-వీరమ్మకుంటలో ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం
– సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుండి పారిపోవడం ఖాయం
– ధూళిపాళ్ళ నరేంద్ర
ఓటమి భయంతో పంచాయతీల ఉపఎన్నికల్లోనూ వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ సైకోల దాడి జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. నాలుగేళ్లు గడిచినా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీరు మారడం లేదు.
ఎమ్మెల్యే అండ చూసుకుని రెచ్చిపోయే వైసీపీ కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నాను. సార్వత్రిక ఎన్నికలయ్యాక అబ్బయ్య చౌదరి దెందులూరు వదిలి పారిపోతాడు. అప్పుడు మీ గతి ఏంటో ఆలోచించుకోండి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వీరమ్మకుంట గ్రామంలోకి ఎందుకు అనుమతించరు? వైసీపీ నేతలకు ఉన్న స్వేచ్ఛ, సమానత్వం టీడీపీ వారికి ఉండవా? పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదు.
పాకాల, హిందూపురం సహా పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దేనికి సంకేతం? వీరమ్మకుంట సర్పంచ్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వైసీపీ రౌడీ మూకపై కేసులు నమోదు చేయాలి.