శక్తి స్వరూపిణి ప్రకృతి మూర్తియైన స్త్రీ – వివిధ పాత్రలు – ధర్మాలు శక్తి స్వరూపిని, ప్రక ఒక స్త్రీని పరిశీలిస్తే…….
కుమార్తెగా:తల్లిదండ్రులకు, ఆనందాన్నిస్తూ, వారు చెప్పిన మాటలు వింటూ,
విద్యాబుద్ధులను ,పతివ్రత తల్లుల జీవిత చరిత్రలను చక్కగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.
అలా కాని పక్షంలో కన్నవారికి ఆమెకు కూడా అశాంతి కలుగుతుంది.
యువతిగా:స్త్రీకి ఇది అత్యంత కష్టమైన పాత్ర, ఎందుకంటే వయసు ప్రభావం చేత, పరిసరాల ప్రభావం చేత, చెడ్డ స్నేహితుల ప్రభావం చేత, టి.వి., పత్రికల వంటి మీడియా ప్రభావం చేత ప్రలోభాలకు లోనై మోసపోయి, ప్రాణప్రదంగా భావించే శీలాన్షి కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక ఈ వయసులో తల్లి సలహాలు తీసుకుంటూ, తల్లితో స్నేహంగా ఉంటూ, ప్రతి కష్టాన్ని సుఖాన్ని ఆమెతో చెప్పకుంటూ, ఏ చిన్న తప్పు చేసినా అది తన క్యారెక్టరుకు కుటుంబ గౌరవానికి చెడ్డపేరు వస్తుంది కనుక ఎవరికి, ఏవిషయంలోనూ చనువు” ఇవ్వకుండా అత్యంత జాగ్రత్తతో పవిత్రంగా గడపవలసిన అవసరం ఉంది. లేనిచో అందరికీ అశాంతే !
భార్యగా:స్త్రీ తన తల్లిదండ్రులకు, తోబుట్టిన వాళ్లకు, ఆనందాన్షి ప్రేమను పంచి, వారి నుండి వేరై మరొక వంశానికి క్షేత్రంగా వెళ్లి, భార్య పాత్రను పోషించడం కత్తి మీద సాము లాంటిది. ధర్మపత్నికి గల లక్షణాలు … కారేషు దాసి (పనిచేయడంలో దాసి లా అహంకారం లేకుండా ఉండాలి) కరణేషు మంత్రి (అవసరమైనపుడు మంత్రిలా మంచి సలహాలను ఇవ్వాలి భోజ్యేషు మాతా (భోజనం పెట్టేటపుడు తల్లిని మరిపించాలి) ధైర్యేషు దుర్గ (తనను తాను రక్షించుకోవడంలోనూ, కుటుంబానికి కష్టం వచ్చినపుడు భర్తకు ధైర్యం చెప్పడంలోనూ దుర్గాదేవిలా ఉండాలి)
రూపే చాలక్షి( ఉన్నంతలో పరిశుభ్రంగా ఉంటూ చిరునవ్వుతో ఉండటం)
క్షమయా ధరిత్రి( ఓర్పు సహనం లో భూదేవి అలా ఉండాలి)
ధర్మం భారతీయ ఆత్మ ధార్మిక జీవనం భారతీయుల జీవన విధానం
“సంతుష్టా భార్యయా భర్త, భర్తా భార్య తథైవచ ”
” యశినేవ తులేనిత్యం, కళ్యాణం రత్రవైధ్రువమ్ ”
గృహంలో భార్య వలన భర్త, భర్త వలన భార్య శాంతిగా ఉండే సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. కనుక భార్యగా భర్త హృదయంలో పవిత్ర స్థానాగ్ని సంపాదిన తల్లిదండ్రులుగా సేవిస్తూ, మిగిలిన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ఉంటూ ఉత్తమ సంతానాన్ని కనాలనే ఆసక్తితో ఆదర్శ జీవనం గడపడం, భారతీయ , సీతా, సావిత్రి, అనసూయ, అరుంధతీ వంటి మహా పతివ్రతలే మనకు.. సమాజంలో స్త్రీ ఇలా ఆదర్శ జీవనం గడపడం బానిసత్వంగా భావించబడుతుంది ఎన్నటికీ కాదు. కుటుంబానికి స్త్రీయే కేంద్ర బిందువు. స్త్రీ యందు జనం పాతివ్రతం, ఆధ్యాత్మిక చింతన వలన తన కుటుంబం సుఖసంతోషాలతో, సిరి సంపదలతో తులతూగుతుంది. తన సంతానాన్ని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత ప్రాముఖ్యత కల్గి వుంది.
“బెట్టి ఫ్రెడన అనే అమెరికా మహిళ “ది ఫెమినైన్ మిస్టిక్” అనే పుస్తకం ద్వారా మహిళలు తమ బంధాలను తెంచివేసి, వ్యక్తిగత అస్తిత్వం మరియు స్వతంత్రత పొందాలని అమెరికా మహిళలకు పిలుపునిచ్చారు. దాని ఫలితంగా ఒక 20 సంII మహిళా ఉద్యమ తీవ్రంగా నడిచింది. తరువాత ఆమె “ది సెకండ్ స్టేజ్” రాశారు. దానిలో ఈమె ఇక వాస్తవాలు వెల్లడించారు.
1. మగవారితో సంబంధం లేకుండా మహిళలు స్వతంత్ర కాలేరు
2. పురుషులకు కానీ, స్త్రీలకు కానీ ప్రత్యేక స్వతంత్రం అనేది లేదు. రెండో నిజo మన స్త్రీలు స్వతంత్రంగా పురోగమించగలరని అనుకుంటున్నాం కానీ ఈ 20′ సం”ల పోరాటం పరిశీలనలో అది అసాధ్యమని తోస్తునది. చాలామంది మహిళలు తాము గృహాల నుండి ఎండి విముక్తి పొంది కార్యాలయాలకు వెళ్లినా నిజమైన స్వాతంత్ర్యం పొందలేదని నిరాశను వ్యక్తం చేశారు చేశారని తెలిపారు . ఆమె కనుగొన మూడవ నిజం ఏమిటంటే కుటుంబ సఖ్యత వలన స్త్రీ పురుషులు ఇద్దరూ నిజమైన ఆనందాన్ని జీవిత సార్థకతను పొందుతారని ఆమె 20 సంవత్సరాలుగా చాలా కుటుంబాలు బాధలు అనుభవించాయని, విడాకులు పెరిగాయని వారి పిల్ల
అష్ట కష్టాలు పడ్డారని తద్వారా మన సంఘం ఎన్నో కష్టాలను తన పుస్తకంలో వెలిబుచ్చారు.అయితే మన భారతీయ సంస్కృతి ఆనాడే గుర్తించిన విషయం ఈ భూగోళం కలు నిజంగా స్వతంత్రులు కారనీ, ఒకరిపై ఒకరు ఆధారపడడం వల్ల ఇరువురికి పరిపూర్ణ తత్వం మరియు ఆనందం కలుగుతుందని, దానిని బట్టి మనం గమనించవలసి ఉదటంటే కుటుంబ వ్యవస్థకు భార్యాభర్తలు ఇద్దరూ అత్యంత ప్రాముఖ్యత కల్గినవారే, విద్యపరంగా, విజ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా ఇద్దరూ సమానంగా ఉన్నతి కావలసిందే ఎందుకంటే వివేకానంద స్వామి చెప్పినట్లు “పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు ఎలా అవసరమో, ఒక జాతి అభివృద్ధి చెందాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ జ్ఞానవంతు కావాలి. కనుక ఈ విషయాలను గమనించకుండా వింత పోకడలకు , ప్రయత్నిస్తే భార్యాభర్తలిద్దరికీ మనఃశ్శాంతి కరువు అగును. తద్వారా వారి బిడ్డలు నిరాశ నిస్త్ర ఆందోళన, భయాలతో పెరగవలసి ఉంటుంది. కనుక గమనించ ప్రార్థన.
తల్లిగా:ఒక తల్లిగా ముఖ్యంగా భారతీయ స్త్రీ పోషించేటి పాత్ర అమూల్యమైనటువం ఎందుకంటే బ్రిటీషు వాళ్లు మనల్ని శారీరకంగా వశపరచుకోగలిగారు కానీ, మానసి జయించలేకపోయామని బాధపడి “మెకాలే” అనే విద్యావేత్తతో భారతదేశం అంతా చేయించారు. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే భారతీయులు ఈ ప్రపంచ అత్యంత బలమైన కుటుంబ వ్యవస్థను కల్గివున్నారని, అత్యున్నతమైన నైతిక విలువలు పాటిస్తున్నారని ఆధ్యాత్మికత వారి జీవనాడి అని విద్యావ్యవస్థ అత్యద్భుతమని.
వీరి వ్యవహారాలు కట్టుబొట్టు చాలా శాస్త్రీయమైనవని కనుక వాటిని నాశనం చేస్తే మనకు మానసికంగా లొంగుతారని నివేదిక ఇచ్చాడు. ఆ నివేదిక ఆధారంగా వారు భారతీయులు ఇంత నైతిక విలువలు కలిగి ఉండటానికి వారి చిన్నతనం నుండి తల్లులు పురాణ ఇతిహాస కథలు గొప్ప వారి చరిత్రలు ఉగ్గుపాలతోనే నేర్పిస్తున్నారు అని కనుక వారి కుటుంబం నుండి బయటకు తీసుకు వస్తే వారి బిడ్డలకు మంచి చెడులు నేర్పే సమయము తగ్గుతుంది కనుక రాబోయే తరాలకు నైతిక విలువలు తగ్గించాలని ప్రణాళిక రచించారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే.
కనుక నేటి సమాజంలో తల్లులు తమ కుటుంబాలను ఆర్థికంగా ఉన్నతి పొందాలనే తపనతో తమ కన్నబిడ్డలను మంచి వారిగా , ఉన్నతునిగా తీర్చిదిద్దే లేక పోతున్నామని బాధను అనుభవిస్తూనే చాలామంది బాహ్య ప్రపంచంలోకి వెళ్ళవలసి వస్తుంది . (ఉద్యోగ, వ్యాపారాల రీత్యా) మానసిక అశాంతికి గురవుతారు. తద్వారా, కనుక స్త్రీ ఎంతైనా జ్ఞానం సంపాదించవచ్చు. అవసరమైతేనే దాన్ని సంపాద నకు తప్ప లేకపోతే ఆ జ్ఞానా న్ని తమ బిడ్డలకు పంచి గొప్ప వారిగా తీర్చిదిద్దితే మరో ,గాంధీ,శివాజీ, వివేకానంద, ఝాన్సీరాణి, సరోజినీ నాయుడు వంటి మహాతుమ్మల ను తయారుచేయవచ్చు. అందుచే సమాజాభివృద్ధి నైతికత అనేది తల్లి యొక్క ప్రధాన బాధ్యతాయుత పాత్రపైనే ఎక్కువ ఆధారపడి ఉంది.
కనుక తల్లులందరికి నమస్కరిస్తూ తెలిపే విషయం ఏమిటంటే “తమ బిడ్డలను నీతివంతులుగా తయారుచేయమని, కనీసం దుర్మారులుగా కాకుండా చూడమని ప్రార్థన”. స్త్రీ, అత్తగారుగా, తమ కోడలిని బిడ్డలా చూడగల్గితే ఇంక ఆ కుటుంబంలో మనశ్శాంతిగా జీవిస్తారనేది జగమెరిగిన సత్యం. కనుక గమనించ ప్రార్థన అలాగే ఒక మామ్మగా, బామ్మగా, బిడ్డలకు అవసరమైన సలహాలనిస్తూ జపతపాలతో, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించి అలాంటి మహోన్నత భావాల వలన వారు ఛాదస్తులుగా, తమ బిడ్డలతో అవమాని బడకుండా ఉండగలుగుతారు. మనశ్శాంతిగా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు.” భారతీయ సంస్కృతి వర్ధిల్లాలి”
– Dr.M Ashok VardhanReddy
MD(AM)
N.L.P BasicPractitioner
Life skills Coach
Impact certified motivational trainer
Secunderabad
8500204522