Suryaa.co.in

Features

అను’వేదం’..!

అనువాదమంటే
అక్కడ ఉన్నది ఉన్నట్టు
నీ భాషలో రాయడం..
అంతే కాని
నీ వాదం..పిడివాదం..
కొంపలు ముంచే
మనువాదం కాదోయ్..!

తర్జుమా..
ఇది అనువాదమా..
భావం దెబ్బతింటే..
భాష గతి తప్పితే..
రాముని తోక..
పివరుండిట్లనియె..
ఇలా చేస్తే భాష ఖూనీ..
పనికిరాని బాతాఖానీ..
అదే…అదే..
అనువాదం కీ లంబీ క’హానీ’!

విదేశీ పర్యటనల్లో
నేతలకు భాష సమస్య…
మోడీకి పుతిన్ మిత్రుడే..
కలిసే ఇద్దరి
బాడీ లాంగ్వేజ్…
అర్థం కాని రష్యన్ లాంగ్వేజ్..
అప్పుడు తప్పని దుబాసీ..
మోడీ మాట పుతిన్ కి..
పుతిన్ బాట మోడీకి
వివరించే అనువాదకుడు..
ఆ సమయానికి
అసలైన ప్రబోధకుడు..!

ఇంతకీ..
ఏమిటీ అనువాద దినం..
బైబిల్ ను అనువదించిన
సెయింట్ జిరోమ్
గౌరవార్థం ఈ దినం..
ఆయనకో వందనం..!

నీ రచనలు గొప్పవే
అవి నీ భాషలోనే ఉండిపోతే
నువ్వు నూతిలో కప్పవే..
నిన్ను ప్రపంచానికి
పరిచయం చేసేది అనువాదం..
అలాంటి అనువాదం జరిగినప్పుడే
గెలుస్తుంది నీ వాదం…!
నిజమైన అనువాదం
నీ వాదాన్ని
మరో భాషలో
వినిపించే వేదం..!

*ఒక కుండలో నీటిని
మరో కుండలోకి
ఒక్క చుక్క కూడా
కింద ఒలక్కుండా తోడడం
ఎంత కష్టమో
ఒక భాషలోని విషయాన్ని
మరో భాషలోకి అనువదించడం
అంతే కష్టం..!

ఒక్క అనువాదం
వెయ్యి ఫజిల్స్
పూర్తి చెయ్యడం కంటే క్లిష్టం..

భావం చెడిపోకుండా
అందంగా మార్చడమే తర్జుమా..ఇది నిక్కము సుమా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE