Home » పిన్నెల్లిపై కేసు నమోదు

పిన్నెల్లిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి గాయపడ్డ శేషగిరిరావు

మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ లో ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం లో ఈవిఎం ను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలిసులు కేసు నమోదు చేశారు ఈ నెల 13 న ఎమ్యెల్యే పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ నెంబరు 202 ను ధ్వంసం చేయగా అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎమ్యెల్యే ను నిలువరించే ప్రయత్నం చేశారు

పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన ఎమ్యెల్యే పిన్నెల్లి ని స్థానికులు ప్రశ్నించడం తో వారిని దూషిస్తూ ఎమ్యెల్యే అక్కడనుంచి వెళ్లిపోయాడు అనంతరం ఎమ్యెల్యే పిన్నెల్లి అనుచరులు శేషగిరిరావు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ముందుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదుచేసి పోలింగ్ బూత్ వెబ్ కెమెరా లో ఎమ్యెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసినట్లు నిర్దారణ కావడంతో పిన్నెల్లి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

గాయపడ్డ శేషగిరిరావు గుంటూరు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది,అనంతరం ఎమ్యెల్యే నుంచి ప్రాణ హాని ఉందని తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు ఎన్నికల రోజు టీడీపీ శ్రేణులపై దాడులు,కారంపూడి లో అల్లర్లు సృష్టించిన పిన్నెల్లి సోదరులు అరెస్ట్ భయంతో ఇప్పటికే మాచర్ల నియోజకవర్గాన్ని వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Leave a Reply