Suryaa.co.in

Andhra Pradesh

తేజస్విని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు తెలుస్తోంది.

తన కుమార్తె మరణంపై తేజస్విని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నది. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చుమీరుతున్నాయి. పాలన చేతకాక, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కంట్రోల్ చేయలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై అపవాదులు వేయటం తగదు. రాష్ట్ర హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా, మహిళలపై జరుగుతున్న దురాగతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తగదు.

ఒకపక్క మద్యం మత్తులో ఘోరాలు జరుగుతున్నాయని మంత్రులు చెబుతూనే, మరోపక్క ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. నిందితుడు సాధిక్ బాషాను తక్షణమే అరెస్టు చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.

LEAVE A RESPONSE