Home » మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని మహా మంచోడన్న జగన్

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని మహా మంచోడన్న జగన్

-సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న జగన్ కితాబు వీడియో
-ఇలాంటి మంచోడేనా ఈవీఎం పగులకొట్టిందంటూ సోషల్‌మీడియాలో చతుర్లాడుతున్న నెటిజన్లు
( అన్వేష్)

‘‘మాచర్ల నుంచి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు మంచి స్నేహితుడు. చాలా మంచివాడు. రామకృష్ణారెడ్డిని గెలిపించండి. మీ అందరికీ ఒకమాట చెబుతున్నా. ఇంకా పైస్థానానికి తీసుకువెళతా’’నని హామీ ఇచ్చిన, ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ పాత వీడియో ఇప్పుడు వైసీపీ దుంపతెంచుతోంది.

పోలింగ్‌బూత్‌లోకి చొరబడి, అక్కడి ఈవీఎంను నేలకేసికొట్టిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై, ఇప్పుడు లుక్‌అవుట్ నోటీసు జారీ అయింది. ఈసీ ఆదేశాల మేరకు ఆయనపై ఐపీసీ 448, పిపిడిఏ చట్టంలోని సెక్షన్ 3, ఐపిసీ 427, రెడ్‌విత్ 24 కింత 10 కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి చర్యను సిగ్గుమాలినతనంగా ఈసీ పేర్కొందని సీఈఓ ముఖేష్ వెల్లడించారు. అంటే ఆ లెక్కన పిన్నెల్లికి దాదాపు 7 ఏళ్ల శిక్షతోపాటు, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నమాట.

ప్రస్తుతం పిన్నెల్లి, ఆయన సోదరుడు తెలంగాణలో తలదాచుకున్నారు. గన్‌మెన్-డ్రైవర్లను మాత్రమే అరెస్టు చేశారు. సంగారెడ్డి సమీపంలోని బాత్రూమ్ షింకులు, కంవర్డులు తయారుచేసే కంపెనీకి చెందిన గెస్టుహౌస్‌లో ఉండగా, పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ దానిని ఇప్పటిదాకా ఎవరూ ఖరారు చేయలేదు. కానీ నేపాల్ వెళ్లే ఆలోచనలో ఉన్న పిన్నెల్లికి ..హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ చానెల్ సీనియర్ రిపోర్టరు తన చానెల్ కారులోనే, రక్షణ కల్పిస్తున్నారన్న వార్తలు సోషల్‌మీడియాలో గుప్పుమంటున్నాయి.

పిన్నెల్లికి అత్యంత సన్నిహితుడైన సదరు రిపోర్టరు.. మాచర్ల వచ్చినప్పుడు ఆయన గెస్టుహౌసులోనే సేదదీరేవాడని, పిన్నెల్లికి అనుకూలంగా ఉండని ఒక స్టాఫ్ రిపోర్టన్‌ను ఆ టీవీ నుంచి తొలగించారని గుంటూరు జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీకి అనుబంధంగా ఉండే ఆ టీవీ చానెల్ అధిపతికి.. సదరు సీనియర్ రిపోర్టరు అత్యంత సన్నిహితుడు కావడంతో, మాచర్ల ఎమ్మెల్యే ఆ టీవీ చానెల్‌కు చెందిన వాహనంలోనే హైదరాబాద్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ సోషల్‌మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. అందులో నిజం ఎంతో పోలీసుల విచారణలో తేలాల్సిఉంది.

ఇక ‘మాచర్ల ఎమ్మెల్యే చాలా మంచివాడ’ంటూ సీఎం జగనన్న చేసిన ప్రసంగ వీడియోను అడ్డుపెట్టుకుని.. సోషల్‌మీడియా సైనికులు జగనన్నను తెగ చతుర్లాడుతున్నారు. పిన్నెల్లి అన్న చాలా మంచోడు. పాపం సంపాదన కూడా అంతంతమాత్రమే. ఆయనను గెలిపిస్తే ఇంకా పైకి తీసుకువెళతానన్న జగనన్న సర్టిఫికెట్ ఇచ్చింది ఈయనకేనా అని కొందరు… మంచోడు మంచోడంటే మంచమెక్కి ఒంటేలు పోసినట్లుంది జగన్ పిన్నెల్లికి ఇచ్చిన మంచితనం సర్టిఫికెట్ అని ఇంకొందరు.. ఈవీఎం పగలకొట్టిన ఈ మంచోడికి ఇంకో మంచోడు భలే సర్టిఫికెట్ ఇచ్చాడులే అని మరికొందరు.. సోషల్‌మీడియాలో తెగ చతుర్లాడుతుంటే, వైసీపీ భక్తశిఖామణులకు తలకొట్టేసినంత పనవుతోందట.

Leave a Reply