– మళ్లీ కేంద్రంపై నెపం పేరుతో డ్రామాలాడతారా?
– విపత్తు నిధులు రాష్ట్రంవద్ద రూ.1911 కోట్లు ఉన్న సంగతి మర్చిపోయారా?
– వాటిని ఎందుకు ఖర్చు చేయడం లేదు?
– గతేడాది పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం
– ప్రతిదానికి కేంద్రాన్ని బదానం చేసే కుట్రలు చేస్తున్నారు
– అన్నీ కేంద్రమే ఇస్తే ఇక కాంగ్రెస్ పాలన ఎందుకు?
– తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
– కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ గోడం నగేశ్
హైదరాబాద్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, కాంగ్రెస్ 23 నెలల పాలనలో వర్షాలు, వరదలతో తెలంగాణ రైతాంగం దారుణంగా నష్టపోతున్నా పంట నష్ట పరిహారం ఇవ్వకుండా అరిగోస పెడుతున్నారు.
విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినా వాటిని వాడుకోలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ దే. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.1911 కోట్ల 61 లక్షలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుకోవడం కూడా కాంగ్రెస్ నేతలకు చేతకావడం లేదు.
పదేపదే కేంద్రం సాయం చేయడం లేదంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకోవడం సిగ్గు చేటు. అన్నీ కేంద్రమే ఇవ్వాలంటే ఇగ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎందుకు దండుగ? పాలన చేతగాకుంటే తప్పుకోండి. అంతేగానీ కాంగ్రెస్ చేతగానితనాన్ని బీజేపీపై నెట్టి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలనుకోవడం మూర్థత్వం.
పంట కోల్పోయి కొందరు, ఇండ్లు కోల్పోయి మరికొందరు, సర్వం కోల్పోయి ఎంతో మంది అల్లాడుతుంటే వారికి భరోసా కూడా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలకు అండగా నిలవాలి. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వాలి. తక్షణ సాయంగా ఎకరాకు రూ.30 వేలు ప్రకటించాలి. గతంలో నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాల్సిందే. లేనిపక్షంలో జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.