Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ అభ్యర్ధులను రెడ్లతో నింపేశారు

– వైసీపీ అభ్యర్ధుల లిస్ట్‌లో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం
– స్థానాలన్నీ రెడ్డి సామాజికవర్గానికి కేటాయించి బీసీలకు ద్రోహం చేశాడు
– మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి
– జగన్ రెడ్డి భజన చేస్తున్న అధికారులు ఇకనైనా పద్ధతి మార్చుకోండి
టెయింటెడ్ అధికారులు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– ఆనం వెంకట రమణారెడ్డి

వైసీపీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బడుగు బలహీన వర్గాల గొంతునొక్కి సొంత వర్గానికి కొమ్ముకాశాడని మాజీ ఎమ్మెల్సీ జి.దీపక్ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాయలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ…

“నియంత పాలన, పెట్టుబడి విధానం, దోపిడి వ్యవస్థ అంతం కావాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు, రాష్ట్రం నుంచే తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటే జగన్ రెడ్డి మాత్రం దేశం నుంచే వదిల వెళ్ళిపోవడానికి ప్రణాళికలు చేసుకున్నాడు. ఎక్కడో ఐల్యాండ్ కొన్నట్లు సమాచారం వస్తుంది.ఈ రోజు నుంచి సైకో బ్యాచ్‌ రోజులు, గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకోండి” అని హెచ్చరించారు.

రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీలకు అన్యాయం చేశాడు
“వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి నుంచే ఈ రోజు సామాజిక ద్రోహం చేశారు. నేడు ప్రకటించిన 175 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 81 స్థానాల్లో అభ్యర్ధులను మార్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ దీర్ఘాలు తీసే ముఖ్యమంత్రి వారికే అన్యాయం చేశాడు. మార్చిన 81 స్థానాల్లో కేవలం 9 చోట్ల(10%) మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారిని మార్చారు. కానీ బడుగు బలహీన వర్గాలకి 90% స్థానాలు మార్చారు. 175లో 50% స్థానాలకు మార్పులు చేశారు అంటే ప్రజల్లో వారి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

52% ఉండే బీసీలకు దామాషా ప్రకారం 91 స్థానాలు రావాలి. కానీ కేవలం 41 స్థానాలు కేటాయించి న్యాయం చేశమనడం ఎలా? 139 బీసీ కులాలు ఉంటే కేవలం 18 ఉపకులాలకే ప్రధాన్యత కల్పించారు. కాకినాడ, ఏలూరు, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, కడప, నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్‌లో ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి కేటాయించకుండా సామాజిక న్యాయం చేశామంటున్నారు. ఇదేనా సామాజిక న్యాయమంటే జగన్ రెడ్డి? నేడు వైసీపీ ప్రకటించిన లిస్ట్‌లో 139 జనరల్ స్థానాల్లో నుంచి 49 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. 35.25% ఒకే సామాజిక వర్గానికి కేటాయించి బీసీలకు అన్యాయం చేశురు” అని అన్నారు.

కేసీఆర్, జగన్ రెడ్డి సీక్రెట్ సమావేశం అంతర్యం ఇదే…
“హైదరాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ కలిసి తలుపులు మూసుకొని మరి మాట్లాడుకున్నారు. మన ఇష్టానుసారం చేశాము, ఎవ్వరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, కావాల్సిన విధంగా మనం దోచుకున్నాము, సామాన్యులను కలిసిన దాఖలు లేవు, సెక్రటేరియట్ కు పోయిందే లేదు, ప్యాలెస్‌లోనే ఉన్నాము, మీ పరిస్థితే నాకు పడుతుందేమో అని నాకు భయంగా ఉంది, ఇప్పుడు మీరు ఏ విధంగా టైమ్ పాస్ చేస్తున్నారని కేసీఆర్‌ను జగన్ రెడ్డి అడిగాడు. నాకు పట్టిన గతే నీకు పడుతది, కానీ నువ్వు చేసిన అరాచకాలకు నిన్ను వదిలిపెట్టరు ఆలోచించుకో అని కేసీఆర్ జగన్‌తో చెప్పాడు. అందుకే జగన్ రెడ్డి ఇంగ్లాండ్ దగ్గర ఐల్యాండ్ కొన్నట్లు నాకు అనుమానంగా ఉంది. మూడు పార్టీల ఉమ్మడి సభలో అధినేతలు దిశా నిర్దేశం చేయబోతున్నారు. ఈ అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి” అని తెలియజేశారు.

ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ…
“ఎన్నికల కోడ్ రావడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భయపడుతున్నారు. జగన్ రెడ్డి భజన చేస్తున్న, తప్పులు చేస్తున్న, జగన్ రెడ్డి చెప్పులు మోస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హెచ్చరిస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఒక వేళ ఇక్కడ చంద్రబాబు వస్తే కేంద్రానికి వెళ్ళవచ్చులే అనే అలోచన ఉంటే మానుకోండి. ఢిల్లీలో కూడా వచ్చేది మా ప్రభుత్వమే. మా ఉమ్మడి పార్టీలే ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది. మీరు ఏ దిక్కు చూసిన ఎన్డీఏనే ఉంటుంది. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే తీవ్రమైన చర్యలు ఉండబోతున్నాయి” హెచ్చరించారు.

ఊర్లో ఉన్న పనికి మాలిన రెడ్లను తీసుకువచ్చి జగన్ రెడ్డి డిప్యుటేషన్ ఇచ్చాడు…
“శ్రీరాముడుపై ఆంజనేయుడికి ఉన్న భక్తి కంటే జగన్ రెడ్డిపై కొంతమంది రెడ్లకు భక్తి ఎక్కువ. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఏందో, దాంట్లో కొల్లు రఘురాంరెడ్డిని ఎందుకు వేశారో తెలియదు. దానిని అడ్డుపెట్టుకొని ప్రతీ నాయకుడిని, వ్యాపారస్థులను ఇబ్బంది పెడుతున్నాడు. మైనింగ్ డీజీ వెంకట్ రెడ్డి జాగ్రత్తగా ఉండు! తప్పించుకుంటావ్ అనే ఆలోచన మానేయ్. అప్పులు ఆపేసేయ్. ఇక అప్పులు తీసుకురావడానికి లేదు. అక్రమ మైనింగ్‌లు ఆపేయ్. మా ప్రభుత్వం రాగాల్నే నిన్ను జైలుకు పంపిస్తాం. వెంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను దొంగల అమ్మకాలు చేస్తున్న తిరుమల ఈవో ధర్మారెడ్డి! వాటిని నిలిపేయ్.

పేపర్‌లో జగన్ రెడ్డి బొమ్మలు వేయడం ఆపేయ్ ఐ&పీఆర్ విజయ్ కుమార్ రెడ్డి. లేదంటే అదే పేపర్‌లో నీ బొమ్మ వేయాల్సివస్తది. వాసుదేవ రెడ్డి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ను దివాళ తీశాడు. మధుసూదన్ రెడ్డి కాలర పట్టుకొని, భయపెట్టించి ఒక్క రోజు కూడా ఆడని వ్యూహం సినిమాని ఆందులో వేస్తున్నారు. జగన రెడ్డి ఫోన్ చేసి ఎవరు పేరు చెబితే వారికి వేల ఎకరాలు పంపిచడం ఏపీఐఎస్సీ దీవన్ రెడ్డి పని. భూములు తాకట్టు పెట్టి అప్పులు చేయడం మానేయ్. ఎస్పీ రెడ్డిని ఇక జాగ్రత్తగా ఉండు…. ఎన్‌ఆర్ఇడీపీ క్యాప్ ఎనర్జీ ఇండోసోల్ కంపెనీకి ఇష్టమొచ్చినట్లు భూములు ఇవ్వొద్దు. ఇక సైన్ లు చేయడం ఆపేయాలి. అలా చేస్తే జైల్‌కు వెళ్లక తప్పదు. జగన్‌కు భజన చేసే బ్యాచ్‌లో ఎస్పీ రిషాంత్ రెడ్డి ఒకరు. ఈయన జగన్ అడుగులకు మడుగులొత్తేందుకు వెరీ హానెస్ట్ పర్సన్. గతంలో రిషాంత్ రెడ్డి మా కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెట్టారు.

టీడీపీ నాయకులు అనేక మందిపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు. కోడ్ వచ్చింది కావున ఇక మీ అవినీతి పనులు ఆపాలి. ఐపీఎస్ సంజయ్ పరిస్థితి కూడా అలానే ఉంటుందని గ్రహించాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అధికారం చేపట్టే ముందు అందరినీ ఒకేలాగ చూస్తామని ప్రమాణం చేసి.. ఇలా చేయడం సబబేనా? ఎపీపీఎస్సీ సీతారామాంజనేయులు మొన్న గ్రూప్-1 లో జరిగిన అవకతవకల్లో సూత్రధారుడు, పాత్రధారుడు. వేలాది మంది రాసిన ఎగ్జామ్‌లో అనేకమందికి అన్యాయం చేసి వారి భవిష్యత్తును నాశనం చేశాడు.

శాండ్ అండ్ మైన్స్‌కు చెందిన గోపాలకృష్ణ ఇప్పటి వరకు అమ్మిన ఇసుక దందాను ఇక మీదట ఆపుకోవి. మైన్స్‌లో మీరు దోచుకున్న మినరల్స్‌కు ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటికైనా జగన్‌కు వారం వారం కట్టే కప్పాన్ని ఆపేయాలి. తాడేపల్లి ప్యాలెస్‌కు కట్టలు కట్టలు డబ్బులు పంపడం ఆపాలి. జగన్ మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీలు అంటారు.. మరి డెప్యూటేషన్ లో తీసుకొచ్చిన ఆఫీసర్స్ లో ఒక్క బీసీ కూడా జగన్ కు కనపడలేదా?” అని ప్రశ్నించారు.

లోకేష్‌తో సవాల్ చేసే స్థాయి అనిల్ కుమార్ యాదవ్‌కు లేదు….
“లోకేష్ చర్చకు సిద్ధమా అని అనిల్ సవాల్ విసిరారు. లోకేష్ పై సవాల్ విసిరే స్థాయి అనిల్ కుమార్ యాదవ్‌కు లేదు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోవాలి. లోకేష్.. లోకేష్ అని గట్టిగా అరవడమేంటి? నీవు కోన్.. కిస్కా గొట్టం గాడివి., మా నాయకుడిని చర్చకు పిలిచేటంతటివాడివా? నారా లోకేష్ పై విసిరిన ఛాలెంజ్‌కి నేనొస్తాను, నాతో చర్చకు సిద్ధమా? సంసిద్ధమా?” అని సవాల్ విసిరారు.

ఆర్కె రోజాకు టిక్కెట్ ఇచ్చినందుకు జగన్‌కు ధన్యవాదాలు….
“రోజాకు టికెట్ ఇవ్వకపోతే జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానని గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నా మాటకు విలువిచ్చి రోజాకు టికెట్ ఇచ్చినందుకు జగన్ రెడ్డికి ధన్యవాదాలు. రోజాను చిత్తు చిత్తుగా ఓడించడానికి నగరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి అదృష్టవంతుడు. నగిరిలో 50 వేల మెజార్టీతో తప్పక గెలుస్తాడు” అని జోస్యం చెప్పారు

LEAVE A RESPONSE