Home » బాబును ఓడించడం వైసిపి తరం కాదు

బాబును ఓడించడం వైసిపి తరం కాదు

* ఎనిమిదవ సారి గెలుపు ఖాయం
* సిఎం పదవి చేపట్టడం తథ్యం
– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా

చిత్తూరు, మే 22 : కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసిపి నేతల తరం కాదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ఆ మేరకు ఆయన చిత్తూరులో మీడియాకు వీడియో విడుదల చేసారు. కొంత మంది చంద్రబాబు ఓడిపోతారు అంటూ గ్లోబెల్ ప్రచారం చేసి సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఏడు సార్లు వరుసగా గెలిచిన బాబు ఎనిమిదవ సారి గెలిచి రికార్డు నెల కొల్పుతారని చెప్పారు. తిరిగి సిఎం పదవి చేపట్టి రాష్ట్రంలో స్వర్ణ సృష్టితారని జోస్యం చెప్పారు.

ఆయన రాజకీయ ట్రాక్ రికార్డు చూస్తే ఇది అర్థం అవుతుందని వివరించారు. చంద్రబాబు 1989లో తొలి సారిగా కుప్పం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 6,918 ఓట్ల మెజారిటీ సాధించారని తెలిపారు.1994 ఎన్నికల్లో 56,888 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారని అన్నారు. అలాగే 1999 లో 65,687 ఓట్లు, 2004లో 59,588 ఓట్లు, 2009 లో 46,066 ఓట్లు,2014 లో 47,121 ఓట్లు, 2019లో 30722 ఓట్ల మెజారిటీ సాధించారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి వారు పోలీసులను అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడి మెజారిటీ స్థానాలు తెచ్చుకున్నారని విమర్శించారు. అప్పటి వాపును చూసి వైసిపి నేతలు బలుపుని భ్రమ పడుతున్నారని హేళన చేశారు. రాష్ట్రంలో టిడిపి అత్యధిక మెజారిటీ సాధించి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెజారిటీ స్థానాలు వస్తాయని సుధాకర్ రెడ్డి చెప్పారు.

Leave a Reply