Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ఎంపీలు చిల్లర రౌడీల్లా వ్యహరిస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారు

– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్

వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో చిల్లర రౌడీల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఇవాళ పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి వ్యవరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టకే మాయని మచ్చ. బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై పరుష పదజాలం ఉపయోగిస్తూ…మిధున్ రెడ్డి దురుసుగా ప్రవర్తించటం సరికాదు.

సీఎం జగన్ మాదిరి వైసీపీ ఎంపీలు కూడా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు చేసే పార్లమెంట్ లో మిధున్ రెడ్డి చిల్లర రౌడీ మాదిరి వ్యవహరించారు. వైసీపీ ఎంపీలకు చేతనైనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరాడాలి అంతే తప్ప చిల్లర రౌడీల్లా వ్యవహరించి రాష్ట్ర ప్రతిష్ట మంటగలపొద్దు. పార్లమెంట్ నిభంధనలు ఉల్లంఘించి సాటి ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మిధున్ రెడ్డిపై స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE