బాబూ.. నువ్వేంటీ? నీ వయసేంటీ?
డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్
హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్
సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్
నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం
మాకోసమైనా రిస్కులు చేయకయ్యా
నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం
ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నావ్. నీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే వుంటుందిలే గానీ, కాస్త నీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! ఏంటీ, నువ్వేమన్నా బాలాకుమారుడివి అనుకుంటున్నావా? నీకు అర్థమవుతోందో లేదోగానీ, నువ్వు డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్!
గతంలో కూడా ఇలాగే పనిచేశాను.. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తానంటే ఎలాగయ్యా? అప్పట్లో అంటే నీ వయసు 57.. ఇప్పుడేమో 75. నీ వయసునైనా గౌరవించి కాస్త ఈ రకమైన హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్!
నువ్విప్పుడు చిన్న పిల్లాడితో సమానం. నిన్ననో, మొన్నో ఓ వీడియోలో చూశా.. నువ్వేంటీ? నీ వయసేంటీ?
పాతిక కిలోల బస్తాని లేపి అవతల పెట్టేశావు. నీ వయసుకి ఇలాంటి పనులు చేయడం కరెక్టా చెప్పు? పాతిక కిలోల బస్తాని లేపాలంటే పాతికేళ్ళ వయసున్న కుర్రాళ్ళు కూడా వామ్మో అంటారు.. నువ్వేంటయ్యాబాబు..
చిటుక్కుమని లేపేశావ్.. లటుక్కుమని పక్కన పెట్టేశావ్. అయినా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నీకేంటి బాబాయ్? అసలు నీకు చెప్పడం మా వల్ల కాదు స్వామీ…
ఈ వయసులో నిన్ను అపురూపంగా చూసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వేమో సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్. ఎవరి మాటా వినడు చంద్రయ్య అన్నట్టుగా ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నావ్.
అవును గానీ, ఈరోజు నువ్వు బుడమేరుకి గండి పడిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫంటు ఎక్కావు. అప్పుడు లైఫ్ జాకెట్ వేసుకోవాలని తెలియదా? దానికితోడు కాలు స్లిప్పయితే వాగులో పడిపోయేలా వున్న ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళడమేంటి? కరెక్ట్.గా అప్పుడే రైలు రావడమేంటి?
సమయానికి చూసుకోకపోతే ఏమైపోయేది? యో.. చూసుకోబళ్ళా? నీ పక్క నుంచి రైలు దూసుకువెళ్తున్న వీడియో చూసి మాకు గుండెలు గుబగుబలాడాయి. ఫిలమెంటు రాలిపోయినంత పనైంది. రైలు పక్కన వున్న నువ్వు మాత్రం.. నాకిలాంటివి మామూలే అని సంతూర్ మామ్ లాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి నిల్చున్నావ్. అంతేలే, అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేల్చినా చాలా లైట్‌గా తీసుకున్న మొండిఘటానివి నువ్వు.
అయినా గండి పడిన చోట సిట్యుయేషన్ ఎలా వుందో అధికారులు చెబుతారు కదా… నువ్వెందుకు లింగులింగుమంటూ వెళ్ళావ్? నేను వెళ్ళాల్సిందే.. నేను చూడాల్సిందే అంటావ్..
ఇలాంటప్పుడే నిన్ను చూస్తే కోపం వస్తుంది. ముందు నువ్వు సేఫ్‌గా వుండాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు!
ఇదిగో బాబాయ్.. నువ్వు మర్యాదగా మేం చెప్పినట్టు వింటావా? లేక భువనమ్మకి చెప్పి నిన్ను కంట్రోల్ చేయించాలా? ఏదో మా పిచ్చిగానీ, నువ్వు ఆమె మాట కూడా వినేరకం కాదు.
చూడు చంద్రబాబు బాబాయ్… నీ జీవితం నువ్వు ఎప్పుడో జీవించేశావ్.. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం! నీ జీవితం ఇప్పుడు మా జీవితం కాబట్టి, నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు వుంటానంటే మేం ఒప్పుకోం.
మన రాష్ట్రం విభజనతో సగం నాశనం అయింది. ఆ దరిద్రుడు మిగతా సగాన్ని కూడా నాశనం చేసి సర్వనాశనం చేసిపారేశాడు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడేది నువ్వు తప్ప మరెవరూ కాదు.. మాకు నువ్వు తప్ప మరో దిక్కు లేదు.
అందువల్ల నువ్వు నీకోసం కాకపోయినా… మాకోసమైనా రిస్కులు చేయకయ్యా మహానుభావా! నువ్వు ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టాలి. ఆ నీచ, నికృష్టుడైన జగన్ బారి నుంచి మమ్మల్ని కాపాడాలి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం కావాలి.. ఇదంతా చేయడానికి… ఇదంతా చూడటానికి..
నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి. నీకు దణ్ణం పెడతాం నాయనా.. నీ వయసుకు మించిన సాహసాలు చేయకు.. మాకు టెన్షన్ తెప్పించకు.
ఎందుకంటే, నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం.. అంతే!