గుంటూరు డిసెంబర్ 5: ప్రముఖ రచయిత , గుంటూరు మున్సిపాలిటీ విశ్రాంత మేనేజర్ జొన్నలగడ్డ చిరంజీవి శాస్త్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గుంటూరు, నెల్లూరు మంగళగిరి, జగ్గయ్యపేట, అనకాపల్లి, నరసరావుపేట మునిసిపాలిటీలలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆయనకు నలుగురు పిల్లలు. ముగ్గురు మగపిల్లలు ,ఒకరు ఆడపిల్ల ఉన్నారు. జొన్నలగడ్డ చిరంజీవి శాస్త్రి పార్థివ దేహానికి కొరిటపాడు లోని మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగులు , ఉద్యోగ సంఘ నేతలు , హీరో ప్రభాస్ మేనల్లుడు సత్యనారాయణ మూర్తి, మేనేజర్ రామకృష్ణ , కన్నా విద్యాసంస్థల చైర్మన్ కన్నా మాస్టారు, మునిసిపల్ ఉద్యోగ సంఘాలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి శాస్త్రి ఆత్మ శాంతించాలని ప్రార్ధించారు.