Suryaa.co.in

Andhra Pradesh

తండ్రి బాటలోనే వడ్డెరలను జగన్ దారుణంగా వంచించాడు

– రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీఛైర్మన్ దేవళ్ళ మురళి
బీసీల్లోని కులచేతివృత్తిదారులకు న్యాయంచేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కల్లబొల్లిమాటలుచెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు బీసీలను విభజించి పాలిస్తున్నాడని, బీసీసోదరుల్లో కేవలం నాయీబ్రాహ్మణులు, రజకులకుమాత్రమే అరకొర సాయంచేస్తూ, వడ్డెరలు, ఇతరబీసీకులాలను విస్మరించాడని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవెళ్లమురళి ఆగ్రహంవ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వడ్డెరలతో పాటు, మేదర, బుడగలు, బుడగ జంగాలు, కుమ్మరలు వంటి బీసీకులాలవారిని ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు.
జగన్మోహన్ రెడ్డి చెబుతున్న బీసీలసంక్షేమం కేవలం పత్రికలు, ప్రచారఆర్భాటాలకే పరిమితమైందన్నారు. బీసీల్లో 139కులాలుంటే, కేవలం 56 కులాలకు మాత్రమే ఎందుకూపనికిరాని కార్పోరేషన్లను ఏర్పాటుచేసి, అన్నికులాలను దారుణంగా వంచిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి కాకముందు అన్నికులాలవారివద్దకువెళ్లి, వారికి కల్లబొల్లిమాటలుచెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు ఆయావర్గాల గురించి ఎందుకుపట్టించుకోవడంలేదని మురళి నిలదీశారు.
టీడీపీప్రభుత్వం వడ్డెరకార్పొరేషన్ ఏర్పాటుచేసి, దానికి రూ.132కోట్ల నిధులుకేటాయించిందన్నారు. వడ్డెర, రజక, నాయీబ్రాహ్మణ, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, యాదవ, కుమ్మర, కమ్మరి, వీరక్షత్రియ కులాలకు చంద్రబాబునాయుడు కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిధులు కేటాయించాడన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీల్లో అట్టడుగునఉన్న అనేకవర్గాలవారిని విస్మరించి, వారికి న్యాయంగా దక్కాల్సిననిధులను కూడా స్వాహాచేస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రికి బీసీలంటే చిన్నచూపని, కాబట్టే వారికోసం ఉత్తుత్తి కార్పొరేషన్లు ఏర్పాటుచేశాడన్నారు. బీసీశాఖా మంత్రిగాఉన్న వ్యక్తి బీసీలగురించి, వారిసంక్షేమం గురించి ముఖ్యమంత్రితో ఎందుకు చర్చించడంలేదని మురళి నిలదీశారు.
బీసీలతో పాటు, ఎస్సీలు,ఎస్టీలు, మైనారిటీలు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు అందరికీ టీడీపీప్రభుత్వం సమన్యాయంచేసి, అన్నివర్గాలవారిని ఆదుకుందన్నారు. బీసీలకు పెద్దపీటవేసినఘనత, వారి అభ్యున్నతి, అభివృద్ధికి అండగా నిలిచింది, నిలిచేది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని, అలాంటి పార్టీ అండదండా బీసీలకుఉండాలంటే వారంతా మూకుమ్మడిగా వచ్చేఎన్నికల్లో చంద్రబాబుకు మద్ధతివ్వాలని మురళి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త ఇసుకపాలసీ ముఖ్యంగా బీసీలనే దెబ్బతీసిందన్నారు. పనిలేక, జీవనంకష్టమై బీసీలు పూటగడవక నానా అగచాట్లు పడుతుంటే, వారికి పట్టెడన్నం పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వముందన్నారు.
ప్రతిపక్షపార్టీలను దూషించేవారికి, బూతులుతిట్టేవారికే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులిస్తున్నాడు తప్ప, బీసీలను,ఇతరవర్గాలను బాగుచేసేవాళ్ల కు కాదన్నారు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చడానికి టీడీపీప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసిందన్నారు. వడ్డెరలను ఎస్టీల్లోచేర్చడానికి సత్యపాల్ కమిటీ వేసిన చంద్రబాబునాయుడు, ఆదిశగా అడుగు ముందుకువేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిఊసే ఎత్తడంలేదన్నారు. బీసీలకుఇచ్చిన హామీలను నిలబెట్టేవరకు జగన్మోహన్ రెడ్డిని వదిలేదిలేదని, వైసీపీప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీసీలు ఎవరూ విస్మరించరన్నారు.
జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగతరాజశేఖర్ రెడ్డి గతంలో వడ్డెరలను ఆదుకుంటానని 2004లో హామీ ఇచ్చాడని, తాను వడ్డెరలవద్దనే విద్యాభ్యాసం చేశాననిచెప్పి, వడ్డెరఫెడరేషన్ఏర్పాటుచేసి దానికి రూ.500కోట్లు ఇస్తానని నమ్మించి, ఆయావర్గాన్ని దారుణంగా వంచించాడన్నారు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాకే వడ్డెరఫెడరేషన్ ఏర్పాటుచేసి, దానికి పాలకమండలితో పాటు, 132కోట్ల నిధులుఇచ్చాడన్నారు. బీసీల్లో చేతి,కులవృత్తి దారులైన ప్రతి కులంలోని వారికి జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం రూ.లక్షవరకు ఆర్థికసాయంచేయాలని మురళీ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE