Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి జయరాంను ఖాళీ బిందెలతో చుట్టుముట్టిన మహిళలు

-గడపగడపకూ ప్రభుత్వంలో మంత్రికి అవమానం
-హామీ ఇచ్చి బయటపడ్డ మంత్రి జయరాం

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలో మంత్రి జయరాం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి జయరాంకు నిరసన సెగ తగిలింది. కైరుప్పలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహిళలు, గ్రామస్తులు.. ఖాళీ బిందెలతో మంత్రి జయరాంను చుట్టుముట్టారు. కైరుప్పలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడాలేదని గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇలా ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవడం జయరాంకు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో మహిళలు తమకు అమ్మఒడి లేకపోయినా ఫర్వాలేదని, రోడ్లు వేయించాలని మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరో గ్రామంలో మహిళలు ఏకంగా మహిళలే ఖాళీ బిందెలతో చుట్టుముట్టడం ప్రస్తావనార్హం.

LEAVE A RESPONSE