చట్టం కాగితాలకే పరిమితమైంది
– చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు
– జగన్ సిగ్గుపడాలి
– ‘‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’’అంశంపై కుప్పం మహిళలతో భువనమ్మ ముఖాముఖి

కుప్పం : ఒకప్పుడు స్త్రీని అబలగా చూసేవారు..వారిని వంటింటికే పరిమితం చేసేవారు. స్త్రీలకు గౌరవం, ధైర్యం, హక్కులు ఇచ్చి మహిళలను సమాజంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 1986లో ఎన్టీఆర్ స్త్రీలకు ఆస్తిలో సమానహక్కును కల్పించి చరిత్ర సృష్టించారు. మహిళలకు తిరుపతిలో పద్మావతి యూనివర్శిటీని తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు..ఆయనవల్లే మహిళలు నేడు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు.

చంద్రబాబు హయాంలో ప్రతి కిలోమీటరుకు ప్రాథమిక పాఠశాలలు, మూడు కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ, 5కిలోమీటర్లకు హైస్కూలు వీటితో పాటు కాలేజీ, డిగ్రీకాలేజీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ వల్ల యువత మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు..వారి కుటుంబాలు బాగున్నాయి. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్, డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చారు..1997లో బాలికాశిశు సంరక్షణ పథకం ద్వారా ఆడపిల్ల పుడితే ఆ పిల్లకు రూ.5వేలు బ్యాంకు అకౌంట్లో వేసి వారి అభివృద్ధికి నాంది పలికారు.

8 నుండి 10వ తరగతి చదివే విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు ఇచ్చారు. దళిత మహిళ ప్రతిభా భారతికి ఏపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్పీకర్ పదవిని ఇచ్చారు. దీపం, డ్వాక్రా రుణమాఫీ, పసుపుకుంకుమ, అమృతహస్తం, నవజాత శిశువులకు బేబికిట్లు, తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్, సామూహిక సీమంతాలు, తల్లికి వందనం, పెళ్లికానుక పథకాలను చంద్రబాబు అమలు చేశారు. చంద్రబాబు మహిళా శక్తి ద్వారా రూ.1,500 18ఏళ్లు నుండి 59సంవత్సరాల వయస్సు వారికి ఇస్తామని హామీ ఇచ్చారు.

తల్లికివందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు. దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చంద్రబాబు మహిళలకు హామీ ఇప్పటికే ఇచ్చారు. జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పాలంటే సంవత్సరాలు సరిపోవు. చంద్రబాబు పాలనలో మహిళలు ధైర్యంగా బయట తిరిగేవారు..కానీ నేడు జగన్ పాలనలో ఇది లేదు.

ప్రొద్దుటూరులో 6సంవత్సరాల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడితే ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఆర్డర్ వేస్తే..ఆ నిందితుడు ప్రాణభయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దిశ యాప్, పథకం ద్వారా మహిళలకు రక్షణ ఎక్కడా దొరకడం లేదు…చట్టం కాగితాలకే పరిమితమైంది. మహిళలను మాయ చేయడానికి, మహిళలకు ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికే దిశ పథకాన్ని జగన్ అమలు చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు.

మహిళలపై అత్యాచారాల్లో ఏపీ నంబర్ వన్ స్థానంలో జగన్ నిలబెట్టాడు. ఓ మహిళకు గంజాయి అలవాటు చేసి నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు…ఈ విషయాలపై జగన్ సిగ్గుపడాలి. ఏపీలో 2019 నుండి 2021వరకు 30196 మంది మహిళలు మిస్ అయ్యారని చట్టసభల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడుకుంటున్నారు. మిస్ అయిన వారిని కనిపెట్టడానికి పోలీసులు, వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందు ఉండాలని కోరుకుంటున్నాను.

కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఏమన్నారంటే.. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అశువులుబాసిన కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ ఓదార్చి, ఆర్థికసాయం అందించడం అభినందనీయం. ఆడబిడ్డలు భర్తలు, కుటుంబ సభ్యులపై ఆధారపడే స్థితి నుండి మహిళలను ఆర్థికంగా నిలబెట్టేలా చేసిన వ్యక్తి చంద్రబాబు. కుప్పంలో పాడిపరిశ్రమ విరాజిల్లుతోంది అంటే కారణం చంద్రబాబు.

నియోజకవర్గ సమన్వయకర్త, మునిరత్నం ఏమన్నారంటే.. కుప్పంలోని 66వేల కుటుంబాల్లో కనీసం 40వేల కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు తయారుచేయాలని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో చిన్న చిన్న తాయిలాలకు ప్రభావితం కాకుండా భవిష్యత్తును ఆలోచించాలని కోరుతున్నా. చంద్రబాబు విజనరీ లీడర్..చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే కుప్పం భవిష్యత్తు బాగుంటుంది. కుప్పంలో లక్ష మెజారిటీ వచ్చేందుకు కుప్పం ప్రజలు తమ ఓటును వినియోగించాలని కోరుతున్నా.

ఎమ్మెల్సీ, పంచుమర్తి అనురాధ ఏమన్నారంటే.. 2004లో అలిపిరి సంఘటన జరిగిన సమయంలో చంద్రబాబు గురించి భువనమ్మ పడిన ఆవేదన వర్ణించలేనిది. కరోనా సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎవర్నీ పట్టించుకోని సమయంలో చంద్రబాబు, లోకేష్ ప్రజల్లో తిరిగిన సమయంలో భువనమ్మ ఆందోళన పడ్డారు. వైసీపీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను గాలికొదిలేస్తే, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆక్సిజన్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత భువనమ్మది. ఎంపీ సీటుకోసం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ నే చంపేశారు. ఇలాంటి జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేష్ పాదయాత్ర చేస్తానంటే ఆందోళనను దిగమింగుకుని భువనమ్మ లోకేష్ ను ఆశీర్వదించి ముందుకు పంపారు.

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా విద్య, వైద్యం, బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు. వరద వస్తే ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకున్న ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపే భువనమ్మది. చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి జైలులో పెట్టిన సమయంలో భర్తకు కూతవేటు దూరంలో ఉంటూ న్యాయాన్ని గెలిపించేందుకు అనేక పోరాట కార్యక్రమాలు చేశారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు 3,200 కిలోమీటర్లు ప్రయాణం ఇప్పటివరకు చేశారు. కార్యకర్తల పిల్లల్లో చదువుకునేవారు ఉంటే వారిని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదవించే బాధ్యతలు తీసుకున్నారు.

ప్రశ్నోత్తరాలు….

సరస్వతి: చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం 20కిపైగా పథకాలు తెచ్చారు. ఆ నాడే మహిళలను ఆర్టీసీ కండక్టర్లుగా నియమించారు. మహిళలకు ప్రోత్సాహం విషయంలో చంద్రబాబు గారి ఆలోచనలు ఎలా ఉంటాయి?

జవాబు:- చంద్రబాబుగారి ఆలోచన ఎప్పుడూ ఒక్కటే..మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని. అందుకే ఆయన దళిత మహిళను అసెంబ్లీ స్పీకర్ ను కూడా చేశారు. ఇదొక చరిత్ర..అదేవిధంగా ఆర్టీసీలో మహిళా కండక్టర్ల ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాల్లో మహిళలకు ప్రాధాన్యత, ఐటీ తీసుకురావడంతో మహిళలకు అపారమైన ఉద్యోగావకాశాలు, నైపుణ్యశిక్షణ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు, కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం, సబ్సిడీలోన్లు ద్వారా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా మహిళలను ప్రోత్సహించారు. మహిళల గురించి చంద్రబాబుగారి ఆలోచనలు ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘మహిళలు మగవాళ్లకంటే ఏమీ తక్కువ కాదు…మహిళలు దైనికైనా సమర్థులు..మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు’’.

స్వాతి: చంద్రబాబు గారు అన్యాయంగా 53 రోజులు జైల్లో ఉన్నారు. ఎప్పుడూ ప్రజలే ప్రాణంగా పనిచేసే ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ధైర్యంగా నిలబడ్డారు. నిజం గెలవాలి అని ఎలా రోడ్డెక్కి పోరాటం చేశారు?

జవాబు: చంద్రబాబుగారు ఏనాడూ కుటుంబం గురించి ఆలోచించిన వ్యక్తి కాదు. మా కుటుంబ సభ్యులం ఏనాడూ చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయాలకు గాని, సెక్రటేరియట్ కు గాని వచ్చినవాళ్లం కాదు. చంద్రబాబుగారు ఎప్పుడూ యువత భవిష్యత్తు, స్టేట్ డెవలప్మెంట్, మహిళాభివృద్ధి వంటి అంశాలపై ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనల భాగమే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం. దీనిద్వారా 3,08,425మంది శిక్షణ తీసుకున్నారు.. 79వేలమంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇలాంటి కార్యక్రమంలో చంద్రబాబుగారు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అక్రమ కేసు పెట్టి, 53రోజులు జైల్లో నిర్బంధించారు.

రాష్ట్ర యువతకోసం, రాష్ట్ర భవిష్యత్తుకోసం నిలబడిన నాభర్తను వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసింది. నిజాన్ని కప్పిపెట్టి కక్షసాధిస్తున్నారు..నిజాన్ని గెలిపించాలి..చంద్రబాబుగారు తప్పుచేయలేదు అని సమాజానికి అర్థమయ్యేలా చేయాలని నేను నిజం గెలవాలి అనే పోరాటానికి శ్రీకారం చుట్టాను. నేను ధైర్యంగా రోడ్డుమీదకు వచ్చి పోరాడానంటే అది నా తండ్రి ఎన్టీఆర్, నా భర్త చంద్రబాబాగారి నుండి పొందిన స్ఫూర్తే. నేను ఒక్కదాన్ని రోడ్డుమీదకు వస్తే…నాకు తోడుగా రాష్ట్రంలోని మహిళలంతా రోడ్డుమీదకు వచ్చి పోరాడారు…నిజాన్ని గెలిపించారు.

వరలక్ష్మి:- చంద్రబాబు గారు ఇంట్లొ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు….డైనింగ్ టేబుల్ మీద కలిసి భోజనం చేస్తున్నప్పుడు మీతో ఏ ఏ అంశాలు చర్చిస్తారు. ఆయన ఆలోచనలు, చర్చలు ఎలా ఉంటాయి.
జవాబు: చంద్రబాబుగారు ఇంట్లో మాతో కలిసి భోజనం చేసే సమయంలో మాగురించి, మా బాగోగులు గురించి ఏనాడైనా మాట్లాడతారేమో అని అనుకుంటాం. కానీ ఆయన మహిళలకు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది? మహిళలకు ఏ రంగంలో ఏ అవకాశం ఇస్తే బాగుంటుంది? ఏ పథకం పెడితే మహిళలకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది? యువతకు ఇంకా ఎలాంటి అవకాశాలు, ఉద్యోగాలు, కంపెనీలు, టెక్నాలజీ తీసుకురావాలి? అనే అంశాలే మా డైనింగ్ టేబుల్ మీద చర్చకు వస్తాయి.

నేను కూడా మహిళల అభివృద్ధి కోసం నాకు తోచిన సలహాలు, నా ఆలోచనలు నా భర్తతో పంచుకుంటాను. ఆయన మీ మనిషి…మీ గురించి, మీ భవిష్యత్తు గురించి నిరంతరం తపించే వ్యక్తి..ఆయన్ను మీ నుండి ఎవరూ దూరం చేయలేరు…రానున్న ఎన్నికల తర్వాత మహిళల భవిష్యత్తు మరో కొత్త మలుపులు తిప్పాలని నా భర్త, మీ చంద్రబాబుగారు..మంచి మంచి ప్లానింగులతో రెడీగా ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుని మీ భవిష్యత్తును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.

సౌజన్య, విద్యార్థిని, కళాకారిణి:– చంద్రబాబు సీఎం అయ్యాక శాస్త్రీయ నృత్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎలా ప్రోత్సహిస్తారు?
మాధానం:
నేను కూచిపూడి నృత్యాన్ని 11సంవత్సరాలు నేర్చుకున్నాను. వెంపటి చినసత్యంగారు నా గురువు. నాతండ్రి నాకు 2సంవత్సరాలు భరతనాట్యం కూడా నేర్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూచిపూడి కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్తారు. చంద్రబాబు అమలు చేయగలిగిన హామీనే ఇస్తారు. హామీ ఇస్తే నెరవేరుస్తారు.

ప్రశ్న: మమత: చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయిన సమయంలో మీరు ఎలా పోరాడారు?
సమాధానం: స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 3వేల కోట్లు అవినీతి జరిగిందని, రూ.300కోట్లు అవినీతి జరిగిందని, రూ.3కోట్లు అవినీతి జరిగిందని ఇష్టమొచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ నేటికీ నిరూపించలేకపోయింది. చంద్రబాబు అరెస్టు సమయంలో జైలులో ఆయన్న కలిసేందుకు వెళ్లినప్పుడు కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవాలని నాకు సూచించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలు చేసిన పోరాటాలపై అక్రమంగా కేసులు పెట్టి, ఇష్టమొచ్చినట్లు స్టేషన్లలో నిర్బంధించారు. మహిళలపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు.

క్లస్టర్ గా ఏర్పాటు చేసి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు ఇవ్వాలని నా స్నేహితులు సూచించారు…కానీ నా మనస్సు ఒప్పుకోలేదు. అందుకే వేలాది కిలోమీటర్లు తిరిగి కార్యకర్తల కుటుంబాలను నేరుగా కలిసి, వారికి అండగా నిలుస్తున్నాను. నాకు మీరే రక్షణ కవచం. అందుకే ధైర్యంగా ముందుకు వెళుతున్నాను. లోకేష్ ను ప్రజల్లోకి వెళితే వైసీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తుందని భయపడ్డాను. కానీ లోకేష్ కు కార్యకర్తలు రక్షణ వలయంగా నిలిచారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా నాకు నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో లోకేష్ కూడా సమర్థుడనే నమ్మకం నాలో బలంగా ఉంది.

ప్రశ్న: మాకు ఆవులు, ఫీడ్ సబ్సిడీపై టీడీపీ పాలనలో ఇచ్చారు. నేడు వైసీపీ పాలనలో రావడం లేదు. పాలదిగుబడి తగ్గిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గతంలో అమలు చేసిన పథకాలను కొనసాగిస్తారా?
సమాధానం: గ్రామాల్లో మహిళలు పాడి పరిశ్రమను ఆధారాంగా చేసుకుని బ్రతుకుతున్నారు. వారిని మరింత ప్రోత్సహించడానికే చంద్రబాబు పాడి పరిశ్రమను గతంలో ప్రోత్సహించారు, అనేక సబ్సిడీలు ఇచ్చారు. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో అమలు చేసిన పథకాలను కొనసాగిస్తారు. గ్రామస్థాయిలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే చంద్రబాబు పాడిపరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. మహిళలను వ్యవసాయం, ఇతర రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబుగారు.

జ్యోత్స్య, కొలమడుగు: మేము గార్మెంట్స్ కంపెనీలో పనులు చేసుకునేవాళ్లం. గతంలో గార్మెంట్స్ ను చంద్రబాబు ప్రోత్సహించారు అందువల్ల మాలాంటి వాళ్ళకు అనేకమందికి ఉపాధి దొరికింది. నేడు ప్రోత్సాహకాలు లేవు. దానివల్ల వాటిలో పనిచేసేవాళ్లకు జీతాలు తగ్గించేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గార్మెంట్స్ రంగాన్ని ప్రోత్సహిస్తారా?
సమాధానం: చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు ఇచ్చి గిట్టుబాటు అయ్యేలా చూస్తారు.

జాకీ కంపెనీని అనంతపురం జిల్లాకు తెస్తే జగన్ ప్రభుత్వం దాన్ని తరిమేసింది. అలాగే అమర్ రాజా బ్యాటరీ కంపెనీని కూడా తరిమేశారు. జాకీ కంపెనీని తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో శ్రమ పడ్డారు. యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని దుర్మార్గంగా తరిమేశారు.

LEAVE A RESPONSE