– కర్నూలు జిల్లాలో కూర్మగిరి మాదన్న హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం
– దసరా నాడు దుర్గమ్మపై ఒట్టేసి చెబుతున్నాం మా కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన ఏ ఒక్కరిని వదలం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ కార్యకర్తలు కనీస మానవత్వాన్ని మరచి ప్రజలపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. పండుగపూట టీడీపీ బీసీ కార్యకర్త కూర్మగిరి పెదమాదన్నను వైసీపీ గూండాలు బలితీసుకున్నారు. కర్నూలు జిల్లా, బోయబొంతిరాళ్లలో కూర్మగిరి పెద్ద మాదన్నతో పాటు కుటుంబ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి చేసి మాదన్నను హత్య చేశారు. వైసీపీ గూండాలు 365 రోజుల పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతూనే ఉన్నారు. కనీసం పండుగ నాడు కూడా సుఖంగా ఉండనివ్వరా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విర్రవీగే వైసీపీ బ్యాచ్ గుర్తుంచుకోవాలి. దసర నాడు దుర్గమ్మపై ఒట్టేసి చెబుతున్నాం మా కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన ఏ ఒక్కరిని వదలం.