-
జిందాలకు .. జిందాబాదక్కో
-
‘జిందా’.. జింతాక్క .. ‘జిందా’.. జింతాక్క..త
-
బీదల పార్టీనా.. బిందాస్ పార్టీనా?
-
శృతిమించుతున్న జగనేయుల శృంగారకాండ
-
‘వైసీపీ డర్టీ పిక్చర్’ సూపర్‌హిట్
-
ముంబుయి టు బెజవాడ సాక్షిగా వైకామ ఖా‘కీచకం’
-
సకల శాఖామంత్రి డైరక్షన్.. ఐపిఎస్‌ల ఓవర్ యాక్షన్
-
పలగాని లాడ్జిలో హీరోయిన్ను పెట్టి ఖాకీల కాపలా
-
జడ్జికి మెయిల్ పెట్టి జిందాలకు ఝలక్ ఇచ్చిన హీరోయిన్
-
సలహాదారే సూత్రధారి.. కుక్కుల పాత్రధారేనా?
-
అడ్డం తిరిగిన ‘వైకామ’కుల కథ
-
పోలీసులా? బ్రోకర్లా అంటూ నెటిజన్ల ఫైర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇది సిగ్గే సిగ్గుపడే కథ. శృంగారకాండలో కూడా కనిపించని ఖా‘కీచకం’. పోర్ను స్టార్లు కూడా ఈర్ష్యపడే నటన. ఒకరికి మంచిన మరొకరి ‘శృంగార’నైషధం. రసిక శిఖామణుల ఉన్మాద చేష్టలకు, శృంగారమే కళ్లుమూసుకునేంత ‘మదపుకాండ’లో ఎన్నో అంకమో తెలియని ఎపిసోడ్. రావణాసురుడి మాదిరిగా.. సినిమా తారను ముంబయి నుంచి చెరబట్టి బెజవాడలో దాచిన రావణకాండ. ఇదంతా దేశంలోని ఓ అగ్రస్థాయి పారిశ్రామికవేత్త కళ్లలో మెరుపుల కోసం! ఆయన విసిరిన పచ్చనోట్ల ‘కుక్కల’ బిస్కెట్ల కోసం!! ఆ సినీతార బాహువుల్లో బందీగా ఉన్న సదరు బడా ‘జిందా’బాబు ముద్దుల కొడుకుతో పెళ్లి ఆపడం కోసం!!!
ఎక్కడ ముంబయి? ఎక్కడ కృష్ణా జిల్లా? ఎందుకీ పెట్టుడు కేసు? ఎవరి కోసం? ఎందుకోసం? పోనీ ఇంత చచ్చీచెడి పోలీసుల సాయంతో, ముంబయి నుంచి ఎత్తుకొచ్చిన ఆ తార కిడ్నాప్ కథ, సక్సెయిందా అంటే అదీ లేదు. ఆమెను చెరబట్టి బలవంతంగా రాయించుకున్న ఆ కాగితానికి విలువ లేదట. ఎందుకంటే.. ‘అతనికంటే ఘనురాలు ముంబయి మల్లక్క ’.. ఈ కథంతా జడ్జిగారికి మెయిల్లో, చందమామ మాదిరిగా చెప్పేసిందట. తన ఫిర్యాదుపై విచారించమని రిక్వెస్టు చేసిందట.
అంటే నా కేసు రిఫర్ చేయవద్దు. విచారించండి అని ఆ తారామణి రిక్వెస్టు పెట్టడంతో, జడ్జిగారు రిఫర్ చేయలేదట. అంటే కేసు ఇంకా సజీవంగా ఉన్నట్లే. వార్నీ… మళ్లీ మరో ట్విస్టు. కలసి వెరసి ఇదో వైసీపీ డర్టీపిక్చర్-పార్టు-5 ఎపిసోడ్. తెలుగు టీవీ జీడిపాకం సీరియళ్లు కూడా సిగ్గుపడేంత వై‘కామ’ పార్టీ నిర్మిస్తున్న శృంగారసీరియల్ ఇది.
మళయాళం-తమిళ డబ్బింగ్ బూతు సినిమాల టైటిల్ కింద.. పెద్దలకు మాత్రమే అని చిన్న హెచ్చరిక ఉంటుంది. ఇప్పుడు వైకామ పార్టీదీ అదే సినిమా కథ. వివరాల్లోకి వెళితే.. ముంబయి సినిమా భామను బెజవాడకు ఎత్తుకొచ్చి, ఆమెపై కృష్ణాజిల్లాలో కేసు పెట్టి, జైలుకు పంపించి, నేను ఈ పెళ్లి చేసుకోనని రాతపూర్వకంగా రాయించుకున్న వైనం వెనుక పెద్ద కథే నడించిదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కథకు ప్రధాన సూత్రధారి నాటి సకలశాఖ మంత్రి అయితే.. ముగ్గురు ఐపిఎస్ అధికారులు పాత్రధారులుగా తేలింది.
అప్పట్లో విజయవాడ సీపీగా ఉంటూ, మీడియాను హెచ్చరిస్తూ ప్రకటనలు జారీ చేయడంతోపాటు, జగన్‌కు వీరభక్తుడిగా పేరొందిన ఐపిఎస్ మార్గదర్శకంలో కథ నడిచిందంటున్నారు. నిజానికి సకల శాఖ మంత్రి, అప్పటి నిఘా దళపతికి దీనిసంగతి చూడమని ఆదేశించగా.. ఆయన సీపీని ముంబయి భామ సంగతి తేల్చమని ఆదేశాలిచ్చారని.. నాటి డిసీపీ, అడిషినల్ డీసీ, మరికొందరు ఖాకీలు దానిని అమలుచేశారన్నది ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్న కథనం.
నిజానికి జరిగిందేమిటంటే.. ‘జింద’గీ గురించి బాగా తెలిసి, దేశంలోనే పేరున్న ఓ పారిశ్రామికవేత్త కొడుకు చిన్న ‘జిందా’-ముంబయి భామ ఇద్దరూ చాలాకాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట. సదరు బిగ్‌షాట్‌కు చెందిన కంపెనీలతో అప్పట్లో జగనన్న సర్కారు చాలా ఒప్పందాలు చేసుకుంది. నెల్లూరులో బోలెడంత భూమి కట్టబెట్టింది. విశాఖ మన్యంలో లేటరైట్ కూడా ధారాదత్తం చేసేందుకు ప్రయత్నించింది. స్టీలు, మైనింగ్ రంగంలో అందెవేసిన సదరు బిగ్‌షాట్ ‘జిందా’కు, హటాత్తుగా కొడుకు రూపంలో బోలెడంత కష్టం వచ్చిపడింది.
చిన్న ‘జిందా’తో ప్రేమాయణం కొనసాగిస్తున్న ముంబయి భామ, తనను పెళ్లిచేసుకోమని అడిగిందట. ఆ విషయం తెలిసిన పెద్ద ‘జిందా’ అగ్గిరాముడయ్యారు. దానితో భయపడిన చిన్న ‘జిందా’ పెళ్లికి నో చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో..చిన్న ‘జిందా’ తనపై అత్యాచారం చేశాడంటూ, ఆ భామ ముంబయి పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. దీనితో బిగ్ షాట్ అయిన పెద్ద ‘జిందా’ కలవరపడ్డాడు. ఈ వ్యవహారం మీడియాలో వస్తే ఎక్కడ తన వ్యాపార సామ్రాజ్యం, పరువుపోతుందోనని తెగ కలవవపడ్డారు.
ఈ లోగా జగన్‌తో భేటీ అయేందుకు బెజవాడ వచ్చిన బిగ్‌షాట్ పెద్ద ‘జిందా’.. తన కొడుకు కష్టాన్ని జగనన్నకు మొరపెట్టుకున్నారట. అన్నీ విన్న జగనన్న.. ఓస్ ఇంతేనా అదెంతపనంటూ.. సకల శాఖ మంత్రికి కేసు అప్పగించారట. దానితో పెద్ద ‘జిందా’కు అభయమిచ్చిన సకల శాఖమంత్రి, ఈ వ్యవహారాన్ని డీల్ చేయమని నిఘా బాసుకు పురమాయించారట. ఆయన జగనన్న వీరవిధేయుడైన నాటి కమిషనర్‌కు కేసు అప్పగించి, ముంబయి భామ సంగతి తేల్చేయమని ఆదేశించారట. దానిని సుగ్రీవాజ్ఞలా పాటించిన సదరు కమిషనర్.. తన మాట వినే మరికొందరు పోలీసులను పిలిచి, వారిని ముంబయికి పంపించారు.
అంతకుముందు.. ఈ ‘కుక్కుల’ పంచాయితీని అప్పటి జడ్పీ చైర్మన్ కొడుకు భుజం మీద తుపాకీ పెట్టి, ముంబయి భామను పేల్చే వ్యూహానికి తెరలేపారు. అదేమిటంటే…సదరు ముంబయి భామ తనను బ్లాక్మెయిల్ చేసిందంటూ కృష్ణాజిల్లాలోని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజానికి సదరు ‘కుక్కల’, ముంబయి భామపై అంతకుముందు ఒక ఫంక్షన్లో మనసుపడ్డారట. దానితో తెలివైన ఆ భామ ‘కుక్కుల’ జేబును బాగానే కోసిందట. ఈ ‘కుక్క’ను పట్టుకుని ఐపిఎస్ బుర్రలు భారీ స్కెచ్ వే శారట.
దానిని పట్టుకుని..లీగల్‌గా ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి కాబట్టి, కుక్కల ఫిర్యాదును అడ్డం పెట్టుకుని, బెజవాడ పోలీసులు ముంబయిలో కాలుపెట్టారు. అక్కడే ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి బెజవాడకు తీసుకువచ్చారు. బిగ్‌షాట్ ‘బిందా’ కొడుకుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పెళ్లి చేసుకోనని ఒత్తిడి చేయనంటూ బలవంతంగా రాయించుకున్నారట. దానికోసం ఆమెను ఒక గవర్నమెంటు గెస్టుహౌస్లోనే ఉంచారట.
అక్కడ ఆమెను నానా చిత్రహింసలకు గురిచేశారట. దానితో పోలీసుల ఒత్తిళ్లకు లొంగి, సంతకం చేసిందిట. తర్వాత జైలుకు పంపించిన పోలీసులు బెయిల్‌పై బయటకు వచ్చిన ముంబయి భామను విడిచిపెట్టలేదట. ఆమెను ఇబ్రహీంపట్నంలో రోడ్డు పక్కనే ఉండే పలగాని లాడ్జిలో ఉంచారట.
ఎందుకంటే.. ఆమె బిగ్‌షాట్ ‘జిందా’పై పెట్టిన రేప్ కేసు ముంబయి కోర్టులో విచారణకు వస్తుంది కాబట్టి. ఫిర్యాదుదారైన ఆమె ఆ సమయంలో అక్కడ లేనందున, జడ్జి ఆ కేసును రిఫర్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే కేసు నీరుగారినట్లే. ఆ రకంగా.. ఒకవేళ బిగ్షాటయి పెద్ద ‘జిందా’ పేరు రేప్ కేసు బయటకొచ్చినా.. ఫలానా హీరోయిన్‌కు బ్లాక్మెయిల్ చేసే ప్రవృత్తి ఉందని, అందుకే ఆమెను ఆంధ్రాలో అరెస్టు చేశారన్న కారణం చూపి, తాను పులుకడిగిన ముత్యం మాదిరి బయటపడాలన్నది పెద్ద ‘జిందా’ అసలు వ్యూహం.
అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. ముంబయి భామ ఈ వ్యవహారంలో చాలా తెలివిగా వ్యవహరించడం పెద్ద ‘జిందా’కు, ఆమెను ఎత్తుకొచ్చిన ఆంధ్రాపోలీసుల కష్టానికి ప్రతిఫలం దక్కకుండా పోయేందుకు కారణమయింది. అదెలాగంటే.. పోలీసుల పహారాలో ఉన్న ముంబయి భామ.. తన పరిస్థితి వివరిస్తూ ముంబయి కోర్టు జడ్జికి ఈ మెయిల్ పెట్టిందట. మీరు కేసును రిఫర్ చేయవద్దు. కేసు విచారించండి అని మెయిల్ పెట్టిందట. దానితో ఆమె బిగ్‌షాట్ అయిన చిన్న ‘జిందా’ మీద పెట్టిన రేప్ కేసు ఇంకా సజీవంగా ఉన్నట్టయింది. దానితో పాపం.. సకల శాఖమంత్రి, కమిషనర్, పోలీసుల కష్టం బూడిదలో పోసిన పన్నీరయింది. అయితే.. ఈ కేసులో సకలశాఖమంత్రి కష్టానికి భారీ స్థాయిలోనే ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా.. ముంబయి భామను పోలీసులు ఎత్తుకొచ్చిన వైనం మీడియాలో గబ్బవడంతో, సోషల్‌మీడియా సైనికులు పోలీసులపై కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ‘మీరు పోలీసులా? బ్రోకర్లా?’.. మీది బీదల పార్టీనా బిందాస్ పార్టీనా?.. ఇలాంటి బ్రోకరు పనులు చేసేందుకేనా మిమ్మల్ని జనం సొమ్ముతో పందెం కోళ్ల మాదిరి మేపుతోంది?.. సకల శాఖమంత్రి చెబితే ఎవరినంటే వారిని ఎత్తుకొస్తారా?.. వైకామ పార్టీ అంతా రావణాసురుల మయమయింది.. జగనన్నా మీ పార్టీలో ఇంకా ఎంతమంది శృంగార పురుషులున్నారు?.. మేం ఈ కిరాతకాలు ఇంకా ఎన్ని వినాలి?.. జిప్పులు తీసి చూపించిన మృగాళ్లే మీకు నాయకులా? ఇంతకంటే పార్టీని వై‘కామ’గా మార్చేయండి. దరిద్రం వదిలిపోతుంది.. ఈ సిగ్గుమాలిన తనానికి సిగ్గుపడకుండా మళ్లీ ఎదురుదాడా?.. జగనన్నా ఓ పనిచేయండి. మా పార్టీ పెద్దలకు మాత్రమే అని బోర్డు పెట్టండి.. అంటూ అంబటి, అవంతి, గోరంట్ల మాధవ్, విజయసాయిరెడ్డి, అనంతబాబు ఫొటోలు పెట్టి మరీ నిప్పులు చెరుగుతున్నారు.
ఈలోగా తెరపైకి వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. అసలు ఈ కథలో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రేమిటో తేల్చాలని, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని గళమెత్తారు. అయితే ‘అమాయకుడైన’ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. అసలు తనకు ఈ గత్తరతో సంబంధం లేదని, తనపేరును గబ్బు పట్టించిన మీడియాపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.