Suryaa.co.in

Andhra Pradesh

మద్యం ప్రధాన చట్టానికి సవరణపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్

అమరావతి: మద్యం ప్రధాన చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021, 2022లో తీసుకొచ్చిన యాక్ట్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.స్పెషల్ మార్జిన్ మనీని ఆదాయంగా చూపి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ .. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలన్నారు.

మద్యం ప్రధాన చట్టానికి సవరణలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 2021, 2022లో తీసుకొచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం రుణం పొందడంలో ఇప్పటికే నిర్ధిష్ట పరిధిని దాటిపోయిందని, చట్ట నిబంధనలను అధిగమించి ఇంకా రుణం పొందడం కోసమే చట్ట సవరణలు చేశారన్నారు.

స్పెషల్ మార్జిన్ మనీని ఆదాయంగా చూపి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ .. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలన్నారు. ఈమేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెండు చట్టాలను రద్దు చేయాలని పిటీషన్లో కోరారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టాల్ని రద్దు చేయాలని కోరారు.

ఆ చట్టాల అమలును నిలుపుదల చేయడంతో పాటు స్పెషల్ మార్జిన్ మనీని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందకుండా నియంత్రించాలని కోరారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆర్బీఐ గవర్నర్, హైదరాబాద్ ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయ డైరెక్టర్, కాగ్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ, న్యాయ శాఖ కార్యదర్శులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

LEAVE A RESPONSE