యువత కోసం.. భవిత కోసం టీడీపీ మళ్లీ రావాలి

– ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఏపీ టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం. రెండున్నరేళ్లల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని రేపు అధికారంలోకి రావడానికి కృషి చేస్తున్నారు. మీ త్యాగం, తెగువ మర్చిపోలేనిది. మార్చి 29 నాటికి తెలుగుదేశం పార్టీ పెట్టి 40 ఏళ్లు పూర్తి అవుతుంది. అధికారం, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే పరమావధిగా భావించి పని చేశాం. అధికారంలో ఉన్నప్పుడు పేదరికాన్ని నిర్మూలన దిశగా పని చేశాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల ఉద్యమాలు చేశాం.

దేశంలో మొట్ట మొదటిసారిగా దుర్మార్గమైన ముఖ్యమంత్రి, దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో రావడం ధౌర్బాగ్యం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు అవినీతికి పాల్పడి 16 నెలలు జైళ్లో ఉన్నాడని తెలిసినా ప్రజలు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఇన్ని సీట్లు వచ్చాయి కాబట్టి పరిపాలన బాగా చేస్తారని అందరూ భావించారు. కాని రెండున్నరేళ్లుగా ఆయన చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు సంబంధం లేదు. రాష్ట్రంలో నేను, నా రాజకీయ పార్టీ తప్పా మరొకరు, మరో పార్టీ ఉండకూదని జగన్ రెడ్డి భావించి ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించారు.

తెలుగుదేశం పార్టీని అణచివేసేందుకు ప్రయత్నించారు.కాని తెలుగుదేశం పార్టీ వైసీపీలా గాలికి పుట్టిన పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే శ్రామికల చెమట్లోంచి, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీని నాశనం చేయడం, ఇబ్బంది పెట్టడం నీ వల్ల, నీతండ్రి, నీముత్తాత వల్ల కాదని హెచ్చరిస్తున్నాం. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని మా ఆస్తులు తాకట్లు పెట్టి అభివృద్ధి చేశాం. కాని జగన్ రెడ్డి కక్షపూరితంగా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ప్రలోభాలకు గురి చేసినా, ఆస్తులు ధ్వంసం చేసినా, కేసులు పెట్టినా లొంగ లేదు. వీళ్లు మొండి వాళ్లని గ్రహించి చివరకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఇంటిపై దాడి చేయడం జగన్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా? చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులకు గురి చేయాలని తప్పులను ఎత్తి చూపాలని ప్రయత్నించి భంగపడ్డారు.

జగన్ రెడ్డి జీవితాంతం తపస్సు చేసినా చంద్రబాబుపై వెల్లిత్తి చూపించలేవు. ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందంటూ తప్పుడు కథనాలు అల్లారు. టీడీపీ హయాంలో విద్యార్ధులు, యువత భవిష్యత్ కోసం డిజైన్ టెక్, స్కిల్ డవలప్ మెంట్, సీమన్స్ కలిసి రూ.3,300 కోట్లతో ఒక ప్రాజెక్టును 40 సెంటర్లల్లో ఏర్పాటు చేశాం. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వానిది, 90 శాతం సీమెన్స్ ది. దిక్కుమాలిన ముఖ్యమంత్రి రెండున్నరేళ్లల్లో ఇటువంటి ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారు. 40 సెంటర్లలో ఐటెమ్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.370 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.250 కోట్లు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన అనుయాయులు తినేశారని జగన్ రెడ్డి అబద్దపు ప్రచారం చేశారు.

ఒక ప్రైవేట్ యాడింగ్ కంపెనీ ద్వారా ఆడిట్ చేసించి, ఒక్క ఐటెమ్ కూడా స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లకు వెళ్లలేకపోయినా డబ్బులు చెల్లించారని సీఐడీ తో తప్పుడు కేసులు పెట్టారు. ఈ డబ్బంతా మాకు దొరికింది, సింగపూర్ కు వెళ్లిందని సాక్షిలో నేడు అబద్దపు రాతలు రాయించారు. 40 సెంటర్లలో ఒక ఐటెమ్స్ రాలేదని అంటున్నారు కాని నిజంగా మీ అధికారులు ఎక్కడైనా వెరిఫికేషన్ చేశారా? ఎక్కడో కాదు ఇడుపుల పాయలోని త్రిబుల్ ఐటీలో సీమెన్స్ పెట్టిన వస్తువులన్ని ఉన్నాయో లేదో వెరిఫై చేసేందుకు నాతో నువ్వు వస్తావా జగన్ రెడ్డి. అక్కడ ఐటెమ్స్ లేకపోతే నువ్వు చెప్పిన శిక్షకు మేము సిద్దపడతాం. ఐటెమ్స్ ఉంటే మేము చెప్పిన శిక్షకు నువ్వు సిద్దపడతావా? అన్ని ఐటమ్స్ వచ్చినట్లుగా కాలేజీ యాజమాన్యం వాళ్లు ఒక లెటర్ కూడా ఇచ్చారు. కాని జగన్ రెడ్డి మాత్రం ఎక్కడా ఐటెమ్స్ లేవని చెప్పమని ఫోరన్ సిక్ వాళ్లకు మాయ మాటలు చెప్పారు.

టీడీపీ హయాంలో ఐటెమ్స్ కాలేజీలకు అందాయో లేదో వెరిఫై చేసేందుకు 16 మంది ఐఏఎస్ అధికారంలోకి కమిటీ కూడా వేశాం. అందులో ఒక సామాన్యమైన వ్యక్తి, రాష్ట్రానికి మేలు చేద్దామని గంటా సుబ్బారావు వస్తే నేడు ఆయనపై కేసు పెట్టారు. లక్ష్మీనారాయణపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. గత 5 రోజుల నుంచి డిజైన్ టెక్ వారిపై ధర్డ్ డిగ్రీని ప్రయోగించి ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పమని తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. ఆయన పేరు చెబితే మీకు డబ్బులు ఇస్తాం. మీకు రెడ్ కార్పెట్ వేసి సాధరంగా పంపిస్తామని సాక్షి మేనేజర్, ఈ దొంగలు ప్రయత్నిస్తున్నారు.

నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతికి నీ అకౌంట్లో పడ్డాయి. కాని చంద్రబాబు నాయుడు, లోకేష్ అకౌంట్లు చెక్ చేసుకో నీలా అవినీతి పాల్పడే బుద్ది మాది కాదు. నువ్వు అవినీతి చేశావని సాక్షాత్తు ఈడీ చెప్పింది. రేపు టీడీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. గడిచిన 5 నెలలుగా టీడీపీ సముద్రపు కెరటాల్లా స్పీడ్ పెంచింది. దానికి నాయకత్వం వహించాల్సిన గురుతరమైన బాధ్యత మనందరిపై ఉంది.

రెండున్నరేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటుబడింది. మోసకారి సంక్షేమం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చంపేశారు. ఇరిగేషన్ కు పైసా ఖర్చు చేయలేదు. ధరలు ఆకాశానంటున్నాయి. రోడ్లు అద్వానంగా మారాయి, ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నా జగన్ రెడ్డికి పట్టదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి సాలువాలు కప్పి వస్తున్నారని జగన్ రెడ్డి, బుగ్గన రెడ్డిలు అవహేళన చేశారు. కాని వాళ్లు రెండున్నరేళ్లుగా చేసింది ఏంటి? ఢిల్లీ వెళ్లి సాలువాలు కప్పి వెంకటేశ్వరస్వామి ఫోటోలు ఇచ్చి కేసుల నుంచి రక్షించమని కోరుకుంటున్నారు.

ఏడాదికి 5 లక్షల ఇళ్లు కడతామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి ఇంత వరకు ఒక్క ఇళ్లు కట్టలేదు. గతంలో కట్టిన ఇళ్లకు ఓటిఎస్ పేరుతో పేదల మెడలకు ఉరితాళ్లు వేస్తున్నారు. దీనిపై ప్రజలను చైతన్యంవంతులుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి ఆవశ్యకం. అందుకే మేథావులు, విద్యావంతులు కదలి రండి రాష్ట్రానికి బాగుచేసుకుందామని తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని కమిటీలు వేసుకున్నాం. ఈ నెలలోనే సభ్యత నమోదు ప్రారంభించబోతున్నాం. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని అందరిని కోరుతున్నాను.

Leave a Reply