-కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్
హైదరాబాద్: బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నాం, రాజకీయ ప్రేరణ తో కవిత పై పెట్టిన అక్రమ కేసు. 493 సాక్షులను విచారించినప్పటికీ ఒక్క రూపాయి మనీ లాండరింగ్ జరిగినట్లు ED, CBI నిరూపించలేక పోయింది. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మనోనిబ్బరాన్ని దెబ్బ తీయడానికి, బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా గా తేలిపోయింది.
న్యాయపరంగా కవిత కు బెయిల్ వస్తే, బిజెపి కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పు ను తప్పు పడుతూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు, కేంద్ర మంత్రి గా ఉన్న బండి సంజయ్ , ఎంఎల్సీ మహేష్ గౌడ చేసిన వ్యాఖ్యలు కోర్ట్ సుమోటో గా తీసుకోవాలని కోరుతున్నాం. బీజేపీ తో బీఆర్‌ఎస్ కొమ్ముక్కు అయ్యిందని కాంగ్రెస్ అనడం హాస్యాస్పదం. అప్ పార్టీ నాయకునికి బెయిల్ రావడానికి కాంగ్రెస్ బీజేపీ తో కొమ్ముక్కయ్యిందా అని ప్రశ్నిస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోనూ, రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం లో ను విపలం కావడాన్ని ప్రజా క్షేత్రం లో బీఆర్‌ఎస్ నిలదీస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఎదురుదాడులు చేస్తున్నది, తెలంగాణ లో బలమైన ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ ను మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. కవిత విడుదల పై రాజకీయాలు మానుకొని హామీల పై దృష్టి పెట్టండి. మహిళా నేత కు బెయిల్ వస్తే రెండు పార్టీలు ఆగమాగం కావడం విచారకరం.